2021 డాకర్ ర్యాలీ నుండి తప్పుకున్న టీవీఎస్; కరోనానే కారణమా ?

ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన మరియు సాహసోపేతమైన ర్యాలీల్లో ఒకటైన డాకార్ ర్యాలీ 2021 సీజన్ నుండి చెన్నైకి చెందిన టీవీఎస్ మోటార్ కంపెనీ తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. జనవరి 3, 2021వ తేదీ నుండి ప్రారంభం కానున్న 2021 డాకర్ ర్యాలీలో తమ జట్టు పాల్గొనడం లేదని టీవీఎస్ రేసింగ్ విభాగం పేర్కొంది.

2021 డాకర్ ర్యాలీ నుండి తప్పుకున్న టీవీఎస్; కరోనానే కారణమా ?

ఈ ఏడాది ర్యాలీలో తాము ఫ్యాక్టరీ బృందంగా పాల్గొనబోమని ధృవీకరిస్తూ టీవీఎస్ మోటార్ కంపెనీ మోటర్‌స్పోర్ట్ విభాగం ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది. అయితే, ఈ కార్యక్రమంలో ప్రైవేటుగా పాల్గొనుకునే వారి కోసం తమ రైడర్ హరిత్ నోహ్‌ను స్పాన్సర్ చేస్తామని కంపెనీ ధృవీకరించింది.

2021 డాకర్ ర్యాలీ నుండి తప్పుకున్న టీవీఎస్; కరోనానే కారణమా ?

హరిత్ నోహ్‌తో పాటుగా షెర్కో ర్యాలీ ఫ్యాక్టరీ టీమ్ రైడర్స్ లోరెంజో సాంటోలిని మరియు రూయి గోన్‌కల్వ్స్ షెర్కో‌లు టీవీఎస్ ఆర్టీఆర్ 450 ర్యాలీ మోటార్‌సైకిల్‌ను నడపడం కొనసాగిస్తారు. అయితే, ఈ కార్యక్రమంలో టీవీఎస్ రేసింగ్ ఎటువంటి సాంకేతిక సహాయాన్ని మాత్రం అందించబోదు.

MOST READ:ఈ రోడ్డుపై ప్రయాణించడానికి ధైర్యం కావాలి.. ఈ వీడియో చూడటానికి గుండె ధైర్యం కావాలి

2021 డాకర్ ర్యాలీ నుండి తప్పుకున్న టీవీఎస్; కరోనానే కారణమా ?

టీవీఎస్ మోటార్ కంపెనీకి చెందిన రేసింగ్ విభాగం డాకర్ ర్యాలీ 2021 సీజన్ నుండి తప్పుకోవడానికి గల కారణాన్ని మాత్రం వెల్లడించలేదు. అయితే, ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతున్న కరోనా మహమ్మారి పరిస్థితులే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది.

2021 డాకర్ ర్యాలీ నుండి తప్పుకున్న టీవీఎస్; కరోనానే కారణమా ?

డాకర్ ర్యాలీలో పాల్గొన్న మొట్టమొదటి భారతీయ ఫ్యాక్టరీ టీఎమ్ టీవీఎస్ రేసింగ్ కావటం విశేషం. టీవీఎస్ రేసింగ్ ఫ్యాక్టరీ టీమ్ గడచిన ఆరు సీజన్ల నుండి డాకర్ ర్యాలీలో పాల్గొంటూ వస్తోంది. గత 2015 నుండి 2020 మధ్య కాలంలో ప్రతి సంవత్సరం ఈ జట్టు ఇందులో పాల్గొంది. డాకర్ ర్యాలీ 2021లో కూడా టీవీఎస్ పాల్గొని ఉంటే, ఇది ఆ జట్టుకు ఏడవ సీజన్ అయ్యేది.

MOST READ:అటల్ టన్నెల్‌లో కొత్త రికార్డ్ ; ఏంటో అది అనుకుంటున్నారా.. ఇది చూడండి

2021 డాకర్ ర్యాలీ నుండి తప్పుకున్న టీవీఎస్; కరోనానే కారణమా ?

