ట్రైయంప్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

ట్రయంప్ మోటార్‌సైకిల్ ఇండియా భారత్‌లో తమ సరికొత్త ఎంట్రీ లెవల్ నేక్డ్ స్ట్రీట్ మోటార్‌సైకిల్‌ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్‌ను నేడు (2020 ఆగస్టు 11) మార్కెట్లో విడుదల చేసింది. దేయ విపణిలో కొత్త ట్రైయంప్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ మోటార్‌సైకిల్ ధర రూ.8.84 లక్షలు ఎక్స్-షోరూమ్, ఇండియాగా ఉంది.

ట్రైయంప్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

ఈమోటార్‌సైకిల్‌ను మార్కెట్లో విడుదల చేయటానికి ముందు నుంచే కంపెనీ దీని కోసం బుకింగ్‌లను స్వీకరిస్తోంది. రూ.1 లక్ష టోకెన్ అమౌంట్‌తో ట్రయంప్ మోటార్‌సైకిల్స్ ఇండియా తమ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ కోసం ప్రీ-బుకింగ్స్ ప్రారంభించింది. ఈ కొత్త మోడల్ గతంలో కంపెనీ విక్రయించిన ‘ఎస్' వేరియంట్‌ను భర్తీ చేస్తూ స్ట్రీట్ ట్రిపుల్ లైనప్‌లో కొత్త ఎంట్రీ లెవల్ వేరియంట్‌గా విడుదలైంది.

ట్రైయంప్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

కొత్త ట్రైయంప్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ మోటార్‌సైకిల్‌లో కొత్త ఆకర్షనీయమైన బాడీ గ్రాఫిక్స్, రీస్టైల్ చేసిన రియర్ వ్యూ మిర్రర్స్, రీడిజైన్ చేసిన ఎగ్జాస్ట్ (సైలెన్సర్) వంటి మార్పులు ఉన్నాయి. ఇది రెండు కొత్త కలర్ ఆప్షన్లలో (సఫైర్ బ్లాక్, మ్యాట్ సిల్వర్ ఐస్) లభ్యం కానుంది.

MOST READ:షారుఖ్ ఖాన్ బిఎండబ్ల్యు స్కోడా ఆక్టేవియా కంటే చీప్ , ఎంతో తెలుసా

ట్రైయంప్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

ట్రైయంప్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్ వేరియంట్ మాదిరిగానే స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ వేరియంట్‌లో కూడా అదే 765 సిసి, ఇన్-లైన్ త్రీ-సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. అయితే, ‘ఆర్‌' వేరియంట్‌లోని ఇంజన్ కొద్దిగా తక్కువ ట్యూన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 12,000 ఆర్‌పిఎమ్ వద్ద 116 బిహెచ్‌పి శక్తిని మరియు 9,400 ఆర్‌పిఎమ్ వద్ద 77 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ట్రైయంప్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

ఇది ఆర్ఎస్ వేరియంట్ ఇంజన్ గణాంకాలతో పోలిస్తే, 5 బిహెచ్‌పి మరియు 2 ఎన్ఎమ్ తక్కువగా ఉంటుంది. ఈ ఇంజన్ స్లిప్-అసిస్టెడ్ క్లచ్‌తో సిక్స్-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

MOST READ:అలర్ట్ : వాహనాలు బయట పార్కింగ్ చేస్తున్నారా.. అయితే ఇది చూడండి

ట్రైయంప్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

ఆర్ఎస్ వేరియంట్‌తో పోలిస్తే ఆర్ వేరియంట్‌లో మెకానికల్ హార్డ్‌వేర్‌లో కూడా మార్పులు ఉన్నాయి. ట్రైయంప్ స్ట్రీట్ ట్రిపుల్ ‘ఆర్ఎస్' వేరియంట్‌లో టిఎఫ్‌టి కలర్ డిస్‌ప్లే ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌తో పోలిస్తే ఆర్ వేరియంట్‌లో అనలాగ్ టాకోమీటర్‌తో కూడిన ఎల్‌సిడి మాత్రమే ఉంటుంది. ఇంకా ఇందులో మూడు రైడింగ్ మోడ్స్, ఏబిఎస్, ట్రాక్షన్ కంట్రోల్, టూ-వే క్విక్ షిఫ్టర్ వంటి ఇతర ఫీచర్లు కూడా ఉన్నాయి.

