టాప్ బైక్ న్యూస్ - డ్యూక్ 250 లాంచ్, తగ్గిన హెచ్‌డి స్ట్రీట్ 750 ధర, మరిన్ని వార్తలు

దేశంలో కోవిడ్-19 వ్యాప్తి తర్వాత ప్రజలు ఇప్పుడు వ్యక్తిగత రవాణాకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రజా రవాణా వ్యవస్థలో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుందనే భయంతో, ప్రజలు ద్విచక్ర వాహనాల కొనుగోలుపై ఆసక్తి కనబరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో, దేశంలో ద్విచక్ర వాహనాల అమ్మకాలు జోరందుకున్నాయి.

టాప్ బైక్ న్యూస్ - డ్యూక్ 250 లాంచ్, తగ్గిన హెచ్‌డి స్ట్రీట్ 750 ధర, మరిన్ని వార్తలు

గడచిన వారంలో ద్విచక్ర వాహన తయారీదారులు కొత్త మోడళ్లను ప్రవేశపెట్టారు. కొందరు డిస్కౌంట్లు ప్రకటించారు, మరికొందరు తమ కొత్త మోడళ్ల డెలివరీలను ప్రారంభించారు. తాజాగా ఎలక్ట్రిక్ వాహనాలు కూడా మార్కెట్లో విడుదలయ్యాయి. గత వారంలో భారత ద్విచక్ర వాహన విభాగంలోని కొన్ని ముఖ్యాంశాలను తెలుసుకుందాం రండి:

టాప్ బైక్ న్యూస్ - డ్యూక్ 250 లాంచ్, తగ్గిన హెచ్‌డి స్ట్రీట్ 750 ధర, మరిన్ని వార్తలు

కెటిఎమ్ డ్యూక్ 250 బిఎస్6 మోటార్‌సైకిల్ విడుదల

ఆస్ట్రియన్ మోటార్‌సైకిల్ కంపెనీ కెటిఎమ్ భారత మార్కెట్లో తమ కొత్త బిఎస్6 వెర్షన్ కెటిఎమ్ డ్యూక్ 250 మోటార్‌సైకిల్‌ను విడుదల చేసింది. ఈ కొత్త మోటార్‌సైకిల్ మునుపటి మోడల్ కంటే కొన్ని ముఖ్యమైన అప్‌డేట్స్‌ను పొందింది. దేశీయ విపణిలో కొత్త 2020 కెటిఎమ్ డ్యూక్ 250 ధర రూ.2.09 లక్షలు ఎక్స్‌షోరూమ్, ఢిల్లీగా ఉంది.

MOST READ:మీకు తెలుసా.. భారత్‌బెంజ్ ఎక్స్ఛేంజ్ స్కీమ్ స్టార్ట్ చేసింది

టాప్ బైక్ న్యూస్ - డ్యూక్ 250 లాంచ్, తగ్గిన హెచ్‌డి స్ట్రీట్ 750 ధర, మరిన్ని వార్తలు

కొత్త నేక్డ్ స్ట్రీట్ మోటార్‌సైకిల్‌లో డ్యూక్ 390 గ్రహించిన రెండు ముఖ్యమైన ఫీచర్లు ఉన్నాయి. ఇందులో పూర్తి ఎల్‌ఈడి హెడ్‌లైట్ యూనిట్ మరియు వెనుక చక్రంలో ఏబిఎస్ ఫీచర్‌ను ఆఫ్ చేయడానికి ‘సూపర్‌మోటో' మోడ్ ఫీచర్లు ఉన్నాయి. - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

టాప్ బైక్ న్యూస్ - డ్యూక్ 250 లాంచ్, తగ్గిన హెచ్‌డి స్ట్రీట్ 750 ధర, మరిన్ని వార్తలు

టెకో ఎలక్ట్రా సాథి ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల

పూణేకు చెందిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ టెకో ఎలక్ట్రా భారత మార్కెట్లో 'సాథి' అనే ఎలక్ట్రిక్ మోపెడ్‌ను విడుదల చేసింది. ఈ స్కూటర్ సింగిల్ వేరియంట్లో మాత్రమే లభిస్తుంది. పూణేలో దీని ఆన్-రోడ్ ధర రూ.57,697 లుగా ఉంది. లాస్ట్-మైల్ కనెక్టివిటీని లక్ష్యంగా చేసుకుని అభివృద్ధి చేసిన లో రెంజ్ స్కూటర్ ఇది.

