Just In
- 2 hrs ago
525 హార్స్ పవర్ వి8 ఇంజన్‌తో వస్తున్న మోస్ట్ పవర్ఫుల్ డిఫెండర్ వి8
- 2 hrs ago
45 లీటర్ల ఇంధన ట్యాంక్‌లో 48 లీటర్ల పెట్రోల్.. దీనితో మొదలైన గొడవ.. చివరికి ఏమైందంటే
- 3 hrs ago
సూపర్ సోకో నుండి మూడు సరికొత్త ఎలక్ట్రిక్ టూవీలర్స్
- 4 hrs ago
చెన్నైలో కొత్త డీలర్షిప్ ప్రారంభించిన వోల్వో.. పూర్తి వివరాలు
Don't Miss
- Sports
రెండు రోజుల్లోనే 22 టెస్టులు పూర్తి.. ఇంగ్లండ్ జట్టుదే ఆధిపత్యం!! భారత్ ఎన్నిసార్లంటే?
- Movies
మహేశ్‌కు మళ్లీ కథ చెప్పిన సక్సెస్ఫుల్ డైరెక్టర్: ఈ సారి మరో ప్రయోగం అంటూ రిప్లై
- News
Same Sex marriage: మోడీ సర్కార్ నిర్ణయంపై భగ్గుమంటోన్న స్వలింగ సంపర్కులు: తొక్కేశారంటూ
- Finance
గుడ్‌న్యూస్, 30,000 మందికి క్యాప్‌జెమిని ఉద్యోగాలు! ఫ్రెషర్స్, ఎక్స్‌పీరియన్స్‌కు అవకాశం
- Lifestyle
ఈ 4 రాశుల వారికి లీడర్ షిప్ క్వాలిటీస్ ఉండవు... ఈ జాబితాలో మీ రాశి ఉందేమో చూసెయ్యండి...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
రాయల్ ఎన్‌ఫీల్డ్ అభిమానులకు గుడ్ న్యూస్.. 'మీటియోర్' విడుదల తేదీ ఖరారు!
రాయల్ ఎన్‌ఫీల్డ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రూయిజర్ మోటార్‌సైకిల్ "మీటియోర్" విడుదల తేదీని కంపెనీ ఖరారు చేసింది. నవంబర్ 6, 2020వ తేదీన తమ సరికొత్త 350సీసీ మోటార్‌సైకిల్ మీటియోర్‌ను మార్కెట్లో విడుదల చేయనున్నట్లు రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రకటించింది.

భారతీయ మార్కెట్లో ఈ మోడల్‌ను విడుదల చేయడానికి ముందే కంపెనీ ఇందుకు సంబంధించి రెండు కొత్త టీజర్ వీడియోలను కూడా విడుదల చేసింది. ఈ టీజర్ వీడియోల్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ మోడల్‌ను కంపెనీ పూర్తిగా వెల్లడి చేయకపోయినప్పటికీ, ఇందులో కొన్ని అంశాలను మనం గమనించవచ్చు.
రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ మోటార్‌సైకిల్‌ను కంపెనీ ఇప్పటికే భారత రోడ్లపై విస్తృతంగా పరీక్షించిన సంగతి తెలిసినదే. రాయల్ ఎన్‌ఫీల్డ్ భారత మార్కెట్ కోసం ప్లాన్ చేసిన కొత్త తరం మోడళ్లలో మీటియోర్ మొదటిది. మీటియోర్ 350 మోడల్‌ను పూర్తిగా కొత్త ఛాస్సిస్‌పై నిర్మించారు. ఇందులో కొత్త ఫీచర్లు మరియు సరికొత్త ఇంజన్ వంటి విశిష్టతలు ఉన్నాయి.
MOST READ:68 ఏళ్ల వయసులో అందరిని ఆశ్చర్యపరిచిన వృద్ధ మహిళ.. ఇంతకీ ఏం చేసిందో తెలుసా?