టీవీఎస్ డాకర్ ర్యాలీలోని ఆరు సీజన్లను షెర్కోతో నిర్వహించింది. ఈ నేపథ్యంలో, టీవీఎస్ నుండి షెర్కో నిష్క్రమించడంపై ఇప్పుడు అనేక సందేహాలు నెలకొన్నాయి. టీవీఎస్ ఇందుకు సంబంధించి ఓ ఖచ్చితమైన కారణాన్ని వెల్లడించకపోవడంతో, ఇరు బ్రాండ్ల (షెర్కో మరియు టీవీఎస్) భాగస్వామ్యం అనేక ప్రశ్నలు వస్తున్నాయి.

2021 డాకర్ ర్యాలీ నుండి తప్పుకున్న టీవీఎస్; కరోనానే కారణమా ?

షెర్కో మరియు టీవీఎస్ బ్రాండ్లు డాకర్ ర్యాలీలోని ఆరు సీజన్లలో మాత్రమే కాకుండా, పలు ఇతర అంతర్జాతీయ ఈవెంట్లలో కూడా పాల్గొన్నాయి. ఇందులో ర్యాలీ ఆఫ్ మొరాకో, పాన్‌ఆఫ్రికన్ ర్యాలీ, బాజా అరగోన్ మరియు మెర్జౌగా ర్యాలీ మొదలైనవి ఉన్నాయి.

కాగా. వచ్చే ఏడాది జనవరి నెలలో సౌదీ అరేబియాలోని ఇసుక ఎడారిలో 2021 డాకార్ ర్యాలీని నిర్వహించనున్నారు. జవరి 3, 2021 నుంచి జనవరి 15, 2021 వరకూ ఈ ర్యాలీ జరగనుంది. జోర్డాన్ మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాల మధ్య గుండా ఈ రూట్ మ్యాప్ ఉంటుంది.

MOST READ:ఖరీదైన లగ్జరీ కార్ కొనుగోలు చేసిన బాలీవుడ్ భామ.. ఈ కార్ ధర ఎంతంటే ?

2021 డాకర్ ర్యాలీ నుండి తప్పుకున్న టీవీఎస్; కరోనానే కారణమా ?

ఈ 2021 సీజన్ డాకర్ ర్యాలీ సౌదీ అరేబియాలోని జెడ్డా ప్రాంతంలోని పోర్ట్ సిటీ అయిన రెడ్ సీ వద్ద ప్రారంభమై మొత్తం 12 స్టేజ్‌లను పూర్తి చేసుకొని తిరిగి రెడ్ సీ ప్రాంతం వద్ద ముగుస్తుంది. జనవరి 3న రెడ్ సీ వద్ద ఈ రేస్ మొదలు పెట్టిన వారు అన్ని స్టేజ్‌లను దాటుకుంటూ వచ్చి సుమారు 7500 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన తర్వాత జనవరి 15న రెడ్ సీ ప్రాంతాన్ని చేరుకోవాల్సి ఉంటుంది.

2021 డాకర్ ర్యాలీ నుండి తప్పుకున్న టీవీఎస్; కరోనానే కారణమా ?

అంటే 12 రోజుల పాటు రేస్ చేస్తూ ఎవరైతే ముందుగా అక్కడికి చేరుకుంటారో వారే ఈ ర్యాలీలో విజేతగా నిలుస్తారు. ఈ రూట్ పూర్తిగా ఇసుక దిబ్బలతో నిండిపోయి, మానవ మనుగడ లేని ప్రాంతంలో ఎత్తైన ఇసుక కొండలు, లోతైన దిగుడు ప్రాంతాల గుండా సాగుతుంది. ఈ రేస్ నిర్వహించే ప్రాంతంలో కొన్ని చోట్ల స్పీడ్ జోన్స్ మరికొన్ని చోట్ల స్లో జోన్స్ ఉంటాయి.

MOST READ:ఇకపై ఈ రైళ్లకు డ్రైవర్ అవసరం లేదు.. ఇదెక్కడో కాదు మనదేశంలోనే..

Most Read Articles

English summary
TVS Racing, the factory racing team of TVS Motor Company, will not be participating in Dakar Rally 2021. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X