ఈ స్కూటర్ వెనుక భాగంలో లగేజ్ ర్యాక్, ముందు భాగంలో లగేజ్ బాస్కెట్ ఉంటుంది. షార్ట్ రేంజ్ రైడ్స్ లేదా ప్రోడక్ట్ డెలివరీ సర్వీస్‌కు ఈ స్కూటర్ అనువుగా ఉంటుంది. సాథి ఎలక్ట్రిక్ స్కూటర్ ఒకే ఛార్జీపై గరిష్టంగా 60 కిలోమీటర్ల రేంజ్‌ని ఆఫర్ చేస్తుంది. ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌లో (బిఎల్‌డిసి) బ్రష్‌లెస్ డిసి హబ్-మౌంటెడ్ మోటారు ఉంటుంది, ఇది 48వి 26 ఆంప్ లిథియం అయాన్ బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 25 కి.మీ. - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

MOST READ:అలర్ట్ : వాహనాలు బయట పార్కింగ్ చేస్తున్నారా.. అయితే ఇది చూడండి

టాప్ బైక్ న్యూస్ - డ్యూక్ 250 లాంచ్, తగ్గిన హెచ్‌డి స్ట్రీట్ 750 ధర, మరిన్ని వార్తలు

జావా, జావా ఫోర్టీటూ మోటార్‌సైకిళ్ల డెలివరీలు ప్రారంభం

జావా మోటార్‌సైకిల్ దేశంలో జావా మరియు జావా ఫోర్టీటూ బిఎస్6 మోటార్‌సైకిళ్లను పంపిణీ చేయడం ప్రారంభించింది. ఈ రెండు మోటార్‌సైకిళ్లలో బిఎస్6 వెర్షన్లను 2020 మార్చిలో విడుదల చేశారు. యాజమాన్యం సౌలభ్యం కోసం జావా ఆకర్షణీయమైన ఫైనాన్స్ పథకాలను కూడా అందిస్తోంది.

టాప్ బైక్ న్యూస్ - డ్యూక్ 250 లాంచ్, తగ్గిన హెచ్‌డి స్ట్రీట్ 750 ధర, మరిన్ని వార్తలు

కొత్త ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా అప్‌డేట్ చేసిన ఇంజన్‌తో పాటు ఈ మోటారుసైకిళ్లలో అనేక మార్పులు చేర్పులు ఉన్నాయి. బిఎస్6 మోటార్‌సైకిళ్ళు భారతదేశపు మొట్టమొదటి క్రాస్ పోర్ట్ టెక్నాలజీని కలిగి ఉన్నాయని జావా పేర్కొంది, ఇది మోటార్‌సైకిల్‌ను మరింత సమర్థవంతంగా చేస్తుంది. - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

MOST READ:ప్రయాణికులు వణికిపోయేలా చేసే ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన విమానాశ్రయాలు, ఇవే

టాప్ బైక్ న్యూస్ - డ్యూక్ 250 లాంచ్, తగ్గిన హెచ్‌డి స్ట్రీట్ 750 ధర, మరిన్ని వార్తలు

విడుదలకు సిద్ధమైన ట్రైయంప్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్

ట్రైయంప్ మోటార్‌సైకిల్స్ తమ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ మోటార్‌సైకిల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఆగస్టు 11, 2020 న ట్రైయంప్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ విడుదల కానుంది, ఇది స్ట్రీట్ ట్రిపుల్ లైనప్‌లో కొత్తగా వస్తున్న ఎంట్రీ లెవల్ వేరియంట్‌గా నిలుస్తుంది.