ఇక మీటియోర్ విషయానికి వస్తే, పాపులర్ థండర్‌బర్డ్ స్థానాన్ని భర్తీ చేయడానికి వస్తున్న ఈ మోడల్ ఇదివరకటి రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిళ్లలో మునుపెన్నడూ చూడని విధంగా అధునాతన టెక్నాలజీ, స్మార్ట్ కనెక్టింగ్ ఫీచర్లతో అందుబాటులోకి రానుంది. ఈ మోడల్‌ను కొత్త మాడ్యులర్ జే ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించి అభవృద్ది చేశారు. ఇందులో సరికొత్త ఓహెచ్‌సి ఇంజన్‌ను కూడా ఉపయోగించారు.
ఇందులోని కొత్త 346 సిసి ఎయిర్-కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 6,100 ఆర్‌పిఎమ్ వద్ద 20 బిహెచ్‌పి పవర్‌ని మరియు 4,000 ఆర్‌పిఎమ్ వద్ద 27 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇందులో గేర్‌బాక్స్ గురించి పేర్కొనకపోయినప్పటికీ, ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో రావచ్చని తెలుస్తోంది.
MOST READ:నడి రోడ్డుపై పోలీస్ చెంప చెళ్లుమనిపించిన మహిళ.. ఎందుకో తెలుసా

ఈ సరికొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ మోటారుసైకిల్ ఫైర్‌బాల్, స్టెల్లార్ మరియు సూపర్‌నోవా అనే మూడు వేరియంట్లలో లభ్యం కానుంది. ప్రతి వేరియంట్ కూడా విశిష్టమైన ఫీచర్లు, పరికరాలను కలిగి ఉంటుంది.

మీటియోర్ మోటార్‌సైకిల్‌లో స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో కూడిన ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఉంటుందని తెలుస్తోంది. ఇందులోని డిజిటల్ స్క్రీన్‌పై కాల్ మరియు మెసేజ్ అలెర్ట్స్ మరియు టర్న్-బై-టర్న్ నావిగేషన్‌ను వంటి పలు ఫీచర్లు లభించే అవకాశం ఉంది.
MOST READ:మీకు తెలుసా.. భారతదేశంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరగటానికి ప్రధాన కారణం ఇదే

ఈ మోటార్‌సైకిల్‌లోని ఇతర ఫీచర్లలో 17 ఇంచ్ అల్లాయ్ వీల్స్, ముందు భాగంలో 300 మిమీ డిస్క్ మరియు వెనుక వైపు 270 మిమీ డిస్క్ బ్రేక్స్, డ్యూయల్-ఛానల్ ఏబిఎస్ ఉన్నాయి. అలాగే, ముందు వైపు స్టాండర్డ్ 41 మిమీ టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక వైపు 6-రకాలుగా సర్దుబాటు చేయగల సస్పెన్షన్ సెటప్ కూడా ఉంటుంది.

మీటియోర్ 350 డిజైన్‌ను గమనిస్తే, ఇది మరింత రిలాక్స్డ్ మరియు కంఫర్టబల్ రైడింగ్ పొజిషన్‌ను ఆఫర్ చేయవచ్చని తెలుస్తోంది. దీనికోసం ఇందులోని ఈ మోటార్‌సైకిల్‌లో పెరిగిన హ్యాండిల్‌బార్లు, ఫార్వర్డ్ సెట్ ఫుట్‌పెగ్‌లు మరియు తక్కువ ఎత్తు కలిగిన రైడర్ సీట్ హైట్‌లు సహకరిస్తాయి. ఈ మోటార్‌సైకిల్ ఇంధన ట్యాంక్ సామర్థ్యం 15 లీటర్లుగా ఉంటుంది.
MOST READ:ఎలక్ట్రిక్ వాహనాన్ని డ్రైవ్ చేసిన మైనర్ బాలుడు.. తర్వాత ఏం జరిగిందో తెలుసా ?

రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ టీజర్ వీడియోపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350 మోటారుసైకిల్ ప్రస్తుతం భారత మార్కెట్లో అత్యంత హైప్ కలిగిన మోడళ్లలో ఒకటి. రాయల్ ఎన్‌ఫీల్డ్ 350సిసి విభాగంలో చాలా కాలంగా ఆధిపత్యం చెలాయించింది మరియు కొత్త మీటియోర్ 350తో కంపెనీ ఈ స్థానాన్ని మరింతగా పదిలం చేసుకోవాలని భావిస్తోంది. మార్కెట్లో హోండా హెచ్‌నెస్ సిబి350, బెనెల్లి ఇంపీరియల్ 400 మరియు జావా 300 వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.