టీవీఎస్ ఎన్‌టార్క్ రేస్ ఎడిషన్ విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

చెన్నైకి చెందిన ప్రముఖ టూవీలర్ బ్రాండ్ టీవీఎస్ మోటార్ కంపెనీ భారత మార్కెట్లో అందిస్తున్న ఎన్‌టార్క్ 125 స్కూటర్‌లో రేస్ ఎడిషన్ పేరిట బ్లాక్ అండ్ యల్లో పెయింట్ స్కీమ్‌తో ఓ కొత్త వేరియంట్‌ను మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ విపణిలో ఈ కొత్త టీవీఎస్ ఎన్‌టార్క్ 125 రేస్ ఎడిషన్ స్కూటర్ ధర రూ.74,365, ఎక్స్-షోరూమ్, ఢిల్లీగా ఉంది.

టీవీఎస్ ఎన్‌టార్క్ రేస్ ఎడిషన్ విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

ఇదివరకు మార్కెట్లో టీవీఎస్ ఎన్‌టార్క్ ఒకే ఒక రెడ్ అండ్ బ్లాక్ కలర్ ఆప్షన్‌తో లభించేంది. కాగా, ఇందులో కొత్త వేరియంట్ విడుదలతో ఇందులో ఇప్పుడు రెండు కలర్ ఆప్షన్లు అందుబాటులోకి వచ్చాయి. దేశవ్యాప్తంగా ఉన్న టీవీఎస్ డీలర్‌షిప్ కేంద్రాలలో ఈ స్పెషల్ ఎడిషన్ స్కూటర్‌ను కస్టమర్లు బుక్ చేసుకోవచ్చు.

టీవీఎస్ ఎన్‌టార్క్ రేస్ ఎడిషన్ విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

ఆసక్తికరమైన విషయం ఏంటంటే, కొత్తగా విడుదలైన టీవీఎస్ ఎన్‌టార్క్ 125 బ్లాక్ అండ్ యల్లో స్కూటర్ ధర మరియు ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న బ్లాక్ అండ్ రెడ్ ఎన్‌టార్క్ 125 స్కూటర్ ధర రెండూ ఒకేలా ఉన్నాయి. ఈ రెండు వేరియంట్లలో కలర్ ఆప్షన్స్, బాడీ గ్రాఫిక్స్ మినహా వేరే ఏ ఇతర మార్పులు లేవు. త్వరలోనే ఈ కొత్త వేరియంట్ డెలివరీలు ప్రారంభం కానున్నాయి.

MOST READ:కార్ దొంగతనాలను నివారించడానికి కొత్త ఐడియా, ఏంటో తెలుసా !

టీవీఎస్ ఎన్‌టార్క్ రేస్ ఎడిషన్ విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

టీవీఎస్ ఎన్‌టార్క్ 125 రేస్ ఎడిషన్ స్కూటర్‌ను స్టాండర్డ్ ఎన్‌టార్క్ 125 మోడల్‌పై ఆధారపడి తయారు చేశారు. ఇందులో కేవలం కాస్మోటిక్ అప్‌గ్రేడ్‌లు మినహా ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు లేవు. ఈ స్కూటర్‌లోని పలుచోట్ల చెకర్డ్ ఫ్లాగ్ డిజైన్ ఉంటుంది, ఇది స్కూటర్‌కు మరింత స్పోర్టీ లుక్‌నిస్తుంది.

టీవీఎస్ ఎన్‌టార్క్ రేస్ ఎడిషన్ విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

ఆకర్షనీయమైన బాడీ గ్రాఫిక్స్‌తో తయారు చేసిన ఈ స్పెషల్ ఎడిషన్ స్కూటర్‌లోని కొన్ని ఇతర మార్పులను గమనిస్తే, బ్రాండ్ యొక్క ‘రేస్ ఎడిషన్' చిహ్నం, ‘టీవీఎస్ రేసింగ్' డెకాల్స్‌తో ఇది టీవీఎస్ రేసింగ్ ఫ్యామిలీని తలపిస్తుంది. కొత్త ‘రేస్ ఎడిషన్' స్కూటర్‌లో పూర్తిగా కొత్త ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్, ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌ లైట్లను జోడించారు.

