జూన్ నాటికి వెస్పా ఎలెట్రికా స్కూటర్.. బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ టార్గెట్!

ఇటలీకి చెందిన దిగ్గజం టూ వీలర్ల తయారీ సంస్థ వెస్పా ఇండియన్ మార్కెట్లో రెండు కొత్త మోడళ్లను లాంచ్ చేయడానికి సన్నద్దమవుతోంది. వెస్పా ఎలెట్రికా మరియు అప్రిలియా ఆర్ఎస్660 మోడళ్లను 2020 జూన్ నాటికల్లా దేశీయ విపణిలో విడుదల చేయాలని భావిస్తోంది. ఈ రెండు మోడళ్లను కూడా ఇటలీలోని కంపెనీ ఫ్యాక్టరీ నుండి పూర్తి స్థాయిలో దిగుమతి చేసుకుని దేశీయంగా విక్రయించనున్నారు.

జూన్ నాటికి వెస్పా ఎలెట్రికా స్కూటర్.. బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ టార్గెట్!

భారతదేశపు తొలి అప్రిలియా ఆర్ఎస్‌వి4 1100 మోటార్ సైకిల్‌ను ఇండియాలో డెలివరీ ఇస్తున్న సందర్భంలో మాట్లాడిన వెస్పా ప్రతినిధులు, మరో రెండు నెలల్లో రెండు సరికొత్త మోడళ్లను కంప్లిట్లీ బిల్ట్ యూనిట్ (CBU) ద్వారా దిగుమతి చేసుకొని, విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు.

జూన్ నాటికి వెస్పా ఎలెట్రికా స్కూటర్.. బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ టార్గెట్!

ఢిల్లీలో జరిగిన 2020 ఇండియన్ ఆటో ఎక్స్‌పోలో వెస్పా ఎలెట్రికా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మొదటి సారిగా ఆవిష్కరించారు. పాత స్కూటర్లను పోలి ఉండే రెట్రో డిజైన్ ఫీచర్‌లో ఎలెట్రికా స్కూటర్‌ను రూపొందించారు. వంపులు తిరిగిన బాడీ, గుండ్రటి ఆకారంలో ఉన్న హెడ్ ల్యాంప్ మరియు ఇంజన్ స్థానంలో పక్కవైపుల ఎలక్ట్రిక్ మోటార్ అందించారు.

జూన్ నాటికి వెస్పా ఎలెట్రికా స్కూటర్.. బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ టార్గెట్!

ఫ్రంట్ డిజైన్‌లో స్కూటర్ ఏప్రాన్ మీద టర్న్-ఇండికేటర్లు, వెనుక వైపున ఎల్ఈడీ టెయిల్ లైట్లు, వాటికి ఇరువైపులా స్టైలిష్ టర్న్ ఇండికేటర్లు, ఇతర స్కూటర్ల మాదిరిగా ఫ్లాట్ ఫుట్ బోర్డు కాకుండా టన్నెల్ లాంటి దిమ్మె ఆకారం మధ్యలో వచ్చింది. పాత కాలం స్కూటర్లలో ఇలాంటి డిజైన్ వచ్చేది.

జూన్ నాటికి వెస్పా ఎలెట్రికా స్కూటర్.. బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ టార్గెట్!

వెస్పా ఎలెట్రికా ఎలక్ట్రిక్ స్కూటర్‌లో సాంకేతికంగా 4KW గరిష్ట సామర్థ్యం గల బ్రష్‌‌లెస్ డీసీ ఎలక్ట్రిక్ మోటార్ వచ్చింది. 4.2kWh సామర్థ్యం గల లిథియం-అయాన్ బ్యాటరీ అనుసంధానం గల ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 200ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 3.5 నుండి 4 గంటల వ్యవధిలో బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ అవుతుంది.

జూన్ నాటికి వెస్పా ఎలెట్రికా స్కూటర్.. బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ టార్గెట్!

ఒక్కసారి ఛార్జింగ్‌తో వెస్పా ఎలెట్రికా స్కూటర్ గరిష్టంగా 100కిమీల మైలేజ్‌నిస్తుంది. ఇందులో ఇకో మరియు పవర్ అనే రెండు రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. ఇది ఇండియన్ మార్కెట్లోకి పూర్తి స్థాయిలో విడుదలైతే ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ కూడా వచ్చే అవకాశం ఉంది.

