రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్‌లో మరో అద్భుతమైన ఫీచర్, ఏంటో తెలుసా?

రాయల్ ఎన్‌ఫీల్డ్ భారత మార్కెట్ కోసం మరో కొత్త క్రూజర్ స్టైల్ మోటార్‌సైకిల్‌ను అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసినదే. రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ పేరుతో రానున్న ఈ మోడల్‌ను కంపెనీ ఇప్పటికే భారత రోడ్లపై కంపెనీ విస్తృతంగా పరీక్షిస్తోంది. తాజాగా ఈ మోడల్‌కి సంబంధించిన మరో ఆసక్తికర ఫీచర్ వెల్లడైంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్‌లో మరో అద్భుతమైన ఫీచర్, ఏంటో తెలుసా?

మోటార్‌బీమ్ లీక్ చేసిన వివరాల ప్రకారం, రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350 మోడల్‌లో బ్లూటూత్ ఎనేబల్డ్ కనెక్టింగ్ టెక్నాలజీని ఆఫర్ చేయనున్నారు. ఇందులో హైలైట్ ఏంటంటే, రైడర్ తన ఫోన్‌లో ఆపరేట్ చేసే మ్యాప్స్‌ను బైక్‌కు అమర్చిన టిఎఫ్‌టి డిస్‌ప్లే యూనిట్‌పై టర్న్ బై టర్న్ నావిగేషన్ చేస్తుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్‌లో మరో అద్భుతమైన ఫీచర్, ఏంటో తెలుసా?

సెమీ డిజిటల్-అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌కు పక్కనే గుండ్రటి ఆకారంలో ఈ టిఎఫ్‌టి డిస్‌ప్లే స్క్రీన్‌ను అమర్చారు. ఈ ఎల్ఈడి ప్యానెల్ రైడర్‌కు కావల్సిన సమాచారాన్ని తెలియజేస్తుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ బ్రాండ్ ఈ తరహా స్మార్ట్ కనెక్టింగ్ టెక్నాలజీని ఆఫర్ చేయటం ఇదే మొట్టమొదటి సారి కానుంది.

MOST READ: కొత్త 2020 హోండా జాజ్ విడుదల - ధర, ఫీచర్లు, మార్పులు, వివరాలు

రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్‌లో మరో అద్భుతమైన ఫీచర్, ఏంటో తెలుసా?

మీటియోర్ (తెలుగులో ఉల్కాపాతం అని అర్థం) పేరుతో రాయల్ ఎన్‌ఫీల్డ్ అభివృద్ధి చేస్తున్న ఈ రెట్రో-లుకింగ్ మోటార్‌సైకిల్, ప్రస్తుతం భారత మార్కెట్లో డిస్‌కంటిన్యూ చేసిన థండర్‌బర్డ్ ఎక్స్ సిరీస్ మోడళ్ల స్థానాన్ని రీప్లేస్ చేయనుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ సంస్థ తమ 350సిసి లైనప్‌లో ఈ సరికొత్త మోటార్‌సైకిల్‌ను విడుదల చేయనుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్‌లో మరో అద్భుతమైన ఫీచర్, ఏంటో తెలుసా?

ఈ కొత్త మోటారుసైకిల్‌లో అతిపెద్ద మార్పుగా ఇందులోని కొత్త ఇంజన్ గురించి చెప్పుకోవచ్చు. ఇది ప్రస్తుతం ఉపయోగిస్తున్న 346 సీసీ ఎయిర్-కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్‌ను ఆధారంగా చేసుకొని ఇందులో సరికొత్త ఓవర్‌హెడ్ కామ్‌షాఫ్ట్ (ఓహెచ్‌సి) వెర్షన్‌ను తయారు చేశారు. ప్రస్తుత టాప్పెట్-వాల్వ్ యూసిఈ 350సీసీ ఇంజన్‌తో పోల్చుకుంటే ఇది మరింత బెటర్ ఫెర్మార్మెన్స్ మరియు అధిక మైలేజ్‌ను ఆఫర్ చేయనుంది.

MOST READ: భారత్‌లో డ్యుకాటి పానిగేల్ వి2 విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్‌లో మరో అద్భుతమైన ఫీచర్, ఏంటో తెలుసా?

రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇటీవలే తమ టాప్పెట్-వాల్వ్ యూసిఈ ఇంజన్లను కూడా బిఎస్6 స్టాండర్డ్స్‌కి అనుగుణంగా అప్‌గ్రేడ్ చేశారు. ఈ 346 సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ గరిష్టంగా 19.1 బిహెచ్‌పిల శక్తిని మరియు 28 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్ ఆప్షన్‌తో లభ్యం కానుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్‌లో మరో అద్భుతమైన ఫీచర్, ఏంటో తెలుసా?

రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350 చాలా ఆకర్షణీయమైన డిజైన్ మరియు విశిష్టమైన ఫీచర్లతో మార్కెట్లోకి రానుంది. ఇది పురాతన మోడళ్లను తలపించేలా బాబ్బర్ స్టైల్ లుక్‌ని కలిగి ఉంటుంది. పెద్ద ఫ్యూయెల్ ట్యాంక్, గుండ్రటి ఆకారపు హెడ్‌ల్యాంప్‌లు ఈ డిజైన్‌లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలుస్తాయి.

MOST READ: స్కొడా ఎన్యాక్ ఐవి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఇంటీరియర్ స్కెచెస్ విడుదల

రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్‌లో మరో అద్భుతమైన ఫీచర్, ఏంటో తెలుసా?

ఈ మోటార్‌సైకిల్‌లో సింగిల్-పాడ్ సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ ఉంటుంది. ఇందులో అనలాగ్ స్పీడోమీటర్ మరియు టాకోమీటర్ రీడింగ్ ఉన్నాయి. అంటే ఈ కొత్త కన్సోల్ ద్వారా రైడర్ తన మోటార్‌సైకిల్ వేగాన్ని డిజిటల్ గాను అలాగే అనలాగ్ రూపంలో కూడా రీడౌట్ చేయటానికి అవకాశం ఉంటుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్‌లో మరో అద్భుతమైన ఫీచర్, ఏంటో తెలుసా?

అంతేకాకుండా, ఈ డిజిటల్ డిస్‌ప్లే రైడర్‌కు అనేక ఇతర సమాచారాన్ని అందిస్తుంది. ఇది ఓడిఓ మీటర్, ట్రిప్ మీటర్, ఫ్యూయెల్ గేజ్, డిస్టెన్స్ టూ ఎంప్టీ, యావరేజ్ స్పీడ్ మరియు గేర్ ఇండికేటర్ వంటి సమచారాన్ని తెలియజేస్తుంది.

ఈ మోటార్‌సైకిల్‌పై స్విచ్‌గేర్‌ను కూడా అప్‌గ్రేడ్ చేశారు. ఇది డిజిటల్ కెమెరా ఆపరేటింగ్ స్విచ్‌ను పోలి ఉండే స్విచ్‌లను కలిగి ఉంటుంది. ఇందులో కుడివైపు ఇంజన్ ఆన్/ఆఫ్ స్విచ్ మరియు ఎడమ వైపు లైటన్ ఆన్/ఆఫ్ స్విచ్‌లు ఉంటాయి.

MOST READ: గుడ్‌న్యూస్.. డిసెంబర్ 31 వరకూ వాహన డాక్యుమెంట్స్ వ్యాలిడిటీ పొడగింపు

రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్‌లో మరో అద్భుతమైన ఫీచర్, ఏంటో తెలుసా?

మీటియోర్ 350 మోటార్‌సైకిల్ 9-స్పోక్ అల్లాయ్ వీల్ డిజైన్‌తో ఫ్రంట్ అండ్ రియర్ డిస్క్ బ్రేక్ ఆప్షన్లతో లభ్యం కానుంది. దీని ఎగ్జాస్ట్ (సైలెన్సర్) పూర్తి బ్లాక్ కలర్‌లో ఉంటుంది. మీటియోర్ 350 మోటార్‌సైకిల్ రైడర్‌కు మరింత సౌకర్యవంతమైన రైడింగ్ పొజిషన్‌ను ఆఫర్ చేస్తుంది. మంచి కుషనింగ్ కలిగిన సీట్స్, విశాలమైన ఫ్రంట్ ఫుట్ పెగ్స్, మంచి రైడింగ్ మరియు హ్యాండ్లింగ్ అనుభూతి కొసం డిజైన్ చేసిన హ్యాండిల్ బార్ వంటి కీలక ఫీచర్లను ఇందులో ఉండనున్నాయి.

రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్‌లో మరో అద్భుతమైన ఫీచర్, ఏంటో తెలుసా?

రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350 టిఎఫ్‌టి డిస్‌ప్లేపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

ఐకానిక్ థండర్‌బర్డ్ స్థానాన్ని భర్తీ చేసేందుకు రాయల్ ఎన్‌ఫీల్డ్ ఈ సరికొత్త మీటియోర్ మోడల్‌ను తీసుకురానుంది. ఇది ఈ సెగ్మెంట్లోని బజాజ్ అవెంజర్ 220 స్ట్రీట్, జావా 300 మరియు జావా ఫోర్టీ-టూ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

Source: Motorbeam

Most Read Articles

English summary
Royal Enfield is said to be working on a brand-new motorcycle for the Indian market, called the Meteor 350. The new Royal Enfield Meteor 350 has been spied multiple times before, however, the latest spy pics from Motorbeam reveals fresh details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X