ఫియరో 125 పేరును రిజిస్టర్ చేసిన టీవీఎస్, మార్కెట్లోకి రానున్న సరికొత్త మోడల్

ప్రముఖ దేశీయ టూవీలర్ కంపెనీ టీవీఎస్, 125సీసీ ఓ సరికొత్త మోటార్‌సైకిల్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇటీవలి కాలంలో టీవీఎస్ మోటార్ కంపెనీ 125సిసి విభాగంలో ఎలాంటి మోటార్‌సైకిల్‌ను విడుదల చేయలేదు. ఈ నేపథ్యంలో, కంపెనీ 'ఫియరో 125' పేరిట ఓ కొత్త మోడల్‌ను తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తోంది.

ఫియరో 125 పేరును రిజిస్టర్ చేసిన టీవీఎస్, మార్కెట్లోకి రానున్న సరికొత్త మోడల్

ఈ మేరకు టీవీఎస్ ఇప్పటికే ఫియరో 125 పేరును పేటెంట్ కోసం ధరఖాస్తు చేసుకుంది. నిజానికి ఫియరో పేరు కొత్తదేమీ కాదు, 1990 దశకంలో ఫియరో పేరుతో కంపెనీ మోటార్‌సైకిళ్లను విక్రయించిన సంగతి తెలిసినదే. అదే పేరును ఫియరో 125 గా తమ సరికొత్త మోడల్ కోసం కంపెనీ రిజిస్టర్ చేసుకుంది.

ఫియరో 125 పేరును రిజిస్టర్ చేసిన టీవీఎస్, మార్కెట్లోకి రానున్న సరికొత్త మోడల్

టీవీఎస్ ఫియెరో 90వ దశకంలో చాలా పాపులర్ అయిన 150సిసి బైక్. అప్పట్లో ఇది పవర్, పెర్ఫార్మెన్స్ మరియు మైలేజీకి ప్రసిద్ది చెందింది. తాజాగా, ఇప్పుడు టీవీఎస్ తమ పాత మోడల్ పేరును ఉపయోగించి కొత్త 125సీసీ మోడల్‌ను తీసుకురావాలని చూస్తోంది. ఇది ఈ విభాగంలో పల్సర్ 125 వంటి మోడళ్లకు పోటీగా నిలిచే ఆస్కారం ఉంది.

MOST READ:భారత మార్కెట్లో టాటా హారియర్ క్యామో ఎడిషన్ లాంచ్ : ధర & ఇతర వివరాలు

ఫియరో 125 పేరును రిజిస్టర్ చేసిన టీవీఎస్, మార్కెట్లోకి రానున్న సరికొత్త మోడల్

టీవీఎస్ ఫియరో 125 మోడల్‌ను కంపెనీ కమ్యూటర్ సెగ్మెంట్లో విడుదల చేసే అవకాశం ఉంది. ఈ కొత్త బైక్‌లో పాత ఫియరో డిజైన్ ఎలిమెంట్స్ కూడా కనిపించే అవకాశం ఉంది. ఇది కమ్యూటర్ మోటార్‌సైకిలే అయినప్పటికీ, స్టైల్, డిజైన్, పెర్ఫార్మెన్స్ మరియు మైలేజ్ వంటి అంశాలపై కంపెనీ ప్రత్యేక దృష్టి పెట్టనుంది.

ఫియరో 125 పేరును రిజిస్టర్ చేసిన టీవీఎస్, మార్కెట్లోకి రానున్న సరికొత్త మోడల్

టీవీఎస్ ఫియెరో 125 భారత మార్కెట్లో విడుదలైన తర్వాత, ఇది ఈ విభాగంలో ఇప్పటికే ప్రాచుర్యం పొందిన హోండా ఎస్‌పి 125, హీరో గ్లామర్ 125 మరియు బజాజ్ పల్సర్ 125 వంటి మోడళ్లకు పోటీగా నిలిచే ఆస్కారం ఉంది.

MOST READ:మళ్ళీ పుంజుకున్న జావా పెరాక్ బైక్ అమ్మకాలు.. కారణం ఏంటో తెలుసా ?

ఫియరో 125 పేరును రిజిస్టర్ చేసిన టీవీఎస్, మార్కెట్లోకి రానున్న సరికొత్త మోడల్

టీవీఎస్ మోటార్ కంపెనీకి సంబంధించిన ఇటీవలి వార్తలను గమనిస్తే, కంపెనీ తమ పాపులర్ అపాచీ ఆర్‌టిఆర్ 200 4వి మోడల్ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం భారత మార్కెట్లో టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 200 4వి రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో సింగిల్ ఛానెల్ ఏబిఎస్ మరియు డ్యూయల్ ఛానెల్ ఏబిఎస్ వేరియంట్లు ఉన్నాయి.

ఫియరో 125 పేరును రిజిస్టర్ చేసిన టీవీఎస్, మార్కెట్లోకి రానున్న సరికొత్త మోడల్

ఈ రెండు వేరియంట్ల ధరలు పెరిగాయి. టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 200 4వి రెండు వేరియంట్ల ధరలు రూ.1,500 మేర పెరిగాయి. తాజా ధరల పెరుగుదల తర్వాత, టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 200 4వి సింగిల్ ఛానెల్ మరియు డ్యూయల్ ఛానెల్ ఏబిఎస్ వేరియంట్ల ధరలు వరుసగా రూ.1.25 లక్షలు మరియు రూ.1.30 లక్షలుగా ఉన్నాయి (ఎక్స్-షోరూమ్, ఇండియా).

MOST READ:కొత్త బైక్‌ను వెంబడించిన ట్రక్ డ్రైవర్.. తర్వాత ఏం జరిగిందో చూడండి

ఫియరో 125 పేరును రిజిస్టర్ చేసిన టీవీఎస్, మార్కెట్లోకి రానున్న సరికొత్త మోడల్

టీవీఎస్ ఫియరో 125 మోటార్‌సైకిల్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

ప్రస్తుతానికి టీవీఎస్ ఫియరో 125 మోటారుసైకిల్‌కు సంబంధించి పూర్తి సమాచారం అందుబాటులో లేదు. కానీ ఈ కొత్త మోడల్ మాత్రం గత చరిత్రను గుర్తు చేసేలా అంతే స్పోర్టీగా, ఫుల్లీ లోడెడ్ ఫీచర్లతో అందుబాటులోకి వస్తుందని అంచనా. వచ్చే ఏడాది ఇది ఎప్పుడైనా భారత మార్కెట్లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

Most Read Articles

English summary
TVS Registers Fiero 125 Name; Might Be A New Motorcycle. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X