కొత్త రంగులలో సుజుకి జిక్సర్ 155, 250 మోటార్‌సైకిళ్ల విడుదల - ధర, వివరాలు

జపనీస్ టూవీలర్ బ్రాండ్ సుజుకి మోటార్‌సైకిల్, భారత మార్కెట్లో విక్రయిస్తున్న జిక్సర్ మోటార్‌సైకిల్ లైనప్‌లో కొత్త కలర్ ఆప్షన్లను ప్రవేశపెట్టింది. ప్రపంచవ్యాప్తంగా సుజుకి బ్రాండ్ తమ 100వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న వేడుకను పురస్కరించుకొని కంపెనీ ఇందులో కొత్త పెయింట్ స్కీమ్‌లను ప్రారంభించింది.

కొత్త రంగులలో సుజుకి జిక్సర్ 155, 250 మోటార్‌సైకిళ్ల విడుదల - ధర, వివరాలు

సుజుకి జిక్సర్ లైనప్‌లో 155 మరియు 250 మోటార్‌సైకిళ్లు రెండూ బ్రాండ్ యొక్క మైలురాయి గుర్తును జరుపుకునేలా కొత్త కలర్ ఆప్షన్లను అందుకున్నాయి. ఇవి కొత్త పెయింట్ స్కీమ్స్‌తో లభిస్తున్నప్పటికీ, వీటి ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు ఉండదని కంపెనీ స్పష్టం చేసింది.

కొత్త రంగులలో సుజుకి జిక్సర్ 155, 250 మోటార్‌సైకిళ్ల విడుదల - ధర, వివరాలు

సుజుకి జిక్సర్ ఎస్ఎఫ్ 250 ఇప్పుడు కొత్త ట్రైటన్ బ్లూ / సిల్వర్ కలర్ స్కీమ్‌లో లభిస్తుంది. ఈ మోటార్‌సైకిల్‌పై కొత్త ట్రెడిషనల్ బ్లూట్ అండ్ స్లేట్ సిల్వర్ కలర్ గ్రాఫిక్స్ 1960 లలో సుజుకి యొక్క ప్రారంభ గ్రాండ్ ప్రిక్స్ మెషీన్లకు నివాళిగా ఉంటుంది. మార్కెట్లో సుజుకి జిక్సర్ ఎస్ఎఫ్ 250 ధర రూ.1.76 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.

MOST READ:వాహనదారులకు గుడ్ న్యూస్.. ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ పట్టుకుని తిరగాల్సిన అవసరం లేదు.. ఎందుకో తెలుసా ?

కొత్త రంగులలో సుజుకి జిక్సర్ 155, 250 మోటార్‌సైకిళ్ల విడుదల - ధర, వివరాలు

మరోవైపు, జిక్సర్ 250 నేక్డ్ మోటార్‌సైకిల్‌లో అప్‌డేటెడ్ చేసిన గ్రాఫిక్‌లతో కొత్త మెటాలిక్ ట్రైటన్ బ్లూ షేడ్ కూడా లభ్యం కానుంది. ప్రస్తుతం లభిస్తున్న డ్యూయెల్-టోన్ పెయింట్ స్కీమ్‌తో పాటుగా ఈ కొత్త షేడ్ కూడా లభిస్తుంది. మార్కెట్లో దీని ధర రూ.1.65 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.

కొత్త రంగులలో సుజుకి జిక్సర్ 155, 250 మోటార్‌సైకిళ్ల విడుదల - ధర, వివరాలు

ఎంట్రీ లెవల్ మోడళ్లయిన సుజుకి జిక్సర్ 155 మరియు జిక్సర్ ఎస్ఎఫ్ 155 మోడళ్లు కూడా బ్రాండ్ సాధించిన విజయానికి జ్ఞాపకార్థంగా కొత్త పెయింట్ స్కీమ్‌ను అందుకున్నాయి. ఈ రెండు వేరియంట్లు ఇప్పుడు కొత్త పెరల్ మీరా రెడ్ మరియు మెటాలిక్ ట్రైటన్ బ్లూ రంగులలో లభిస్తాయి.

MOST READ:ఈ ఫ్యాన్సీ నెంబర్ ధర అక్షరాలా రూ. 10.10 లక్షలు.. ఆ నెంబర్ ఎదో తెలుసా ?

కొత్త రంగులలో సుజుకి జిక్సర్ 155, 250 మోటార్‌సైకిళ్ల విడుదల - ధర, వివరాలు

అంతేకాకుండా, ఈ రెండు వేరియంట్ల అప్‌డేట్‌లో భాగంగా, ఇవి కొత్త బోల్డ్ 'జిక్సర్' గ్రాఫిక్‌లతో లభిస్తాయి. మార్కెట్లో జిక్సర్ 155 మరియు జిక్సర్ ఎస్ఎఫ్ 155 మోటార్‌సైకిళ్ల ధరలు వరుసగా రూ.1.14 లక్షలు, రూ.1.24 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉన్నాయి.

కొత్త రంగులలో సుజుకి జిక్సర్ 155, 250 మోటార్‌సైకిళ్ల విడుదల - ధర, వివరాలు

సుజుకి జిక్సర్ మరియు జిక్సర్ ఎస్ఎఫ్ 155 మోటార్‌సైకిళ్లలో 155సిసి, ఎయిర్-కూల్డ్, ఫ్యూయల్ ఇంజెక్ట్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 13.4 బిహెచ్‌పి పవర్‌ను మరియు 13.8 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది స్టాండర్డ్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

MOST READ:ఎట్టకేలకు భారత్‌లో అడుగుపెట్టిన కొత్త మహీంద్రా థార్ : ధర & ఇతర వివరాలు

కొత్త రంగులలో సుజుకి జిక్సర్ 155, 250 మోటార్‌సైకిళ్ల విడుదల - ధర, వివరాలు

అలాగే, సుజుకి జిక్సర్ 250 మరియు జిక్సర్ ఎస్ఎఫ్ 250 మోడళ్లలో 249 సిసి, ఎయిర్ / ఆయిల్-కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 9300 ఆర్‌పిఎమ్ వద్ద 26 బిహెచ్‌పి పవర్‌ను మరియు 7300 ఆర్‌పిఎమ్ వద్ద 22.2 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది స్టాండర్డ్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

కొత్త రంగులలో సుజుకి జిక్సర్ 155, 250 మోటార్‌సైకిళ్ల విడుదల - ధర, వివరాలు

సుజుకి జిక్సర్ 155, 250 మోటార్‌సైకిళ్ల కొత్త కలర్ ఆప్షన్లపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

ఈ మోటార్‌సైకిళ్లలో కొత్తగా పరిచయం చేసిన పెయింట్ స్కీమ్‌లు ఇ్పపుడు వాటికి మరింత ఆకర్షణీయమైన రూపాన్ని ఇస్తాయి మరియు ఇప్పటికే ఉన్న కలర్ ఆప్షన్లకు భిన్నంగా ఉంచడంలో సహకరిస్తాయి. జిక్సర్ ఎస్ఎఫ్ 250లోని రేసింగ్-ప్రేరేపిత గ్రాఫిక్స్ చాలా అందంగా మరియు సొగసైనదిగా కనిపిస్తుంది.

MOST READ:ప్రధాని మోదీ ఉపయోగించనున్న లేటెస్ట్ ప్లైట్ ఇదే.. చూసారా !

Most Read Articles

English summary
Suzuki Motorcycle India has launched a new range of colour schemes on the brand's Gixxer motorcycle line-up in the country. The company has launched new paint schemes to celebrate the 100th anniversary of the Suzuki brand, globally. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X