రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350 ఫీచర్స్ లీక్; వివరాలు

భారతదేశపు హ్యార్లీ డేవిడ్‌సన్‌గా చెప్పుకునే చెన్నైకి చెందిన రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిల్ కంపెనీ నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న లేటెస్ట్ మోడల్ 'రాయర్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350' (Royal Enfield Meteor 350) మరికొద్ది రోజుల్లోనే భారత మార్కెట్లో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ మోడల్‌కి సంబంధించిన చిత్రాలు ఇంటర్‌నెట్‌లో లీక్ అయ్యాయి.

రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350 ఫీచర్స్ లీక్; వివరాలు

రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి వస్తున్న సరికొత్త మోడల్ బైక్ మీటియోర్ 350. ఈ నెలలోనే ఇది భారత్‌లో విడుదల కావచ్చని సమాచారం. ఈ మోడల్ టెస్టింగ్ దశలో ఉండగా ఉప్పటికే పలుమార్లు నెటిజెన్ల కెమెరాలకు చిక్కింది. తాజాగా లీక్ అయిన చిత్రాలను గమనిస్తే, మీటియోర్ 350కి సంబంధించిన ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర మరియు స్విచ్‌లకు సంబంధించిన డిజైన్ వివరాలు వెల్లడయ్యాయి.

రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350 ఫీచర్స్ లీక్; వివరాలు

డిజిటల్ కెమెరా ఆపరేటింగ్ స్విచ్‌ను పోలి ఉండే స్విచ్‌లను ఇందులో చూడొచ్చు. కుడివైపు ఇంజన్ ఆన్/ఆఫ్ స్విచ్ మరియు ఎడమ వైపు లైటన్ ఆన్/ఆఫ్ స్విచ్‌లతో పాటుగా సరికొత్త సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌లను ఇందులో గమనించవచ్చు. స్పీడోమీటర్ మరియు టాకోమీటర్లను అనలాగ్ రూపంలో ఉంచి, ఓడిఓ మీటర్, ట్రిప్ మీటర్, ఫ్యూయెల్ గేజ్, డిస్టెన్స్ టూ ఎంప్టీ, సగటు వేగం, గేర్ ఇండికేటర్లను డిజిటల్ క్లస్టర్‌లో ఉంచారు.

MOST READ: 19 సూపర్ బైక్‌లను స్వాధీనం చేసుకున్న గురుగ్రామ్ పోలీసులు, ఎందుకో తెలుసా ?

రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350 ఫీచర్స్ లీక్; వివరాలు

స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ కోసం ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉండనున్నాయనే పుకార్లు వినిపిస్తున్నాయి. కార్లలో మాదిరిగానే టర్న్ పూర్తయిన తర్వాత టర్న్ ఇండికేటర్లు ఆటోమేటిక్‌గా ఆఫ్ అవుతాయి. హెడ్‌లైట్‌కు ఇరువైపులా ఈ టర్న్ ఇండికేటర్లను అమర్చారు.

రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350 ఫీచర్స్ లీక్; వివరాలు

ప్రస్తుతం రాయల్ ఎన్‌ఫీల్డ్ అందిస్తున్న థండర్‌బర్డ్ సిరీస్‌ను భర్తీ చేసేందుకే కంపెనీ ఈ కొత్త మీటియోర్ సిరీస్‌ను మార్కెట్లోకి తెస్తున్నట్లు సమాచారం. అయితే, థండర్‌బర్డ్ ఎక్స్ లైనప్ క్రింద మాత్రమే ఈ మోడల్ రీప్లేస్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. రెగ్యులర్ థండర్‌బర్డ్ విక్రయాలు మాత్రం యధావిధిగా కొనసాగే ఆస్కారం ఉంది.

MOST READ: కస్టమర్ల కోసం షెల్ డోర్‌స్టెప్ వెహికల్ మెయింటినెన్స్ సర్వీస్

రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350 ఫీచర్స్ లీక్; వివరాలు

రాయల్ ఎన్‌ఫీల్డ్ అందిస్తున్న థండర్‌బర్డ్ ఎక్స్ సిరీస్ మోడళ్ల మాదిరిగానే మీటియోర్ 350 కూడా అర్బన్ క్రూజర్ స్టైల్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఆధునిక మరియు పురాతన కలయితో రూపొందించిన ఈ మోడ్రన్-రెట్రో మోటార్‌సైకిల్ గుండ్రటి హెడ్‌లైట్స్ మరియు టెయిల్ లైట్స్‌తో పాటు థండర్‌బర్డ్ లాంటి ఫ్యూయెల్ ట్యాంక్ డిజైన్‌ను కలిగి ఉంటుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350 ఫీచర్స్ లీక్; వివరాలు

