సుజుకి మోటార్‌సైకిళ్లలో కొత్త బ్లూటూత్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ టెక్నాలజీ!

జపనీస్ టూవీలర్ బ్రాండ్ సుజుకి మోటార్‌సైకిల్స్, భారత మార్కెట్లో విక్రయిస్తున్న యాక్సెస్ 125 మరియు బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ స్కూటర్లలో ఇటీవలే లేటెస్ట్ బ్లూటూత్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ టెక్నాలజీని పరిచయం చేసిన సంగతి తెలిసినదే. ఈ స్కూటర్లను మార్కెట్లో విడుదల చేసిన సందర్భంగా, కంపెనీ అధికార ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. మరికొద్ది రోజుల్లోనే ఈ తరహా టెక్నాలజీ తమ మోటార్‌సైకిళ్లలో కూడా అందుబాటులోకి వస్తుందని తెలిపారు.

సుజుకి మోటార్‌సైకిళ్లలో కొత్త బ్లూటూత్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ టెక్నాలజీ!

తాజాగా బైక్‌వాలే నుండి వచ్చిన రిపోర్ట్ ప్రకారం, సుజుకి టూవీలర్ కంపెనీ తమ మోటార్‌సైకిళ్లలోని ఎంపిక చేసిన మోడళ్లలో ఈ లేటెస్ట్ బ్లూటత్ టెక్నాలజీని ఆఫర్ చేయనున్నట్లు సమాచారం. ఈ టెక్నాలజీ అందుబాటులోకి రానున్న మోడళ్లలో సుజుకి జిక్సర్, సుజుకి ఇంట్రుడర్ మోడళ్లు ఉండే అవకాశం ఉంది.

సుజుకి మోటార్‌సైకిళ్లలో కొత్త బ్లూటూత్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ టెక్నాలజీ!

ప్రస్తుతం సుజుకి యాక్సెస్ 125 మరియు సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ రెండు మోడళ్లలో ప్రవేశపెట్టిన కొత్త బ్లూటూత్ కనెక్టెడ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌లకు కస్టమర్ల నుంచి లభించే స్పందనను కంపెనీ పూర్తిగా అధ్యయం చేసిన తర్వాతనే ఈ టెక్నాలజీని మోటార్‌సైకిళ్లలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

MOST READ:పోర్స్చే పనామెరా 4 10 ఇయర్ ఎడిషన్ ఫస్ట్ లుక్ రివ్యూ

సుజుకి మోటార్‌సైకిళ్లలో కొత్త బ్లూటూత్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ టెక్నాలజీ!

ఈ కొత్త అప్‌డేటెడ్ స్కూటర్లలోని బిల్ట్-ఇన్ బ్లూటూత్-కనెక్ట్ టెక్నాలజీతో కూడిన కొత్త డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ అదనపు ఫీచర్లను కలిగి ఉండి, రైడర్‌కు కావల్సిన సమాచారాన్ని అందిస్తుంది. రైడర్స్ ఇప్పుడు బ్రాండ్ యొక్క ‘రైడ్ కనెక్ట్' యాప్ సాయంతో స్కూటర్ కన్సోల్‌కు కనెక్ట్ కావచ్చు, ప్రస్తుతం ఇది ఆండ్రాయిడ్ ఓఎస్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.

సుజుకి మోటార్‌సైకిళ్లలో కొత్త బ్లూటూత్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ టెక్నాలజీ!

ఈ స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్ కనెక్టెడ్ టెక్నాలజీలో కాలర్ ఐడితో మిస్డ్ కాల్ అలర్ట్, ఎస్ఎమ్ఎస్ మరియు వాట్సాప్ మెసేజ్ అలెర్ట్స్, టర్న్-బై-టర్న్ నావిగేషన్, ఫోన్ బ్యాటరీ ఇండికేటర్, ఈటిఏ అప్‌డేట్స్ వంటి పలు రైడర్ ఫీచర్లకు సంబంధించి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఇంకా ఈ యాప్ సాయంతో వాహన గణాంకాలు, ట్రిప్ షేరింగ్ సమాచారం, చివరిగా నిలిపిన ప్రదేశం వంటి స్మార్ట్ ఫీచర్లను కూడా పొందవచ్చు.

MOST READ:ఈ స్టార్ కపుల్స్ పెళ్లి రోజు కొన్న కారు ధర రూ. 2.65 కోట్లు.. ఇంతకీ వారు ఎవరో తెలుసా ?

