ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకుంటున్నారా.. అయితే ఇది మీకోసమే

భారతదేశంలో ఇప్పుడు ఎలక్ట్రానికి వాహన యుగం ప్రారంభమైంది. ఇప్పుడు దాదాపు అన్ని కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో నిమగ్నమై ఉన్నాయి. ఇప్పటికే చాల కంపెనీలు తమ ఎలక్ట్రిక్ వాహనాలను ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసాయి. మార్కెట్లో విడుదల చేసిన ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో కార్లు, బైకులు మరియు స్కూటర్లు కూడా ఉన్నాయి.

ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకుంటున్నారా.. అయితే ఇది మీకోసమే

భారతదేశంలో లాంచ్ చేసిన ఎలక్ట్రిక్ వాహనాలు చాలానే ఉన్నాయి. ఇంకా చాల వాహనాలు త్వరలో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు మనదేశంలో కొనుగోలు చేయడానికి బెస్ట్ టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించి ఇక్కడ తెలుసుకుందాం!

ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకుంటున్నారా.. అయితే ఇది మీకోసమే

బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్

బజాజ్ ఆటో గత నెలలో తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్‌ బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని రూ. 1 లక్ష (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధర వద్ద విడుదల చేసింది. బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ 4 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటారుతో జతచేయబడిన 3 కిలోవాట్ల లిథియం-అయాన్-బ్యాటరీ ప్యాక్‌ని కలిగి ఉంటుంది. ఇది 16ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఎలెక్ట్రిక్ స్కూటర్ గరిష్టంగా 95 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. అదే స్పోర్ట్ మోడ్‌లో అయితే 85 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది.

ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకుంటున్నారా.. అయితే ఇది మీకోసమే

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రామాణిక మరియు వేగవంతమైన ఛార్జింగ్ టెక్నాలజీని కలిగి ఉంటుంది. ఈ విధంగా ఉండటం వల్ల ఫాస్ట్ ఛార్జింగ్ ను ఉపయోగించి చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం ఒక గంట ఛార్జింగ్ తో 25 కిలోమీటర్ల పరిధిని అందించగలదని బజాజ్ పేర్కొన్నారు.

ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకుంటున్నారా.. అయితే ఇది మీకోసమే

బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ ప్రీమియం ఉత్పత్తిగా ఉంచబడింది. ఇది పూర్తి-ఎల్ఈడి లైటింగ్ మరియు డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి లక్షణాలతో పాటు మంచి అప్డేట్ ఫీచర్స్ ని కలిగి ఉంది.

ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకుంటున్నారా.. అయితే ఇది మీకోసమే

ఏథర్ 450

ఏథర్ ఎనర్జీ భారతదేశంలో ప్రారంభించబడిన ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో ఒకటి ఈ ఏథర్ 450. ఇది 2.4 కిలో వాట్ల బ్యాటరీని కలిగి ఉంటుంది. ఏథర్ 450 రెండు మోడ్ లలో వస్తుంది. ఒకటి ఎకో మోడ్, రెండు స్పోర్ట్ మోడ్.

ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకుంటున్నారా.. అయితే ఇది మీకోసమే

ఏథర్ 450 ఎలక్ట్రిక్ స్కూటర్ ఎకో మోడ్ లో దాదాపు 75 కిలోమీటర్ల పరిధిని ఇస్తుంది. అదే విధంగా స్పోర్ట్ మోడ్ లో అయితే 55 కిలోమీటర్ల గరిష్ట పరిధిని అందిస్తుంది. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇండియన్ మార్కెట్లో ఏథర్ 450 ధర రూ. 1.13 లక్షలు (ఆన్-రోడ్) రిటైల్ చేస్తుంది.

ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకుంటున్నారా.. అయితే ఇది మీకోసమే

ఏథర్ 450 ఎక్స్

ఏథర్ ఎనర్జీ భారతదేశంలో ప్రారంభించబడిన ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో రెండవ మోడల్ ఈ ఏథర్ 450 ఎక్స్. ఇటీవల కాలంలో ఏథర్ ఎనర్జీ 450 ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. ఇది శక్తివంతమైన 3.3 కిలో కిలో వాట్ల బ్యాటరీని కలిగి ఉంటుంది.

ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకుంటున్నారా.. అయితే ఇది మీకోసమే

ఏథర్ ఎనర్జీ యొక్క ఏథర్ 450 ఎక్స్ ధర రూ. 1.49 లక్షలు మరియు ఏథర్ 450 ఎక్స్ ప్రో ఎలెక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 1.59 లక్షలు (ఎక్స్-షోరూమ్) ల వద్ద లభిస్తాయి.

ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకుంటున్నారా.. అయితే ఇది మీకోసమే

టీవీఎస్ ఐక్యూబ్

ఇండియన్ మార్కెట్లో బజాజ్ చేతక్ ప్రారంభించిన కొద్దీ రోజులకే టీవీఎస్ ఐక్యూబ్ ప్రారంభించబడింది. టీవీఎస్ కంపెనీ యొక్క మొట్ట మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ టీవీఎస్ ఐక్యూబ్. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని జనవరి 25 న ప్రారంభించారు.

ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకుంటున్నారా.. అయితే ఇది మీకోసమే

టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్లో ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, ఫుల్లీ-డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, ఎల్ఈడీ టెయిల్ లైట్లు మరియు ఇల్యుమినేటెడ్ లోగో వంటివాటిని కలిగి ఉంటుంది.

ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకుంటున్నారా.. అయితే ఇది మీకోసమే

టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో సాంకేతికంగా 4.4 kW సామర్థ్యం గల ఎలక్ట్రిక్ మోటార్ కలదు, దీని గరిష్ట వేగం గంటకు 78 కిలోమీటర్లు మరియు 4.2 సెకండ్ల వ్యవధిలోనే గంటకు 0-40 కిమీల వేగాన్ని అందుకుంటుంది. ఒక్కసారి ఛార్జింగ్‌తో గరిష్టంగా 75కిలోమీటర్లు నడుస్తుంది. టీవీఎస్ ఐక్యూబ్‌ను ప్రారంభ ధర రూ. 1.15 లక్షలు (ఎక్స్-షోరూమ్) వద్ద రిటైల్ చేస్తుంది.

ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకుంటున్నారా.. అయితే ఇది మీకోసమే

హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా

ఎలక్ట్రిక్ స్కూటర్ల జాబితాలో అత్యంత తక్కువ ధరను కలిగిన స్కూటర్ ఈ హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా. ఇది రూ. 68,721 (ఎక్స్-షోరూమ్) వద్ద ప్రారంభించబడింది. హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా ఒక ఫుల్ చార్జితో దాదాపు 50 కిలోమీర్ల పరిధిని అందిస్తుంది.

Most Read Articles

English summary
Top 5 Electric Scooters To Buy In India – Ather 450 To Chetak EV. Read in Telugu.
Story first published: Wednesday, February 26, 2020, 15:48 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X