మీటియోర్ 350 మోటార్‌సైకిల్ 9-స్పోక్ అల్లాయ్ వీల్ డిజైన్‌తో ఫ్రంట్ అండ్ రియర్ డిస్క్ బ్రేక్ ఆప్షన్లతో లభ్యం కానుంది. దీని ఎగ్జాస్ట్ (సైలెన్సర్) పూర్తి బ్లాక్ కలర్‌లో ఉంటుంది. మీటియోర్ 350 మోటార్‌సైకిల్ రైడర్‌కు మరింత సౌకర్యవంతమైన రైడింగ్ పొజిషన్‌ను ఆఫర్ చేస్తుంది. మంచి కుషనింగ్ కలిగిన సీట్స్, విశాలమైన ఫ్రంట్ ఫుట్ పెగ్స్, మంచి రైడింగ్ మరియు హ్యాండ్లింగ్ అనుభూతి కొసం డిజైన్ చేసిన హ్యాండిల్ బార్ వంటి కీలక ఫీచర్లను ఇందులో గమనించవచ్చు.

MOST READ: కరోనా ఎఫెక్ట్ : పాకిస్థాన్‌లో తలెత్తిన కొత్త సమస్య

రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350 ఫీచర్స్ లీక్; వివరాలు

ఇక రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350 విషయానికి వస్తే, ప్రస్తుత 346 సీసీ ఎయిర్-కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్ యొక్క సరికొత్త ఓహెచ్‌సి (ఓవర్ హెడ్ క్యామ్‌షాఫ్ట్) వెర్షన్ ఇంజన్‌ను ఉపయోగించారు. ప్రస్తుత టాప్పెట్-వాల్వ్ యూసిఈ 350సీసీ ఇంజన్‌తో పోల్చుకుంటే ఇది మరింత బెటర్ ఫెర్మార్మెన్స్ మరియు అధిక మైలేజ్‌ను ఆఫర్ చేయనుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350 ఫీచర్స్ లీక్; వివరాలు

రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇటీవలే తమ టాప్పెట్-వాల్వ్ యూసిఈ ఇంజన్లను బిఎస్6 స్టాండర్డ్స్‌కి అనుగుణంగా అప్‌గ్రేడ్ చేసింది. ఈ 346 సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ గరిష్టంగా 19.1 బిహెచ్‌పిల శక్తిని మరియు 28 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్ ఆప్షన్‌తో లభిస్తుంది.

MOST READ: ఒకే ఫ్యామిలీ నాలుగు తరాలుగా ఉపయోగిస్తున్న సైకిల్

రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350 ఫీచర్స్ లీక్; వివరాలు

ఇంజన్ విషయాన్ని అటుంచితే, కొత్త మీటియోర్ 350 బైక్‌లో ముందు వైపు టెలిస్కోపిక్ ఫోర్కులను మరియు వెనుక వైపు ట్విన్ షాక్ సస్పెన్షన్లను ఉపయోగించారు. ముందు మరియు వెనుక వైపున డ్యూయెల్ డిస్క్ బ్రేక్ ఆప్షన్‌తో లభించే ఈ మోటార్‌సైకిల్‌లో కంపెనీ ఏబిఎస్ వెర్షన్‌ను కూడా ప్రవేశపెట్టవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి.

రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350 ఫీచర్స్ లీక్; వివరాలు

ఒక్కసారి భారత మార్కెట్లో విడుదలైన తర్వాత రాయర్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350 ఈ సెగ్మెంట్లోని బజాజ్ అవెంజర్ 220 స్ట్రీట్, జావా 300 మరియు జావా ఫోర్టీ-టూ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది. దేశీయ విపణిలో ఈ మోడల్ ధరలు రూ.1.6 లక్షల నుంచి రూ. 1.8 లక్షల మధ్యలో ఉండొచ్చని అంచనా (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్).

రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350 ఫీచర్స్ లీక్; వివరాలు

రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350 బైక్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సరికొత్త మోడల్ మీటియోర్ 350. ఫ్రెష్ డిజైన్ మరియు లేటెస్ట్ టెక్నాలజీల కలయికతో రూపుదిద్దుకుంటున్న ఈ రెట్రో-మోడ్రన్ లుక్ మోటార్‌సైకిల్ తప్పనిసరిగా బైక్ ప్రియులను ఆకర్షిస్తుదనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు.

IMAGES:Gaadiwaadi

Most Read Articles

English summary
The Royal Enfield Meteor 350 is one among the highly anticipated model in the that is expected to be launched sometime during this month. It will be an all-new motorcycle from the Chennai based two-wheeler manufacturer. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X