టీవీఎస్ జెస్ట్ 110 బిఎస్6 స్కూటర్ విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

చెన్నైకి చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ తమ కొత్త బిఎస్6 కంప్లైంట్ 'జెస్ట్ 110' స్కూటర్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ విపణిలో ఈ కొత్త టీవీఎస్ జెస్ట్ 110 బిఎస్6 స్కూటర్ ధర రూ.58,640 (ఎక్స్-షోరూమ)గా ఉంది.

టీవీఎస్ జెస్ట్ 110 బిఎస్6 స్కూటర్ విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

టీవీఎస్ జెస్ట్ 110 బిఎస్6 స్కూటర్ హిమాలయన్ హై సిరీస్ మరియు మ్యాట్ సిరీస్ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఈ రెండు వేరియంట్లలో ఒకే రకమైన 109సిసి సింగిల్ సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ బిఎస్6 ఇంజన్ గరిష్టంగా 7.7 బిహెచ్‌పి శక్తిని మరియు 8.8 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

టీవీఎస్ జెస్ట్ 110 బిఎస్6 స్కూటర్ విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

ఈ కొత్త ఇంజన్‌ను దాని మునపటి బిఎస్4 ఇంజన్‌తో పోలిస్తే, ఇందులో పవర్ ఇదివరకటి మాదిరిగానే 7.7 బిహెచ్‌పి ఉన్నప్పటికీ టార్క్ మాత్రం 0.4 ఎన్ఎమ్ పెరిగి 8.8 ఎన్ఎమ్‌గా ఉంటుంది (బిఎస్4 వెర్షన్‌లో 8.4 ఎన్ఎమ్ టార్క్ ఉండేది).

MOST READ:బటర్ చికెన్ పై ప్రేమ 1.25 లక్షల జరిమానా కట్టేలా చేసింది, ఎలానో మీరే చూడండి

టీవీఎస్ జెస్ట్ 110 బిఎస్6 స్కూటర్ విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

టీవీఎస్ జెస్ట్ 110 స్కూటర్‌లోని కొత్త బిఎస్6 ఇంజన్ ఇప్పుడు బ్రాండ్ యొక్క ఎకో థ్రస్ట్ ఫ్యూయల్-ఇంజెక్షన్ సిస్టమ్‌తో లభిస్తుంది. మెరుగైన పనితీరును అందించేలా దీనిని మరింత రీఫైన్ చేశారు. ఇప్పుడు ఈ ఇంజన్ మరింత సమర్థవంతంగా ఉంటూనే మెరుగైన మైలేజీని కూడా ఆఫర్ చేస్తుందని కంపెనీ తెలిపింది.

టీవీఎస్ జెస్ట్ 110 బిఎస్6 స్కూటర్ విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

డిజైన్ పరంగా చూస్తే, కొత్త టీవీఎస్ జెస్ట్ 110 బిఎస్6 స్కూటర్ ఇదివరకటి డిజైన్ స్టైలింగ్‌నే కలిగి ఉంటుంది. బిఎస్4 వెర్షన్ మాదిరిగానే అదే రకమైన బ్రేక్‌లు, సస్పెన్షన్ మరియు ఫ్రేమ్‌లను కలిగి ఉంటుంది.

MOST READ:ఈ ట్రక్కు 1700 కి.మీ ప్రయాణించడానికి సంవత్సర కాలం పట్టింది ; ఎందుకో తెలుసా

టీవీఎస్ జెస్ట్ 110 బిఎస్6 స్కూటర్ విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

సస్పెన్షన్ మరియు బ్రేక్‌ల విషయానికి వస్తే, ఈ స్కూటర్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక భాగంలో మోనో-షాక్ సస్పెన్షన్ సెటప్‌ను ఉపయోగించారు. ఇకపోతే, ఇందులో ముందు వైపు 110 మిమీ, వెనుక వైపు 130 మిమీ డ్రమ్ బ్రేక్స్ ఉంటాయి.

టీవీఎస్ జెస్ట్ 110 బిఎస్6 స్కూటర్ విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

టీవీఎస్ జెస్ట్ 110 బిఎస్6 స్కూటర్లో అనేక ఫీచర్లు లభిస్తాయి, అందులో కొన్నింటిని గమనిస్తే, 19 లీటర్ల సెగ్మెంట్ ఫస్ట్ బూట్ స్పేస్, ఎల్ఈడి హెడ్‌ల్యాంప్స్, ఎల్ఈడి డిఆర్ఎల్‌లు, ఎల్ఈడి టెయిల్ లైట్స్, ట్యూబ్ లెస్ టైర్లు వంటివి కొన్నిగా చెప్పుకోవచ్చు.

MOST READ:ఇప్పుడే చూడండి.. వెహికల్ నెంబర్ ప్లేట్స్ పై క్లారిటీ ఇచ్చిన సెంట్రల్ గవర్నమెంట్

టీవీఎస్ జెస్ట్ 110 బిఎస్6 స్కూటర్ విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

టీవీఎస్ జెస్ట్ 110 బిఎస్ 6 స్కూటర్ రెడ్, బ్లూ, టార్కాయిస్ బ్లూ, యల్లో, బ్లాక్ అనే ఐదు ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. టీవీఎస్ బ్రాండ్ భారత మార్కెట్లో విక్రయిస్తున్న ఎంట్రీ లెవల్ స్కూటర్ ఆఫర్లలో జెస్ట్ 110 స్కూటర్ ఒకటి. టీవీఎస్ నుండి బిఎస్6 అప్‌డేట్ పొందిన చివరి ఉత్పత్తి కూడా ఇదే.

టీవీఎస్ జెస్ట్ 110 బిఎస్6 స్కూటర్ విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

టీవీఎస్ జెస్ట్ 110 బిఎస్6 స్కూటర్ విడుదలపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

టీవీఎస్ జెస్ట్ 110 స్కూటర్ దేశీయ విపణిలో చాలా కాలంగా అమ్మకానికి ఉంది. ఇది ఈ విభాగంలో హీరో ప్లెజర్ ప్లస్ వంటి ఇతర ఎంట్రీ లెవల్ స్కూటర్లకు పోటీగా ఉంటుంది.

MOST READ:బైక్ కింద నుంచి 20 బాటిల్స్ మద్యం స్వాధీనం, వీడియో చూస్తే మీరు కచ్చితంగా షాక్ అవుతారు

Most Read Articles

English summary
TVS Motor Company has launched the BS6-compliant Zest 110 scooter in the Indian market. The new TVS Zest 110 BS6 scooter is offered with a starting price of Rs 58,640, ex-showroom (Chennai). Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X