MOST READ:మీకు తెలుసా.. భారత్‌బెంజ్ ఎక్స్ఛేంజ్ స్కీమ్ స్టార్ట్ చేసింది

టీవీఎస్ ఎన్‌టార్క్ రేస్ ఎడిషన్ విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

ఇందులో ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు లేవు. ఇందులోని 124 సిసి ఎయిర్-కూల్డ్, సింగిల్ సిలిండర్, ఫ్యూయెల్-ఇంజెక్టెడ్ ఇంజన్ 7000 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 9.1 బిహెచ్‌పి శక్తిని మరియు 5500 ఆర్‌పిఎమ్ వద్ద 10.5 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

టీవీఎస్ ఎన్‌టార్క్ రేస్ ఎడిషన్ విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

ఇందులో పూర్తి-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌ ఉంటుంది, ఇది స్మార్ట్‌ఫోన్‍‌తో జత చేయడానికి వీలుగా టీవీఎస్ బ్రాండ్ స్మార్ట్‌కనెక్ట్‌ను సపోర్ట్ చేస్తుంది. బయటి వైపు అమర్చిన ఫ్యూయెల్ ఫిల్లింగ్ క్యాప్, 12-ఇంచ్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, ఇంజన్ కిల్ స్విచ్, యూఎస్‌బి చార్జర్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఈ స్కూటర్‌లో ఆకట్టుకునే మరో ప్రధాన అంశం, దీని ఎగ్జాస్ట్ నోట్, ఇది మరింత స్పోర్టీ రైడ్ అనుభవాన్ని ఇస్తుంది.

MOST READ:ప్రయాణికులు వణికిపోయేలా చేసే ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన విమానాశ్రయాలు, ఇవే

టీవీఎస్ ఎన్‌టార్క్ రేస్ ఎడిషన్ విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

ఈ స్కూటర్ ముందు భాగంలో టెలిస్కోపిక్ సస్పెన్షన్ మరియు వెనుక భాగంలో కాయిల్-ఓవర్ స్ప్రింగ్స్ సస్పెన్షన్ సెటప్ ఉంటుంది. ఇక బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందు భాగంలో 230 మిమీ పెటల్ డిస్క్ బ్రేక్ మరియు వెనుకవైపు 130 మిమీ డ్రమ్ బ్రేక్ ఉంటాయి. ఇవి రెండూ బ్రాండ్ యొక్క సింక్రొనైజ్డ్ బ్రేకింగ్ టెక్నాలజీ (ఎస్‌బిటి)ని సపోర్ట్ చేస్తాయి.

టీవీఎస్ ఎన్‌టార్క్ రేస్ ఎడిషన్ విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

టీవీఎస్ ఎన్‌టార్క్ 125 రేస్ ఎడిషన్ విడుదలపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

టీవీఎస్ ఎన్‌టార్క్ 125 రేస్ ఎడిషన్ బ్లాక్ అండ్ యల్లో కలర్‌తో మరింత స్పోర్టీగా కనిపిస్తోంది. భారత మార్కెట్లో ఈ స్కూటర్‌ను ప్రత్యేకించి యువ తరం కొనుగోలుదారులను లక్ష్యంగా చేసుకొని ప్రవేశపెట్టారు. కొత్త రేస్ ఎడిషన్‌లో స్టైలిష్ బాడీ గ్రాఫిక్స్ మరియు అగ్రెసివ్‌గా కనిపించే ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్స్ డిజైన్ బ్లూటూత్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో ఈ స్కూటర్ ఫీచర్ ప్యాక్డ్‌గా అనిపిస్తుంది.

MOST READ:భారతదేశపు ఆటో పరిశ్రమలో ప్రసిద్ధి చెందిన 5 ఐకానిక్ కార్లు, ఇవే

Most Read Articles

English summary
TVS Motor Company launched a new paint scheme of the Ntorq 125 Race edition scooter in the Indian market. The newly introduced yellow and black dual-tone paint scheme is priced at Rs 74,365 ex-showroom (Delhi). Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X