టాప్ బైక్ న్యూస్ - డ్యూక్ 250 లాంచ్, తగ్గిన హెచ్‌డి స్ట్రీట్ 750 ధర, మరిన్ని వార్తలు

ట్రైయంప్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్ వేరియంట్ మాదిరిగానే స్ట్రీట్ ట్రిపుల్ ఆర్‌లో కూడా అదే 765 సిసి, ఇన్-లైన్ త్రీ-సిలిండర్ ఇంజన్ ఉంటుంది. అయితే, ‘ఆర్‌' వేరియంట్‌లోని ఇంజన్ కొద్దిగా తక్కువ ట్యూన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 116 బిహెచ్‌పి శక్తిని మరియు 77Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

MOST READ:భారతదేశపు ఆటో పరిశ్రమలో ప్రసిద్ధి చెందిన 5 ఐకానిక్ కార్లు, ఇవే

టాప్ బైక్ న్యూస్ - డ్యూక్ 250 లాంచ్, తగ్గిన హెచ్‌డి స్ట్రీట్ 750 ధర, మరిన్ని వార్తలు

భారీగా తగ్గిన హ్యార్లీ డేవిడ్‌సన్ స్ట్రీట్ 750 బైక్ ధర

అమెరికన్ మోటార్‌సైకిల్ బ్రాండ్ హ్యార్లీ డేవిడ్‌సన్ భారత మార్కెట్లో విక్రయిస్తున్న ఎంట్రీ లెవల్ మోటార్‌సైకిల్ స్ట్రీట్ 750 ధరను కంపెనీ భారీగా తగ్గించింది. ఈ క్రూయిజర్ మోటార్‌సైకిల్ ధరను కంపెనీ ఇప్పుడు రూ.65,000 తగ్గించింది.

టాప్ బైక్ న్యూస్ - డ్యూక్ 250 లాంచ్, తగ్గిన హెచ్‌డి స్ట్రీట్ 750 ధర, మరిన్ని వార్తలు

తాజా తగ్గింపు తర్వాత ఇప్పుడు హ్యార్లీ డేవిడ్‌సన్ స్ట్రీట్ 750 అర్బన్ క్రూయిజర్ మోటార్‌సైకిల్ ధర ర .4.69 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. హ్యార్లీ డేవిడ్‌సన్ స్ట్రీట్ 750 బిఎస్6 కంప్లైంట్ మోటార్‌సైకిల్‌లో ఉపయోగించిన 749 సిసి, వి-ట్విన్, లిక్విడ్-కూల్డ్ ఇంజన్ 3,750 ఆర్‌పిఎమ్ వద్ద 60 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది మరియు ఇది సిక్స్-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

టాప్ బైక్ న్యూస్ - డ్యూక్ 250 లాంచ్, తగ్గిన హెచ్‌డి స్ట్రీట్ 750 ధర, మరిన్ని వార్తలు

ఈ వారం టాప్ బైక్ న్యూస్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

సాంప్రదాయ మరియు ఎలక్ట్రిక్ మొబిలిటీ వాహన విభాగంలో ద్విచక్ర వాహనాల విభాగంలతో భారత టూవీలర్ మార్కెట్ కొత్త మోడళ్లను స్వాగతిస్తోంది. వీటితో పాటుగా, ప్రీమియం మోటార్‌సైకిళ్ల విభాగంలో కూడా తయారీదారులు కొత్త మోడళ్లను ప్రవేశపెడుతున్నారు. ఈ పరిణామాలు చూస్తుంటే, రానున్న రోజుల్లో భారత ద్విచక్ర వాహన మార్కెట్‌కు మరిన్ని మంచి రోజులు రానున్నట్లు తెలుస్తోంది.

Most Read Articles

English summary
The two-wheeler manufactures continue to launch new or updated models in the market. The electric two-wheeler market receives a new scooter targeted towards last-mile connectivity, yet again. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X