'స్విచ్' ఎలక్ట్రిక్ బైకులు వచ్చేస్తున్నాయోచ్; భారత్‌లో 70 డీలర్‌షిప్ కేంద్రాలు!

ఎలక్ట్రిక్ సైకిల్ స్టార్ట్అప్ కంపెనీ 'స్విచ్' (Svitch) దేశవ్యాప్తంగా తన ఉనికిని చాటుకోవాలని ప్రయత్నిస్తోంది. ఇప్పుడిప్పుడే ఎలక్ట్రిక్ వాహనాల తయారీలోకి ప్రవేశించిన ఈ బ్రాండ్, రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా తమ వ్యాపారాన్ని విస్తరించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

'స్విచ్' ఎలక్ట్రిక్ బైకులు వచ్చేస్తున్నాయోచ్; భారత్‌లో 70 డీలర్‌షిప్ కేంద్రాలు!

స్విచ్ రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా 70 మందికి పైగా డీలర్లు, ఐదుగురు డిస్ట్రిబ్యూటర్లు మరియు నాలుగు ప్రత్యేకమైన డీలర్‌షిప్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం, స్విచ్ మహారాష్ట్ర, హర్యానా, న్యూ ఢిల్లీ మరియు కర్ణాటక రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్లను కలిగి ఉంది.

'స్విచ్' ఎలక్ట్రిక్ బైకులు వచ్చేస్తున్నాయోచ్; భారత్‌లో 70 డీలర్‌షిప్ కేంద్రాలు!

ఈ బ్రాండ్‌కు బెంగళూరు, పూణే, ఔరంగాబాద్ మరియు హిమ్మత్‌నగర్‌లలో నాలుగు ప్రత్యేకమైన స్విచ్ షోరూమ్‌లు కూడా ఉన్నాయి. స్విచ్ ప్రస్తుతం భారత మార్కెట్లో ఒకే సైకిల్‌ను విక్రయిస్తోంది. ఈ స్విచ్ సైకిల్ మూడు వేరియంట్లలో లభిస్తుంది. అవి ఎమ్ఎక్స్ఈ, ఎక్స్ఈ, ఎక్స్ఈ ప్లస్.

MOST READ:10 కంటే ఎక్కువ రోల్స్ రాయిస్ కార్లు కలిగి ఉన్న బిలీనియర్ : అతని కార్ల వివరాలు

'స్విచ్' ఎలక్ట్రిక్ బైకులు వచ్చేస్తున్నాయోచ్; భారత్‌లో 70 డీలర్‌షిప్ కేంద్రాలు!

బేస్ వేరియంట్ ఎలక్ట్రిక్ సైకిల్ అయిన స్విచ్ ఎమ్ఎక్స్ఈ ప్రారంభ ధర రూ.47,000 లుగా ఉంది. ఇది 4 అడుగుల 9 అంగుళాల కన్నా తక్కువ ఎత్తు ఉన్నవారికి అనువుగా ఉంటుంది. ఈ కొలతలు పిల్లల పరిమాణానికి కూడా సరిపోయే విధంగా ఉంటాయి.

'స్విచ్' ఎలక్ట్రిక్ బైకులు వచ్చేస్తున్నాయోచ్; భారత్‌లో 70 డీలర్‌షిప్ కేంద్రాలు!

స్విచ్ ఎమ్ఎక్స్ఈ పరిమాణంలో చిన్నగా ఉన్నప్పటికీ, చాలా బోల్డ్‌గా పనితీరును కలిగి ఉంటుంది. ఇందులో సన్నని టైర్లు మెరుగైన్ రైడ్ గ్రిప్‌ను అందిస్తాయి. ఇందులోని షిమనో గేర్ యూనిట్ మరియు డ్యూయెల్ సస్పెన్షన్ సెటప్ మీ సైకిల్ రైడ్‌ను మరింత సౌకర్యవంతంగా మారుస్తుందని కంపెనీ పేర్కొంది.

MOST READ:370 కి.మీ. కేవలం 4 గంటల్లో చేరుకున్న అంబులెన్స్ డ్రైవర్.. ఎందుకో తెలుసా ?

'స్విచ్' ఎలక్ట్రిక్ బైకులు వచ్చేస్తున్నాయోచ్; భారత్‌లో 70 డీలర్‌షిప్ కేంద్రాలు!

స్విచ్ అందిస్తున్న ఎక్స్ఈ మరియు ఎక్స్ఈ ప్లస్ వేరియంట్ల ధరలు వరుసగా రూ.74,999 మరియు రూ.92,999గా ఉన్నాయి. ఇవి రెండూ విభిన్నమైన టైర్లు మరియు బ్యాటరీ రేంజ్‌లను కలిగి ఉంటాయి. వీటి కోసం కంపెనీ అదనపు యాక్ససరీలను మరియు ప్రత్యేకమైన వారంటీ ప్యాకేజీలను కూడా అందిస్తోంది.

'స్విచ్' ఎలక్ట్రిక్ బైకులు వచ్చేస్తున్నాయోచ్; భారత్‌లో 70 డీలర్‌షిప్ కేంద్రాలు!