జూన్ నాటికి వెస్పా ఎలెట్రికా స్కూటర్.. బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ టార్గెట్!

వెస్పా ఎలెట్రికా స్కూటర్‌లో ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ కోసం టీఎఫ్‌టీ స్క్రీన్ కూడా వచ్చింది. బ్లూటూత్ ద్వారా దీనిని స్మార్ట్‌ఫోన్‌తో కనెక్ట్ చేసుకోవచ్చు. ఫోన్ కాల్స్ రిసీవ్, టెక్ట్స్ మెసేజ్ డిస్ల్పే, టర్న్ బై టర్న్ న్యావిగేషన్ ఇలా రైడర్‌కు కావాల్సిన ఎన్నో వివరాలను ఇంస్ట్రుమెంట్ డిస్ల్పేలో చూడవచ్చు.

జూన్ నాటికి వెస్పా ఎలెట్రికా స్కూటర్.. బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ టార్గెట్!

వెస్పా ఎలెట్రికా స్కూటర్‌లో ముందువైపున 200మిమీ డిస్క్ బ్రేక్, వెనుక వైపున 140మిమీ డ్రమ్ బ్రేక్ వచ్చింది. రైడింగ్ రేంజ్ పెంచేందుకు ఇందులో రీజనరేటివ్ బ్రేకింగ్ టెక్నాలజీ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇరువైపులా 12-ఇంచుల మరియు 11-ఇంచుల మల్టీ-స్పోక్ అల్లాయ్ వీల్స్‌తో పాటు ట్యూబ్ లెస్ టైర్లు అందించారు.

జూన్ నాటికి వెస్పా ఎలెట్రికా స్కూటర్.. బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ టార్గెట్!

వెస్పా ఎలెట్రికా ఎలక్ట్రిక్ స్కూటర్ పూర్తి స్థాయిలో విడుదలైతే, మార్కెట్లో ఉన్న ఏథర్ 450ఎక్స్, బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ మరియు టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్లకు గట్టి పోటీనివ్వనుంది. దీనిని దిగుమతి చేసుకుని విక్రయిస్తుండటంతో మిగతా మోడళ్లతో పోలిస్తే ధర కాస్త ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

జూన్ నాటికి వెస్పా ఎలెట్రికా స్కూటర్.. బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ టార్గెట్!

ఎలక్ట్రిక్ స్కూటర్‌తో పాటు ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు, వెస్పా సంస్థ అప్రిలియా ఆర్ఎస్660 స్పోర్ట్ బైకును కూడా ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఇంటర్నేషనల్ మార్కెట్లో ఈ మోడల్‌కు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.

జూన్ నాటికి వెస్పా ఎలెట్రికా స్కూటర్.. బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ టార్గెట్!

అప్రిలియా ఆర్ఎస్660 మోటార్ సైకిల్‌ను ఐక్మా 2019 మోటార్ సైకిల్‌ షోలో తొలిసారిగా ఆవిష్కరించారు. ఇందులో 100బిహెచ్‌పి పవర్ ప్రొడ్యూస్ చేసే 660సీసీ కెపాసిటీ గల ట్విన్ ప్యార్లల్ పెట్రోల్ ఇంజన్ కలదు.

జూన్ నాటికి వెస్పా ఎలెట్రికా స్కూటర్.. బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ టార్గెట్!

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

భారత ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన దిగుమతి నియమాలను వెస్పా మరియు అప్రిలియా వంటి బ్రాండ్లు చక్కగా ఉపయోగించుకుంటున్నాయి. వెస్పా ఇండియన్ మార్కెట్లో మంచి ఫాలోయింగ్ ఉన్న ఫేమస్ స్కూటర్ బ్రాండ్. అయితే, మార్కెట్లో ఉన్న విపరీతమైన పోటీని ఎలా ఎదుర్కుంటుందో చూడాలి మరి!

Most Read Articles

Read more on: #వెస్పా #vespa
English summary
Vespa Elettrica To Arrive In India By June As CBU: Will Rival The Bajaj Chetak Electric. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X