Just In
- 1 hr ago
525 హార్స్ పవర్ వి8 ఇంజన్‌తో వస్తున్న మోస్ట్ పవర్ఫుల్ డిఫెండర్ వి8
- 2 hrs ago
45 లీటర్ల ఇంధన ట్యాంక్‌లో 48 లీటర్ల పెట్రోల్.. దీనితో మొదలైన గొడవ.. చివరికి ఏమైందంటే
- 3 hrs ago
సూపర్ సోకో నుండి మూడు సరికొత్త ఎలక్ట్రిక్ టూవీలర్స్
- 4 hrs ago
చెన్నైలో కొత్త డీలర్షిప్ ప్రారంభించిన వోల్వో.. పూర్తి వివరాలు
Don't Miss
- News
Same Sex marriage: మోడీ సర్కార్ నిర్ణయంపై భగ్గుమంటోన్న స్వలింగ సంపర్కులు: తొక్కేశారంటూ
- Sports
యువరాజ్ సింగ్ ట్వీట్‌పై దుమారం.. ఈ లెక్కన కోహ్లీ 200 సెంచరీలు చేసేవాడా?
- Finance
అయిదేళ్లలో 63% పెరగనున్న కుబేరులు, ప్రపంచంలోనే భారత్ టాప్
- Movies
ఈ సినిమా చేస్తే కొడతారని చెప్పింది.. అందుకే కాజల్‌కు ఫోన్ చేశా: మంచు విష్ణు
- Lifestyle
marriage life: పెద్దలు కుదిర్చిన పెళ్లితో లాభమా.. నష్టమా?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
పోలీస్ ఫేవరెట్ మోటార్‌సైకిల్‌గా మారిన టీవీఎస్ అపాచే
చెన్నైకి చెందిన ప్రముఖ టూవీలర్ బ్రాండ్ టీవీఎస్ మోటార్ కంపెనీ అందిస్తున్న పాపులర్ అపాచీ మోటార్‌సైకిల్ ఇప్పుడు పోలీసుల ఫేవరెట్ వాహనంగా మారింది. కంపెనీ ఇటీవలే 25 టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 160 మోటార్‌సైకిళ్లను బెంగళూరు పోలీసులకు అందజేసినట్లు కంపెనీ పేర్కొంది.

దేశంలోని ఫ్రంట్‌లైన్ కార్మికులకు మద్దతు ఇవ్వడంలో బ్రాండ్ యొక్క నిబద్ధతలో భాగంగా టీవీఎస్ మోటార్ కంపెనీ ఈ మోటార్‌సైకిళ్లను పంపిణీ చేసింది. కర్ణాటక హోంమంత్రి శ్రీ బసవరాజ్ బొమ్మాయి, బెంగళూరు పోలీసు కమిషనర్ కమల్ పంత్ సమక్షంలో టీవీఎస్ మోటార్ కంపెనీ మార్కెటింగ్ హెడ్, మేఘశ్యామ్ దిఘోలే ఈ మోటార్‌సైకిళ్లను అందజేశారు.

టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ మోడళ్లు ఇప్పటికే చాలా కాలంగా బెంగళూరు పోలీసుల వాహనాల సముదాయంలో భాగంగా ఉన్నాయి. కాగా, కొత్తగా జోడించిన ఈ 160సీసీ మోడళ్లు, నగరంలో పెట్రోలింగ్ చేయడంలో పోలీసులకు సహకరిస్తాయి. పోలీసులకు పంపిణీ చేసిన అపాచీ ఆర్‌టిఆర్ 160 కొన్ని ప్రత్యేకమైన ఫీచర్లు మరియు స్పెషల్ గ్రాఫిక్స్‌తో లభిస్తుంది.
MOST READ:మీకు తెలుసా.. అత్యంత ఖరీదైన తెలుగు హీరోల కార్లు, వాటి వివరాలు

టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 160 మోడల్ భారత మార్కెట్లో విక్రయించే అత్యంత నమ్మకమైన మోటార్‌సైకిళ్ళలో ఒకటిగా ఉంటుంది. తక్కువ మెయింటినెన్స్ ఖర్చు, సాటిలేని పనితీరుతో రూపుదిద్దుకున్న కొత్త టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 160 బెంగళూరు పోలీసు బలగాలకు తగిన తోడుగా నిలుస్తుందని కంపెనీ భావిస్తోంది.

ఇకపోతే, టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 160 మోటార్‌సైకిల్ విషయానికి వస్తే, ఇందులో 159 సిసి సింగిల్ సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 8400 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 15.3 బిహెచ్‌పి పవర్‌ను మరియు 7000 ఆర్‌పిఎమ్ వద్ద 13.9 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ స్టాండర్డ్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.
MOST READ:పరుగులు తీస్తున్న ఫాస్ట్‌ట్యాగ్ ఇన్స్టాలేషన్.. ఇప్పటికి ఎంతో తెలుసా?

అపాచీ మోడల్‌లోని కొన్ని డిజైన్ హైలైట్స్‌ను గమనిస్తే, ఇందులో హాలోజన్ హెడ్‌ల్యాంప్‌లు, ట్యాంక్ ష్రుడ్స్‌తో మజిక్యులర్‌గా కనిపించే ఫ్యూయెల్ ట్యాంక్, సింగిల్ పీస్ రైడర్ మరియు పిలియన్ రైడర్ సీట్, అల్లాయ్ వీల్స్ మరియు ఎల్‌ఈడి టెయిల్ లాంప్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

సస్పెన్షన్ విషయానికి వస్తే, ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక భాగంలో ట్విన్ గ్యాస్-ఛార్జ్డ్ షాక్ అబ్జార్వర్ సెటప్ ఉంటుంది. ఇక బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందు మరియు వెనుక వైపున వరుసగా 270 మిమీ మరియు 200 మిమీ పెటల్ డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. ఈ మోటార్‌సైకిల్ సింగిల్-ఛానల్ ఏబిఎస్‌ను సపోర్ట్ చేస్తుంది.
MOST READ:రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350 రివ్యూ.. ఇది అభిమానుల అంచనాలను అందుకుంటుందా..?

టీవీఎస్ అపాచీకి సంబంధించిన ఇటీవలి వార్తలను గమనిస్తే, కంపెనీ ఇటీవలే తమ సరికొత్త 2021 టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 200 4వి మోడల్‌ని భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ మోటార్‌సైకిల్‌లో సర్దుబాటు చేయగల ఫ్రంట్ సస్పెన్షన్‌తో పాటు బహుళ డ్రైవింగ్ మోడ్‌లను మరియు అనేక ఫీచర్లను కలిగి ఉంది. - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

బెంగుళూరు పోలీసుల ఫేవరెట్ అపాచీ ఆర్‌టిఆర్ మోటార్‌సైకిల్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
టీవీఎస్ మోటార్ కంపెనీ దేశానికి సేవలందించే ఫ్రంట్‌లైన్ కార్మికులకు సహాయం చేయటం కోసం నిరంతరం సిఎస్‌ఆర్ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంది, ఇందులో భాగంగానే, కంపెనీ ఇప్పుడు బెంగళూరు పోలీసుల కోసం మొత్తం 25 కొత్త టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 160 మోటార్‌సైకిళ్లను పెట్రోలింగ్ వాహనాలుగా అందించింది. కుదోస్ టూ టీవీఎస్.
MOST READ:మెర్సిడెస్ బెంజ్ క్లాసిక్ కార్ ర్యాలీ ; పూర్తి వివరాలు