వచ్చే నెలలో రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ విడుదల - వివరాలు

చెన్నైకి చెందిన రాయల్ ఎన్‌ఫీల్డ్ బ్రాండ్ నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న లేటెస్ట్ మోడల్ 'మీటియోర్' మరికొద్ది రోజుల్లోనే భారత రోడ్లపై చక్కర్లు కొట్టనుంది. కంపెనీ ఇప్పటికే ఈ మోడల్‌ను భారత రోడ్లపై కంపెనీ విస్తృతంగా పరీక్షిస్తోంది. వాస్తవానికి ఇప్పటికే ఈ మోడల్ మార్కెట్లో విడుదల కావల్సి ఉన్నప్పటికీ, దేశంలో కొనసాగుతున్న కోవిడ్-19 మహమ్మారి మరియు లాక్‌డౌన్‌ల కారణంగా ఇది ఆలస్యమైంది.

వచ్చే నెలలో రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ విడుదల - వివరాలు

మీటియోర్ (తెలుగులో ఉల్కాపాతం అని అర్థం) పేరుతో రానున్న ఈ రెట్రో-లుకింగ్ మోటార్‌సైకిల్, ప్రస్తుతం భారత మార్కెట్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ డిస్‌కంటిన్యూ చేసిన థండర్‌బర్డ్ ఎక్స్ సిరీస్ మోడళ్ల స్థానాన్ని భర్తీ చేయనుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ సంస్థ తమ 350సిసి లైనప్‌లో ఈ సరికొత్త మోటార్‌సైకిల్‌ను విడుదల చేయనుంది. ఇది విభాగంలో జావా 300 మోడల్‌తో తలపడనుంది.

వచ్చే నెలలో రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ విడుదల - వివరాలు

రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350 చాలా ఆకర్షణీయమైన డిజైన్ మరియు విశిష్టమైన ఫీచర్లతో మార్కెట్లోకి రానుంది. ఇది పురాతన మోడళ్లను తలపించేలా బాబ్బర్ స్టైల్‌లో ఉంటుంది. పెద్ద ఫ్యూయెల్ ట్యాంక్, గుండ్రటి ఆకారపు హెడ్‌ల్యాంప్‌లు ఈ డిజైన్‌లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలుస్తాయి.

MOST READ:ఫారం 20 సవరణకు నాయకత్వం వహించనున్న కేంద్ర ప్రభుత్వం

వచ్చే నెలలో రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ విడుదల - వివరాలు

ఈ మోటార్‌సైకిల్‌లో సింగిల్-పాడ్ సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ ఉంటుంది. ఇందులో అనలాగ్ స్పీడోమీటర్ మరియు టాకోమీటర్ రీడింగ్ ఉన్నాయి. అంటే ఈ కొత్త కన్సోల్ ద్వారా రైడర్ తన మోటార్‌సైకిల్ వేగాన్ని డిజిటల్ గాను అలాగే అనలాగ్ రూపంలో కూడా రీడౌట్ చేయటానికి అవకాశం ఉంటుంది.

వచ్చే నెలలో రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ విడుదల - వివరాలు

అంతేకాకుండా, ఈ డిజిటల్ డిస్‌ప్లే రైడర్‌కు అనేక ఇతర సమాచారాన్ని అందిస్తుంది. ఇది ఓడిఓ మీటర్, ట్రిప్ మీటర్, ఫ్యూయెల్ గేజ్, డిస్టెన్స్ టూ ఎంప్టీ, యావరేజ్ స్పీడ్ మరియు గేర్ ఇండికేటర్ వంటి సమచారాన్ని తెలియజేస్తుంది.

స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ కోసం ఇందులోని ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ బ్లూటూత్ కనెక్టివిటీ టెక్నాలజీని సపోర్ట్ చేయవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే గనుక జరిగితే రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ ఈ బ్రాండ్ నుంచి రానున్న మొట్టమొదటి బ్లూటూత్ ఎనేబుల్డ్ మోటార్‌సైకిల్‌గా మారుతుంది.

MOST READ:మొదటి రోజు భారీ బుకింగ్స్ నమోదు చేసిన కియా సోనెట్ ; ఎంతో తెలుసా ?