స్విచ్ ఎలక్ట్రిక్ సైకిళ్లలో 250 వాట్ డిసి మోటార్ ఉంటుంది. దీని సాయంతో రైడర్ గంటకు 25 కిమీ వేగంతో ప్రయాణించవచ్చు. ఒకవేళ రైడర్ బ్యాటరీ పవర్‌కు పెడలింగ్ పవర్‌ను కూడా జోడించినట్లయితే గరిష్టంగా గంటకు 45 కిమీ దూసుకెళ్లిపోవచ్చని కంపెనీ తెలిపింది.

MOST READ:ఈ బుల్లి ఫోక్స్‌వ్యాగన్ బీచ్ బాంబ్ విలువ రూ.1.1 కోట్లకు పైమాటే!

'స్విచ్' ఎలక్ట్రిక్ బైకులు వచ్చేస్తున్నాయోచ్; భారత్‌లో 70 డీలర్‌షిప్ కేంద్రాలు!

స్విచ్ సైకిళ్లలో ఉపయోగించిన బ్యాటరీలు సుదీర్ఘమైన రేంజ్‌ను కలిగి ఉంటాయని, వీటిని ఒక్కసారి చార్జ్ చేస్తే 120 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించవచ్చు. ఫోల్డబిల్ డిజైన్, వెడల్పాటి టైర్లు, డ్యూయెల్ సస్పెన్షన్, డిస్క్ బ్రేకులు, డిజిటల్ డిస్‌ప్లే, స్మార్ట్ ఫోన్ అప్లికేషన్ మరియు డిజిటల్ డిస్‌ప్లే వంటి మరెన్నో ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

'స్విచ్' ఎలక్ట్రిక్ బైకులు వచ్చేస్తున్నాయోచ్; భారత్‌లో 70 డీలర్‌షిప్ కేంద్రాలు!

స్విచ్ అందిస్తున్న మూడు ఎలక్ట్రిక్ సైకిళ్ళు కూడా చాలా అందంగా కనిపిస్తాయి. వీటిలో ఉన్న ప్రధాన ప్రత్యేక ఏంటంటే, ఈ సైకిళ్లను సగానికి మడచిపెట్టే సౌలభ్యం ఉంటుంది. మడచిపెట్టిన తర్వాత దీని పరిమాణం చాలా చిన్నగా మారిపోతుంది, కాబట్టి వీటిని ఎక్కడికైనా సులువుగా తీసుకెళ్లవచ్చు మరియు వీటిని భద్రపరచడానికి ఎక్కువ స్థలం కూడా అవసరం ఉండదు.

MOST READ:భారతదేశ మసాలా కింగ్ ధరంపాల్ గులాటి కార్లు.. మీరు చూసారా !

'స్విచ్' ఎలక్ట్రిక్ బైకులు వచ్చేస్తున్నాయోచ్; భారత్‌లో 70 డీలర్‌షిప్ కేంద్రాలు!

భారత్‌లో స్విచ్ విస్తరణ ప్రణాళిక గురించి స్విచ్ వ్యవస్థాపకుడు రాజ్ పటేల్ మాట్లాడుతూ, కేవలం 650 చదరపు అడుగుల కార్యాలయంలో ఇద్దరు ఉద్యోగులతో తమ ప్రయాణాన్ని ప్రారంభించామని, ప్రస్తుతం తమ వినియోగదారులు మరియు డీలర్ల సహకారంతో 87కి పైగా స్విచ్ సహచరులను కలిగి ఉన్నామని, అహ్మదాబాద్‌లో 6000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించామని చెప్పారు.

'స్విచ్' ఎలక్ట్రిక్ బైకులు వచ్చేస్తున్నాయోచ్; భారత్‌లో 70 డీలర్‌షిప్ కేంద్రాలు!

స్విచ్ వాహనాల తయారీ కోసం 40,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక కర్మాగారాన్ని కూడా ఏర్పాటు చేశాని, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న తమ స్విచ్ వాహనాలు భవిష్యత్తులో ఈవీ మార్కెట్లో విప్లవాత్మక మార్పులను తెస్తాయని పటేల్ ధీమా వ్యక్తం చేశారు.

'స్విచ్' ఎలక్ట్రిక్ బైకులు వచ్చేస్తున్నాయోచ్; భారత్‌లో 70 డీలర్‌షిప్ కేంద్రాలు!

ఈ ఎలక్ట్రిక్ సైకిళ్లు కేవలం బ్యాటరీ పవర్‌తోనే కాకుండా పెడల్ పవర్‌ను కూడా కలిగి ఉంటాయి. కాబట్టి, ఈ సైకిళ్లను తొక్కడం ద్వారా మీకు మంచి వ్యాయామం కూడా లభిస్తుంది. సాధారణ ఐసి వాహనాలకు బదులుగా ప్రజలు తమ రోజువారీ ప్రయాణాల కోసం ఇలాంటి ఎలక్ట్రిక్ సైకిళ్లను ఉపయోగిస్తే పర్యావరణానికి ఎంతో కొంత మేలు చేసినట్లు అవుతుంది.

Most Read Articles

English summary
Electric Bicycle Manufacturer Svitch Plans To Expand Its Network. Compnay Will Have Over 70 Dealers In India. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X