సుజుకి మోటార్‌సైకిళ్లలో కొత్త బ్లూటూత్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ టెక్నాలజీ!

టూవీలర్లలో కనెక్టింగ్ టెక్నాలజీ ఇప్పుడు అత్యంత ప్రాచుర్యం పొందిన ఫీచర్లలో ఒకటిగా మారిపోయింది. ఇప్పటికే భారతదేశంలో అనేక రకాల ఇతర బ్రాండ్‌లు ఈ తరహా కనెక్టెడ్ టెక్నాలజీని అందిస్తున్నాయి. ఈ టెక్నాలజీ సాయంతో రైడర్లు/డ్రైవర్లు తమ వాహనాలతో రిమోట్‌గా కనెక్ట్ కావటం, వివిధ రకాల సమాచారాన్ని మరియు నోటిఫికేషన్లను పొందటం చేయవచ్చు.

సుజుకి మోటార్‌సైకిళ్లలో కొత్త బ్లూటూత్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ టెక్నాలజీ!

భవిష్యత్తులో కొత్త టెక్నాలజీని ప్రారంభించాలని కంపెనీ నిర్ణయించినప్పుడు ఈ ఫీచర్లన్నీ సుజుకి మోటార్‌సైకిళ్లలో అందుబాటులోకి వస్తాయి. అయితే, ఇది ప్రస్తుతం స్కూటర్లలో అందుబాటులో ఉన్నట్లుగా ఉంటుందా లేదా దాన్ని అధునాతనంగా ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది.

MOST READ:మీరు ఈ బైక్ గుర్తుపట్టారా.. ఇది అందరికీ ఇష్టమైన బైక్ కూడా

సుజుకి మోటార్‌సైకిళ్లలో కొత్త బ్లూటూత్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ టెక్నాలజీ!

ప్రస్తుతం, మాస్ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని సుజుకి బ్రాండ్ లైనప్‌లో ఐదు మోటార్ సైకిళ్ళు ఉన్నాయి. ఇందులో జిక్సెర్ 155, జిక్సెర్ ఎస్ఎఫ్ 155, జిక్సెర్ 250, జిక్సెర్ ఎస్ఎఫ్ 250 మరియు ఇంట్రూడర్ మోడళ్లు ఉన్నాయి. అన్ని మోటార్‌సైకిళ్ళు త్వరలో కొత్త బ్లూటూత్ ఎనేబుల్డ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ను అందుకుంటాయని అంచనా.

సుజుకి మోటార్‌సైకిళ్లలో కొత్త బ్లూటూత్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ టెక్నాలజీ!

ఇకపోతే, కొత్త బ్లూటూత్ కనెక్టివిటీతో విడుదలైన యాక్సెస్ 125 ప్రారంభ ధర ఇప్పుడు రూ.77,700 లుగా ఉంటే, బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ ధర రూ.84,600 లుగా ఉంది (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఈ రెండు స్కూటర్లు వివిధ రకాల కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉన్నాయి.

MOST READ:కెమెరాకు చిక్కిన రెడ్ కలర్ ఫోర్స్ గూర్ఖా.. ఇది నిజంగా సూపర్ లుక్ గురూ..!

సుజుకి మోటార్‌సైకిళ్లలో కొత్త బ్లూటూత్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ టెక్నాలజీ!

బ్లూటూత్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో కూడిన సుజుకి యాక్సెస్ 125, బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ మోడళ్ల విడుదలపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

టూవీలర్లలో స్మార్ట్ కనెక్టింగ్ టెక్నాలజీ ఇప్పుడు అత్యంత ప్రాచుర్యం పొందిన ఫీచర్లలో ఒకటిగా మారిపోయింది. సుజుకి ఇప్పటికే ఈ కొత్త బ్లూటూత్ టెక్నాలజీని తమ స్కూటర్ల ద్వారా పరిచయంచేసింది. ఇది విజయవంతం అయింతే, త్వరలోనే ఈ తరహా టెక్నాలజీని కంపెనీ మోటార్‌సైకిళ్లలో కూడా అందించే అవకాశం ఉంది.

Most Read Articles

English summary
Suzuki had launched a new Bluetooth enabled digital instrument console on its Access 125 and the Burgman Street scooter range in the Indian market. The company has announced that the new technology will also make its way on its motorcycle range at a later date. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X