టీవీఎస్ జూపిటర్ డిస్క్ బ్రేక్ వేరియంట్ విడుదల: ధర, ఫీచర్లు

చెన్నైకి చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ, భారత మార్కెట్లో విక్రయిస్తున్న బిఎస్ జూపిటర్ స్కూటర్‌లో మరో కొత్త వేరియంట్‌ను మార్కెట్లో విడుదల చేసింది. డిస్క్ బ్రేకే మరియు ఐ-టచ్‌స్టార్ట్ సిస్టమ్‌తో కూడిన కొత్త "టీవీఎస్ జూపిటర్ జెడ్‌ఎక్స్" వేరియంట్‌ను కంపెనీ విడుదల చేసింది.

టీవీఎస్ జూపిటర్ డిస్క్ బ్రేక్ వేరియంట్ విడుదల: ధర, ఫీచర్లు

గతంలో లభించినట్లుగా టీవీఎస్ జూపిటర్ ఇప్పుడు ఫ్రంట్ డిస్క్ బ్రేక్ కలిగి ఉంటుంది. టీవీఎస్ జూపిటర్ జెడ్‌ఎక్స్ వేరియంట్ డిస్క్ బ్రేక్‌తో పాటుగా ‘ఐ-టచ్‌స్టార్ట్' టెక్నాలజీతో లభిస్తుంది. ఇది ‘వన్-టచ్ సింగిల్-స్టార్ట్' సిస్టమ్‌ను కలిగి ఉండి, ఇంజన్‌ను స్టార్ట్ చేసినప్పుడు ఇగ్నిషన్ సమయంలో ఇంజన్ క్రాంకింగ్ సౌండ్ లేకుండా సైలెంట్‌గా స్టార్ట్ అవుతుంది. ఈ టెక్నాలజీ వలన బ్యాటరీ లైఫ్ మెరుగు పడుతుందని కంపెనీ తెలిపింది.

టీవీఎస్ జూపిటర్ డిస్క్ బ్రేక్ వేరియంట్ విడుదల: ధర, ఫీచర్లు

కొత్త టీవీఎస్ జూపిటర్ జెడ్‌ఎక్స్ డిస్క్ బ్రేక్ వేరియంట్‌లోని ఇతర అప్‌డేట్స్‌ను గమనిస్తే, ఇది కొత్త ‘ఆల్ ఇన్ వన్' లాక్ సిస్టమ్‌ను కూడా కలిగి ఉంటుంది. ఈ సిస్టమ్‌లోనే ఇగ్నిషన్, బూట్ లాక్ మరియు ఫ్యూయెల్ క్యాప్ రిలీజ్ వంటి అన్ని ఫంక్షన్లను ఉంటాయి. ఈ మార్పులు మినహా, కొత్త టీవీఎస్ జూపిటర్ జెడ్‌ఎక్స్ వేరియంట్లో వేరే ఏ ఇతర మార్పులు లేవు.

MOST READ: టీవీఎస్ ఐక్యూబ్‌ని ఓవర్‌టేక్ చేసిన బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్

టీవీఎస్ జూపిటర్ డిస్క్ బ్రేక్ వేరియంట్ విడుదల: ధర, ఫీచర్లు

ఇంజన్ విషయానికి వస్తే, కొత్త టీవీఎస్ జూపిటర్‌లోని 110సీసీ ఇంజన్‌ను ఇప్పటికే కొత్త కాలుష్య నిబంధనలకు అనుగుణంగా అప్‌గ్రేడ్ చేశారు. ఇందులోని 109సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజన్ గరిష్టంగా 7000 ఆర్‌పిఎమ్ వద్ద 7.4 బిహెచ్‌పి శక్తిని మరియు 5500 ఆర్‌పిఎమ్ వద్ద 8.4 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

టీవీఎస్ జూపిటర్ డిస్క్ బ్రేక్ వేరియంట్ విడుదల: ధర, ఫీచర్లు

కొత్త టీవీఎస్ జూపిటర్ జెడ్‌ఎక్స్ డిస్క్ బ్రేక్ వేరియంట్‌ను మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అవి - స్టార్‌లైట్ బ్లూ, మ్యాట్ స్టార్‌లైట్ బ్లూ మరియు రాయల్ వైన్. కొత్త జెడ్ ఎక్స్ డిస్క్ వేరియంట్‌ను మిడ్-స్పెక్ జూపిటర్ జెడ్ఎక్స్ డ్రమ్ మరియు టాప్-ఎండ్ జూపిటర్ క్లాసిక్ ఎడిషన్‌కు మధ్యలో ప్రవేశపెట్టారు.

MOST READ: టాప్ కార్ న్యూస్: మార్కెట్లోకి కొత్తగా వచ్చిన కార్లు; ఎస్‌యూవీలదే పైచేయి

టీవీఎస్ జూపిటర్ డిస్క్ బ్రేక్ వేరియంట్ విడుదల: ధర, ఫీచర్లు

టీవీఎస్ జూపిటర్ జెడ్ఎక్స్ వేరియంట్‌లో కొత్తగా చేర్చిన డిస్క్ బ్రేక్‌లు మరియు సైలెంట్-స్టార్ట్ సిస్టమ్‌తో పాటుగా ఇందులో ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్‌లు, ఇరువైపులా 12 అంగుళాల చక్రాలు, టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్కులు మరియు వెనుక భాగంలో మోనో-షాక్ సస్పెన్షన్ సెటప్, పెద్ద 21-లీటర్ల బూట్ సామర్థ్యం మరియు 6-లీటర్ల ఇంధన ట్యాంక్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

డిస్క్ బ్రేక్‌ మరియు సైలెంట్-స్టార్ట్ సిస్టమ్‌తో విడుదలైన కొత్త టీవీఎస్ జూపిటర్ జెడ్‌ఎక్స్ ధర రూ.69,052, ఎక్స్-షోరూమ్, ఢిల్లీగా ఉంది.

టీవీఎస్ జూపిటర్ డిస్క్ బ్రేక్ వేరియంట్ విడుదల: ధర, ఫీచర్లు

టీవీఎస్ జూపిటర్ జెడ్ఎక్స్ డిస్క్ వేరియంట్ విడుదలపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

టీవీఎస్ జూపిటర్ ఇప్పటి వరకూ డ్రమ్ బ్రేక్స్ మాత్రమే లభ్యమయ్యేది, కంపెనీ ఇందులో డిస్క్ బ్రేక్ వేరియంట్‌ను పరిచయం చేయటంవల ఈ మోడల్‌లో మొత్తం వేరియంట్ల సంఖ్య నాలుగుకి చేరింది. ఇది ఈ విభాగంలో హీరో మాస్ట్రో ఎడ్జ్ మరియు హోండా యాక్టివా 6జి వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

Most Read Articles

English summary
TVS Motor Company has launched the Jupiter ZX scooter with disc brakes and an i-TouchStart system. The new TVS Jupiter ZX with the disc brakes and the silent-start system is offered with a price tag of Rs 69,052, ex-showroom (Delhi). Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X