Just In
- 2 hrs ago
525 హార్స్ పవర్ వి8 ఇంజన్‌తో వస్తున్న మోస్ట్ పవర్ఫుల్ డిఫెండర్ వి8
- 2 hrs ago
45 లీటర్ల ఇంధన ట్యాంక్‌లో 48 లీటర్ల పెట్రోల్.. దీనితో మొదలైన గొడవ.. చివరికి ఏమైందంటే
- 4 hrs ago
సూపర్ సోకో నుండి మూడు సరికొత్త ఎలక్ట్రిక్ టూవీలర్స్
- 4 hrs ago
చెన్నైలో కొత్త డీలర్షిప్ ప్రారంభించిన వోల్వో.. పూర్తి వివరాలు
Don't Miss
- Sports
రెండు రోజుల్లోనే 22 టెస్టులు పూర్తి.. ఇంగ్లండ్ జట్టుదే ఆధిపత్యం!! భారత్ ఎన్నిసార్లంటే?
- Movies
మహేశ్‌కు మళ్లీ కథ చెప్పిన సక్సెస్ఫుల్ డైరెక్టర్: ఈ సారి మరో ప్రయోగం అంటూ రిప్లై
- News
Same Sex marriage: మోడీ సర్కార్ నిర్ణయంపై భగ్గుమంటోన్న స్వలింగ సంపర్కులు: తొక్కేశారంటూ
- Finance
గుడ్‌న్యూస్, 30,000 మందికి క్యాప్‌జెమిని ఉద్యోగాలు! ఫ్రెషర్స్, ఎక్స్‌పీరియన్స్‌కు అవకాశం
- Lifestyle
ఈ 4 రాశుల వారికి లీడర్ షిప్ క్వాలిటీస్ ఉండవు... ఈ జాబితాలో మీ రాశి ఉందేమో చూసెయ్యండి...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
పెరిగిన టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 200 4వి ధరలు - కొత్త ప్రైస్ లిస్ట్
టీవీఎస్ మోటార్ కంపెనీ తమ అపాచీ ఆర్‌టిఆర్ 200 4వి మోడల్ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం భారత మార్కెట్లో టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 200 4వి రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో సింగిల్ ఛానెల్ ఏబిఎస్ మరియు డ్యూయల్ ఛానెల్ ఏబిఎస్ వేరియంట్లు ఉన్నాయి. ఈ రెండు వేరియంట్ల ధరలు పెరిగాయి.

టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 200 4వి రెండు వేరియంట్ల ధరలు రూ.1,500 మేర పెరిగాయి. తాజా ధరల పెరుగుదల తర్వాత, టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 200 4వి సింగిల్ ఛానెల్ మరియు డ్యూయల్ ఛానెల్ ఏబిఎస్ వేరియంట్ల ధరలు వరుసగా రూ.1.25 లక్షలు మరియు రూ.1.30 లక్షలుగా ఉన్నాయి (ఎక్స్-షోరూమ్, ఇండియా).

టీవీఎస్ మోటార్ కంపెనీ ఓవైపు తమ అపాచీ ఆర్‌టిఆర్ 200 4వి మోడళ్ల ధరలను పెంచుతూనే మరోవైపు ఈ మోటార్‌సైకిళ్ల కొనుగోలుపై ఫెస్టివల్ ఆఫర్లను కూడా ప్రకటించింది. ఈ మోటారుసైకిల్‌ను కొనుగోలు చేసే కస్టమర్లకు కంపెనీ రూ.5,000 క్యాష్‌బ్యాక్‌ను కూడా అందిస్తోంది.
MOST READ:సైకిల్ రిపేర్ షాప్ ఓనర్ తయారుచేసిన ఎలక్ట్రిక్ బైక్.. ఎలా ఉందో చూసారా ?

వీటికి అదనంగా, కంపెనీ లో ఈఎమ్ఐ, ఫ్లెక్సిబిల్ రీపేమెంట్ స్కీమ్ వంటి ఆకర్షణీయమైన ఫైనాన్స్ పథకాలను కూడా అందిస్తోంది. ఈ మోడళ్ల కోసం కంపెనీ అందించే రెండు తక్కువ డౌన్‌పేమెంట్ పథకాలలో కస్టమర్లు రూ.16,999 మరియు రూ.21,999 ఆప్షన్లను ఎంచుకోవచ్చు.