వచ్చే నెలలో రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ విడుదల - వివరాలు

ఈ మోటార్‌సైకిల్‌పై స్విచ్‌గేర్‌ను కూడా అప్‌గ్రేడ్ చేశారు. ఇది డిజిటల్ కెమెరా ఆపరేటింగ్ స్విచ్‌ను పోలి ఉండే స్విచ్‌లను కలిగి ఉంటుంది. ఇందులో కుడివైపు ఇంజన్ ఆన్/ఆఫ్ స్విచ్ మరియు ఎడమ వైపు లైటన్ ఆన్/ఆఫ్ స్విచ్‌లు ఉంటాయి.

వచ్చే నెలలో రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ విడుదల - వివరాలు

ఇకపోతే ఈ కొత్త మోటారుసైకిల్‌లో అతిపెద్ద మార్పు ఇందులోని కొత్త ఇంజన్. ఇది ప్రస్తుతం ఉపయోగిస్తున్న 346 సీసీ ఎయిర్-కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్‌ను ఆధారంగా చేసుకొని ఇందులో సరికొత్త ఓవర్‌హెడ్ కామ్‌షాఫ్ట్ (ఓహెచ్‌సి) వెర్షన్‌ను తయారు చేశారు. ప్రస్తుత టాప్పెట్-వాల్వ్ యూసిఈ 350సీసీ ఇంజన్‌తో పోల్చుకుంటే ఇది మరింత బెటర్ ఫెర్మార్మెన్స్ మరియు అధిక మైలేజ్‌ను ఆఫర్ చేయనుంది.

MOST READ:కొత్త మహీంద్రా థార్ నడిపిన పృథ్వీరాజ్.. కారు గురించి అతను ఏమి చెప్పాడో తెలుసా ?

వచ్చే నెలలో రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ విడుదల - వివరాలు

రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇటీవలే తమ టాప్పెట్-వాల్వ్ యూసిఈ ఇంజన్లను బిఎస్6 స్టాండర్డ్స్‌కి అనుగుణంగా అప్‌గ్రేడ్ చేసింది. ఈ 346 సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ గరిష్టంగా 19.1 బిహెచ్‌పిల శక్తిని మరియు 28 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్ ఆప్షన్‌తో లభ్యం కానుంది.

వచ్చే నెలలో రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ విడుదల - వివరాలు

మీటియోర్ 350 మోటార్‌సైకిల్ 9-స్పోక్ అల్లాయ్ వీల్ డిజైన్‌తో ఫ్రంట్ అండ్ రియర్ డిస్క్ బ్రేక్ ఆప్షన్లతో లభ్యం కానుంది. దీని ఎగ్జాస్ట్ (సైలెన్సర్) పూర్తి బ్లాక్ కలర్‌లో ఉంటుంది. మీటియోర్ 350 మోటార్‌సైకిల్ రైడర్‌కు మరింత సౌకర్యవంతమైన రైడింగ్ పొజిషన్‌ను ఆఫర్ చేస్తుంది. మంచి కుషనింగ్ కలిగిన సీట్స్, విశాలమైన ఫ్రంట్ ఫుట్ పెగ్స్, మంచి రైడింగ్ మరియు హ్యాండ్లింగ్ అనుభూతి కొసం డిజైన్ చేసిన హ్యాండిల్ బార్ వంటి కీలక ఫీచర్లను ఇందులో ఉండనున్నాయి.

MOST READ:ప్రపంచంలో నాల్గవ ధనవంతుడు కానున్న సిఈఓ : ఎవరో తెలుసా

వచ్చే నెలలో రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ విడుదల - వివరాలు

రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350 మోటార్‌సైకిల్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

సిటీ రోడ్లపై అలాగే లాంగ్ రైడ్స్ కోసం ఓ కంఫర్టబల్ క్రూజర్ స్టైల్ మోటార్‌సైకిల్ కోసం చూస్తున్న కస్టమర్లకి రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ ఓ చక్కటి ఆప్షన్‌గా నిలుస్తుంది. ఇది ఈ సెగ్మెంట్లోని బజాజ్ అవెంజర్ 220 స్ట్రీట్, జావా 300 మరియు జావా ఫోర్టీ-టూ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది. రాయల్ ఎన్ఫీల్డ్ తమ మీటియోర్ మోడల్‌ను అనేక కాస్మెటిక్ మరియు ఫంక్షనల్ యాక్ససరీలతో విడుదల చేయవచ్చని సమాచారం.

Most Read Articles

English summary
Royal Enfield Meteor is expected to be launched sometime next month. The new motorcycle was expected to arrive much earlier in the year. Due to the ongoing Covid-19 pandemic, the launch of the Meteor was delayed. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X