ట్రైయంప్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

ఏదేమైనప్పటికీ, ఈ ట్రైయంప్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ మోటార్‌సైకిల్ ఓవరాల్ డిజైన్ మరియు సిల్హౌట్ చూడటానికి టాప్-స్పెక్స్ ఆర్ఎస్ వేరియంట్ మాదిరిగానే అనిపిస్తుంది. ఈ రెండింటికీ కేవలం కొన్ని ఫీచర్లు మాత్రమే మారుతున్నాయి. ఇది ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఈడి డిఆర్‌ఎల్‌లు మరియు ట్విన్-పాడ్ ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్‌లతో అగ్రెసివ్‌గా కనిపించే ఫ్రంట్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. దీని మజిక్యులర్ ఫ్యూయెల్ ట్యాంక్ బైక్ లుక్‌ని మరింత పెంచుతుంది. ఇందులోని అప్‌రైట్ హ్యాండిల్‌బార్ సౌకర్యవంతమైన రైడింగ్ పొజిషన్‌ను ఆఫర్ చేస్తుంది.

MOST READ:ప్రయాణికులు వణికిపోయేలా చేసే ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన విమానాశ్రయాలు, ఇవే

ట్రైయంప్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ సస్పెన్షన్ విషయానికి వస్తే, ముందు భాగంలో 41 మిమీ ఫోర్కులు మరియు వెనుక భాగంలో మోనో-షాక్ సెటప్ ఉంటాయి. ఇవి రెండూ షోవా నుండి గ్రహించబడినవి మరియు పూర్తిగా సర్దుబాటు చేయడానికి వీలుగా ఉంటాయి. ఇక బ్రేకింగ్‌ను గమనిస్తే, ఈ మోటార్‌సైకిల్‌పై ముందు భాగంలో 310 మిమీ డిస్క్ బ్రేక్ మరియు వెనుకవైపు 220 మిమీ డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. ఇవి రెండూ డ్యూయల్-ఛానెల్ ఏబిఎస్‌ను సపోర్ట్ చేస్తుంది. ఇరు వైపులా పీరెల్లీ పెర్ఫార్మెన్స్ టైర్లను అమర్చబడి ఉంటాయి.

ట్రైయంప్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

స్ట్రీట్ ట్రిపుల్ సిరీస్‌లో ట్రైయంప్ 765 సిసి ఇంజన్‌ను ప్రవేశపెట్టిన తర్వాత కంపెనీ ఈ మోటార్‌సైకిల్ పోర్ట్‌ఫోలియోలో గణనీయమైన మార్పును తీసుకువచ్చింది. సంవత్సరాలుగా స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ టాప్-స్పెక్ వేరియంట్‌లో మాత్రమే లభ్యమయ్యేది. ఎప్పుడైతే ట్రైయంప్ 2017లో ఇందులో కొత్త శ్రేణి ట్రైయంప్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్‌ను ప్రవేశపెట్టింతో అప్పటి నుండి ఈ మోడల్ ఫేట్ మారిపోయింది.

MOST READ:వరద నీటిలో చేపలాగా ఈదుతున్న ఎలక్ట్రిక్ కారు

ట్రైయంప్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

ట్రైయంప్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ విడుదలపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

ట్రయంప్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ మోడల్ ధరను అందుబాటులో ఉంచడం కోసం కంపెనీ ఈ సిరీస్‌లోని టాప్-స్పెక్ ఆర్ఎస్ వేరియంట్లో అందిస్తున్న కొన్ని ముఖ్యమైన ఫీచర్లు ఎలక్ట్రానిక్ అసిస్టెన్స్ ఫీచర్లను ఆర్ వేరియంట్‌లో తొలగిచింది. ఇంజన్ పవర్ కూడా ఆర్ఎస్ వేరియంట్ కన్నా కాస్తంత తక్కువగా ఉంటుంది. ఈ మోటార్‌సైకిల్ బరువును పరిగణలోకి తీసుకుంటే, ఇది ధరకు తగిన విలువను అందిస్తుందనేది మా అభిప్రాయం.

Most Read Articles

English summary
Triumph Motorcycles India launch the Street Triple R motorcycle in the Indian market. The new street-naked performance motorcycle is priced at Rs 8.84 lakh, ex-showroom (India). Bookings for the motorcycle has already started ahead of launch. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X