కంపెనీ ఆఫర్ చేస్తున్న ఇతర ఫైనాన్స్ స్కీమ్‌లలో రూ.299 లో ఈఎమ్ఐ, ఒక స్టెప్-అప్ ఈఎమ్ఐ స్కీమ్ మరియు కొనుగోలు చేసిన తేదీ నుండి మొదటి మూడు నెలల వరకూ 50 శాతం తక్కువ ఈఎమ్ఐ సదుపాయాలు ఉన్నాయి. డెబిట్ మరియు క్రెడిట్ కార్డ్ ఈఎమ్ఐ ఆప్షన్లపై కేవలం 10 నిమిషాల్లోనే అప్రూవల్ అందించే ఆఫర్లను కూడా కంపెనీ అందిస్తోంది.
MOST READ:ప్రత్యర్థుల గుండెల్లో దడ పుట్టిస్తున్న యమహా ఎమ్‌టి-09 బైక్ టీజర్ వీడియో

ఇక టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 200 4వి విషయానికి వస్తే, ఈ మోటార్‌సైకిల్ ఫుల్లీ లోడెడ్ ఫీచర్లతో లభిస్తుంది. ఇందులో కొత్త ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్‌లు, పొజిషన్ లాంప్స్, ఫెదర్ టచ్ స్టార్ట్, కొత్త బాడీ గ్రాఫిక్స్ మరియు స్టాప్-స్టార్ట్ ట్రాఫిక్‌లో సులువుగా ప్రయాణించేందుకు వీలుగా డిజైన్ చేసిన బ్రాండ్ యొక్క సిగ్నేచర్ గ్లైడ్ త్రూ టెక్నాలజీ (జిటిటి)లు ఉన్నాయి.

ఈ మోటారుసైకిల్‌లో బ్లూటూత్ ఎనేబుల్డ్ ఎల్‌సిడి ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఉంటుంది, ఇది బ్రాండ్ యొక్క ‘స్మార్ట్‌ఎక్స్ కనెక్ట్' కనెక్టింగ్ టెక్నాలజీని సపోర్ట్ చేస్తుంది. ఇది రైడర్ టెలిమెట్రీ డేటాతో సహా అనేక ఇతర సమాచారాన్ని అందిస్తుంది. కస్టమర్ ఎంచుకునే వేరియంట్‌ను రేస్-ట్యూన్డ్ స్లిప్పర్ క్లచ్, వెనుక లిఫ్ట్ తగ్గించే డ్యూయల్-ఛానెల్ ఏబిఎస్ ఫీచర్లు లభిస్తాయి.
MOST READ:లగ్జరీ బిఎమ్‌డబ్ల్యూ కె 1600 జిటి బైక్‌పై కనిపించిన సద్గురు జగ్గీ వాసుదేవ్

కొత్త 2020 టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 200 4వి 197.75 సిసి సింగిల్ సిలిండర్, ఫోర్-వాల్వ్, ఎయిర్ / ఆయిల్-కూల్డ్, ఫ్యూయెల్-ఇంజెక్ట్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 8,500 ఆర్‌పిఎమ్ వద్ద 20.2 బిహెచ్‌పి పవర్‌ను మరియు 7,500 ఆర్‌పిఎమ్ వద్ద 16.8 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ స్టాండర్డ్ ఫైవ్-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 200 4వి రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అవి: గ్లోసీ బ్లాక్ మరియు పెరల్ వైట్. టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 200 4వి ఈ విభాగంలో బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 200, కెటిఎమ్ 200 డ్యూక్ మరియు ఇటీవల విడుదలైన హోండా హార్నెట్ 2.0 వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.
MOST READ:20 సంవత్సరాల తర్వాత కూడా కొత్తగా ఉన్న పాత కారు.. ఇది ఒక పొలిటికల్ లీడర్ ఇష్టమైన కార్ కూడా

టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 200 4వి ధర పెంపుపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
టీవీఎస్ మోటార్ కంపెనీ తమ పాపులర్ అపాచీ ఆర్‌టిఆర్ 200 4వి సిరీస్ మోటార్‌సైకిళ్లను ధరలను స్వల్పంగా పెంచినప్పటికీ, ఈ రెండు వేరియంట్లపై కంపెనీ క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను కూడా ప్రకటించడం విశేషం.