Just In
Don't Miss
- News
కువైట్‌లో నారా లోకేష్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించిన టీడీపీ నేతలు
- Sports
వైరల్ ఫొటో.. ధోనీ, సాక్షితో పంత్!!
- Movies
ప్రదీప్ కోసం టాప్ యాంకర్స్.. చివరకు వారితో జంప్.. మొత్తానికి సద్దాం బక్రా!
- Finance
Budget 2021: పన్ను తగ్గించండి, తుక్కు పాలసీపై కూడా
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
రాయల్ ఎన్‌ఫీల్డ్ 'మీటియోర్' విడుదల మరింత జాప్యం; కొత్త వివరాలు
రాయల్ ఎన్‌ఫీల్డ్ అభిమానులకు ఇది షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. ఈ బ్రాండ్ నుండి ఆసక్తిగా ఎదురుచూస్తున్న "మీటియోర్" 350సీసీ మోటార్‌సైకిల్ విడుదల ఇప్పుడు మరింత ఆలస్యమైనట్లుగా తెలుస్తోంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ విక్రయించిన థండర్‌బర్డ్ సిరీస్ మోడళ్ల స్థానాన్ని భర్తీ చేసేందుకు వస్తున్న మీటియోర్ ఇప్పుడు దీపావళి తర్వాత మార్కెట్లో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈటి ఆటోలో ప్రచురించిన కథనం ప్రకారం, కొత్త మీటియోర్ లాంచ్ విడుదల ఇదివరకు అనుకున్న షెడ్యూల్ కన్నా మరింత ఆలస్యం కానుంది. ఇందుకు ప్రధాన కారణం, కంపెనీ ఈ కొత్త మోటార్‌సైకిల్ కోసం కస్టమైజేషన్ అప్లికేషన్‌ను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తుండం అన్నట్లుగా తెలుస్తోంది.

'మేక్ యువర్ ఓన్' పేరుతో రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350 కోసం కంపెనీ ఓ కొత్త మోటార్‌సైకిల్ కస్టమైజేషన్ అప్లికేషన్‌ను తయారు చేస్తోంది. దీని సాయంతో కస్టమర్లు తమ అభిమాన మీటియోర్ మోటార్‌సైకిల్‌ను తమ అభిరుచికి తగినట్లుగా అందుబాటులో ఉన్న కస్టమైజేషన్ ఆప్షన్లతో మోడిఫై చేసుకునే అవకాశం ఉంటుంది.
MOST READ:మీరు ఈ బైక్ గుర్తుపట్టారా.. ఇది అందరికీ ఇష్టమైన బైక్ కూడా

ఈ అప్లికేషన్‌లో ప్రస్తుతానికి మీటియోర్ మోడల్ ఉండనుండగా, భవిష్యత్తులో దశల వారీగా మరిన్ని రాయల్ ఎన్‌ఫీల్డ్ మోడళ్లను ఈ జాబితాలో చేర్చే అవకాశం ఉంది. కస్టమర్లు తమ రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిళ్ల కోసం ఇప్పుడు ఆఫ్టర్ మార్కెట్ యాక్ససరీలను ఎంచుకునే అవసరం లేకుండా, నేరుగా ఫ్యాక్టరీ అందించే అధికారిక యాక్ససరీలతోనే కస్టమైజ్ చేసుకోవచ్చు.

దేశంలో కొనసాగుతున్న కోవిడ్-19 మహమ్మారి కారణంగా ప్రభావితమైన సప్లయ్ చైన్ ఇంకా పూర్తిస్థాయిలో కోలుకోకపోవటంతో కంపెనీ ఈ మోటార్‌సైకిల్‌ను పూర్తిస్థాయిలో ఉత్పత్తి చేయలేకపోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఉన్న వివిధ రాయల్ ఎన్‌ఫీల్డ్ ఉత్పత్తులను కంపెనీ పూర్తిస్థాయిలో ఉత్పత్తి చేసేందుకు సన్నాహాలు చేస్తుండటం కూడా దీని ఆలస్యానికి మరో కారణంగా చెప్పుకోవచ్చు.
MOST READ:కెమెరాకు చిక్కిన రెడ్ కలర్ ఫోర్స్ గూర్ఖా.. ఇది నిజంగా సూపర్ లుక్ గురూ..!

