జావా మోటార్‌సైకిల్స్.. ఇక నేపాల్‌లో కూడా..!

దేశీయ మార్కెట్లో ప్రసిద్ధి చెందిన బైక్ తయారీదారు జావా మోటార్‌సైకిల్ చాలా కాలం తర్వాత 2018 లో భారత మార్కెట్లో తిరిగి ప్రవేశించింది. జావా కంపెనీ దేశీయ మార్కెట్లో మూడు రకాల బైక్‌లను విక్రయిస్తుంది. అవి జావా స్టాండర్డ్, జావా 42 మరియు జావా పెరాక్.

నేపాల్‌లో అడుగుపెట్టనున్న జావా బైక్స్

కొంతకాలం ముందు మహీంద్రా & మహీంద్రా యొక్క అనుబంధ సంస్థ జావా మోటార్ సైకిల్ యూరోపియన్ మార్కెట్లో తన వ్యాపారాన్ని ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం జావా నేపాల్‌లో డీలర్‌షిప్‌ను తెరవడానికి సన్నాహాలు ప్రారంభించింది.

నేపాల్‌లో అడుగుపెట్టనున్న జావా బైక్స్

జావా మోటార్‌సైకిల్ నేపాల్‌లో డీలర్‌షిప్‌లను తెరవడానికి దరఖాస్తులు తీసుకోవడం ప్రారంభించింది. ప్రారంభ దశలో కంపెనీ జావా స్టాండర్డ్ మరియు జావా 42 లను మాత్రమే అందుబాటులోకి తెస్తుంది.

MOST READ:నకిలీ చెక్కుతో 1 కోటి విలువైన లగ్జరీ కారు కొన్న మహిళ ; తర్వాత ఎం జరిగిందంటే

నేపాల్‌లో అడుగుపెట్టనున్న జావా బైక్స్

జావా 42 బైక్ నేపాల్‌లో 6 రంగులలో విక్రయించబడుతుంది. అవి నెబ్యులా బ్లూ, కామెట్ రెడ్, స్ట్రెయిట్ బ్లూ, లుమోస్ లైమ్, హల్లాస్ టీల్ మరియు గెలాక్సీ మాట్. జావా స్టాండర్డ్ బైక్ బ్లాక్, గ్రే మరియు మెరూన్ అనే మూడు రంగులలో విడుదల కానుంది. జావా మోటార్‌సైకిల్ కంపెనీ నేపాల్‌లో జావా పెరాక్ బైక్ అమ్మకంపై ఎటువంటి సమాచారం ఇవ్వలేదు.

నేపాల్‌లో అడుగుపెట్టనున్న జావా బైక్స్

ఈ ఏడాది మేలో జావా మోటార్‌సైకిల్ కంపెనీ తన బైక్‌లను యూరోపియన్ మార్కెట్లో విక్రయించనున్నట్లు తెలిపింది. ఈ బైక్‌లు యూరోపియన్ మార్కెట్లో కొన్ని చిన్న మార్పులను కలిగి ఉంటాయి.

MOST READ:గాడిదలను డీలర్‌షిప్‌కు తీసుకువచ్చిన జావా బైక్ ఓనర్, ఎందుకో తెలుసా ?

నేపాల్‌లో అడుగుపెట్టనున్న జావా బైక్స్

కానీ బైక్‌ల రూపకల్పన మరియు స్టైలింగ్‌లో మార్పులు లేవు. జావా 42 బైక్‌లో 293 సిసి లిక్విడ్ కూల్డ్ డిఓహెచ్‌సి సింగిల్ సిలిండర్ ఇంజన్ తో పనిచేస్తుంది. ఈ ఇంజన్ 27 బిహెచ్‌పి పవర్ మరియు 28 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

నేపాల్‌లో అడుగుపెట్టనున్న జావా బైక్స్

జావా స్టాండర్డ్ బైక్ ధర భారతదేశంలో రూ. 1.73 లక్షలు కాగా, జావా 42 బైక్ ధర భారతదేశంలో రూ. 1.6 లక్షలు. నేపాల్‌లో విక్రయించే జావా బైక్‌ల ధరను జావా కంపెనీ ఇంకా వెల్లడించలేదు.

MOST READ:సైక్లిస్ట్ కల సహకారం చేసుకోవడానికి స్కూల్ విద్యార్థికి సైకిల్ గిఫ్ట్ ఇచ్చిన భారత రాష్ట్రపతి

Most Read Articles

English summary
Jawa motorcycles to start dealerships in Nepal market. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X