వాస్తవానికి రాయల్ ఎన్‌ఫీల్డ్ గడచిన సెప్టెంబర్ నెలలో మొత్తం 70,000 యూనిట్లను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది, అయితే, ఈ సమయంలో కంపెనీ కేవలం 55,000 యూనిట్లను మాత్రమే ఉత్పత్తి చేయగలిగినట్లు కంపెనీ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.
ఇక మీటియోర్ విషయానికి వస్తే, రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిళ్లలో మునుపెన్నడూ చూడని విధంగా అధునాతన టెక్నాలజీ, స్మార్ట్ కనెక్టింగ్ ఫీచర్లతో కొత్త మీటియోర్ మార్కెట్లోకి రానుంది. ఈ మోడల్‌ను కొత్త మాడ్యులర్ జే ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించి అభవృద్ది చేశారు. ఇందులో సరికొత్త ఓహెచ్‌సి ఇంజన్‌ను కూడా ఉపయోగించారు.

ఇందులోని కొత్త 346 సిసి ఎయిర్-కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 6,100 ఆర్‌పిఎమ్ వద్ద 20.2 బిహెచ్‌పి పవర్‌ని మరియు 4,000 ఆర్‌పిఎమ్ వద్ద 27 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇందులో గేర్‌బాక్స్ గురించి పేర్కొనకపోయినప్పటికీ, ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో రావచ్చని తెలుస్తోంది.
ఈ మోటార్‌సైకిల్‌లోని ఇతర ఫీచర్లలో 17 ఇంచ్ అల్లాయ్ వీల్స్, ముందు భాగంలో 300 మిమీ డిస్క్ మరియు వెనుక వైపు 270 మిమీ డిస్క్ బ్రేక్స్, డ్యూయల్-ఛానల్ ఏబిఎస్ ఉన్నాయి. అలాగే, ముందు వైపు స్టాండర్డ్ 41 మిమీ టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక వైపు 6-రకాలుగా సర్దుబాటు చేయగల సస్పెన్షన్ సెటప్ కూడా ఉంటుంది.
MOST READ:మీకు తెలుసా.. ఈ కార్ ఉదయపూర్ యువరాజునే ఫిదా చేసింది.. ఆ కార్ మీకు కూడా ఇష్టమైనదే

మీటియోర్ 350 డిజైన్‌ను గమనిస్తే, ఇది మరింత రిలాక్స్డ్ మరియు కంఫర్టబల్ రైడింగ్ పొజిషన్‌ను ఆఫర్ చేయవచ్చని తెలుస్తోంది. దీనికోసం ఇందులోని ఈ మోటార్‌సైకిల్‌లో పెరిగిన హ్యాండిల్‌బార్లు, ఫార్వర్డ్ సెట్ ఫుట్‌పెగ్‌లు మరియు తక్కువ ఎత్తు కలిగిన రైడర్ సీట్ హైట్‌లు సహకరిస్తాయి. ఈ మోటార్‌సైకిల్ ఇంధన ట్యాంక్ సామర్థ్యం 15 లీటర్లు. ఇదివరకటి థండర్‌బర్డ్ (20 లీటర్లు) మోడళ్ల కన్నా ఇది 5 లీటర్లు తక్కువ.

భారత మార్కెట్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ విడుదల ఆలస్యం కావటంపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
కోవిడ్-19 మహమ్మారి కారణంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ సప్లయ్ చైన్ తీవ్రంగా ప్రభావితమైనట్లుగా తెలుస్తోంది. వీలైనంత త్వరగా ఈ పరిస్థితులను అధిగమించడానికి కంపెనీ కృషి చేస్తోంది. ఇకపోతే, రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రస్తుత మార్కెట్ ధోరణిని క్షుణ్ణంగా అధ్యయనం చేసి, కస్టమర్ల అభిరుచికి తగినట్లుగా ఈ కొత్త మీటియోర్ 350 మోడల్‌ను అభవృద్ధి చేసింది.
MOST READ:బ్రతుకు తెరువుకోసం కొన్న రిక్షా స్వాధీనం చేసుకున్న అధికారులు.. తర్వాత ఏం జరిగిందంటే ?