Just In
- 3 hrs ago
స్విఫ్ట్, బాలెనో, ఐ20 వంటి మోడళ్లకు వణుకు పుట్టిస్తున్న టాటా ఆల్ట్రోజ్
- 4 hrs ago
దక్షిణ భారత్‌లో కొత్త డీలర్‌షిప్ ఓపెన్ చేసిన బెనెల్లీ; వివరాలు
- 6 hrs ago
భారత్‌లో మరే ఇతర కార్ కంపెనీ సాధించని ఘతను సాధించిన కియా మోటార్స్!
- 6 hrs ago
రిపబ్లిక్ డే పరేడ్‌లో టాటా నెక్సాన్ ఈవీ; ఏం మెసేజ్ ఇచ్చిందంటే..
Don't Miss
- News
నిమ్మకాయ, మిరపకాయల ముగ్గు: చెల్లిని చంపిన తర్వాత తననూ చంపమన్న అలేఖ్య
- Finance
ఆల్ టైమ్ గరిష్టంతో రూ.7300 తక్కువకు బంగారం, ఫెడ్ పాలసీకి ముందు రూ.49,000 దిగువకు
- Sports
ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.. కమిన్స్‌ను మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌ను చేయండి: క్లార్క్
- Movies
మళ్లీ రాజకీయాల్లోకి చిరంజీవి.. పవన్ కల్యాణ్‌కు అండగా మెగాస్టార్.. జనసేన నేత సంచలన ప్రకటన!
- Lifestyle
Study : గాలి కాలుష్యం వల్ల అబార్షన్లు పెరిగే ప్రమాదముందట...! బీకేర్ ఫుల్ లేడీస్...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
త్వరపడండి.. బెనెల్లీ ఇంపీరియల్ మోటార్‌సైకిల్‌పై రూ.12,000 డిస్కౌంట్!
ఇటాలియన్ మోటార్‌సైకిల్ బ్రాండ్ బెనెల్లీ, భారత మార్కెట్లో విక్రయిస్తున్న "ఇంపీరియల్ 400" మోటార్‌సైకిల్ కోసం ఇయర్-ఎండ్ ఆఫర్లను ప్రకటించింది. ఈ డిసెంబర్ 2020 నెలలో ఇంపీరియల్ 400ను కొనుగోలు చేసే కస్టమర్లు రూ.12,000 విలువైన ప్రయోజనాలను పొందవచ్చు.

అంతేకాకుండా, ఈ మోడల్ కొనుగోలు కోసం ఓ ప్రత్యేకమైన మెయింటినెన్స్ ప్యాకేజ్ మరియు ఈజీ ఫైనాన్స్ స్కీమ్‌లను కూడా బెనెల్లీ అందిస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న బెనెల్లీ డీలర్‌షిప్ కేంద్రాలలో ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం ఈ బ్రాండ్ నుండి లభిస్తున్న ఏకైక మోడల్ ఇది, ఇటీవలే కంపెనీ దీనిని బిఎస్6కి అనుగుణంగా అప్‌డేట్ చేసింది.

బెనెల్లీ ఇంపీరియల్ 400 యాజమాన్యాన్ని సులభతరం చేసేందుకు కంపెనీ ఓ కొత్త ఫైనాన్స్ స్కీమ్‌ను కూడా ప్రకటించింది. కంపెనీ అందిస్తున్న ఈ కొత్త ఫైనాన్స్ స్కీమ్‌తో ఇప్పుడు అత్యల్పంగా కేవలం రూ.4,999 ఈఎమ్ఐతోనే ఈ మోటార్‌సైకిల్‌ను సొంతం చేసుకోవచ్చు.
అంతేకాకుండా, బెనెల్లీ ఇంపీరియల్ 400 మోటార్‌సైకిల్ ఎక్స్-షోరూమ్ ధరపై కంపెనీ ఇప్పుడు గరిష్టంగా 85 శాతం వరకూ ఫండింగ్‌ను కూడా అందిస్తోంది. ఈ కొత్త ఫైనాన్స్ స్కీమ్‌తో పాటుగా కంపెనీ 2 సంవత్సరాల కాంప్లిమెంటరీ సర్వీస్ మరియు 3 సంవత్సరాల అపరిమిత కిలోమీటర్ల వారంటీని కూడా అందిస్తోంది.
MOST READ:అద్భుతంగా ఉన్న మలయాళీ స్టార్ మమ్ముట్టి లగ్జరీ కారవాన్.. చూసారా !

బెనెల్లీ ఈ ఏడాది జూలై నెలలో ఇంపీరియల్ 400 బిఎస్6 మోడల్‌ను మార్కెట్లో విడుదల చేసింది. కొత్త బెనెల్లీ ఇంపీరియల్ 400 బిఎస్6 మోటార్‌సైకిల్‌ను ఇప్పుడు ఆన్‌లైన్‌లో కానీ లేదా భారతదేశం అంతటా ఉన్న ఏదైనా బ్రాండ్ డీలర్‌షిప్ ద్వారా రూ.6,000 టోకెన్ అమౌంట్‌ని చెల్లించి బుక్ చేసుకోవచ్చు.

ప్రస్తుతం మార్కెట్లో బిఎస్6 బెనెల్లీ ఇంపీరియల్ 400 మోటార్‌సైకిల్ ధర రూ.1.99 లక్షలుగా ఉంది. ఇది రెడ్, సిల్వర్ మరియు బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. బ్లాక్ అండ్ రెడ్ పెయింట్ స్కీమ్స్ సిల్వర్ కలర్ కంటే 10,000 రూపాయలు ఎక్కువ ధరను కలిగి ఉంటాయి. ఈ రెండు వేరియంట్ల ధరలు రూ.2.10 లక్షలుగా ఉన్నాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా).
MOST READ:కేవలం 4 గంటల సమయంలో భారీగా పట్టుబడ్డ దొంగ వాహనాలు..ఇంకా ఎన్నో..మీరే చూడండి

బెనెల్లీ ఇంపీరియల్ 400 మోటార్‌సైకిల్ విషయానికి వస్తే, ఇందులో 374సిసి సింగిల్ సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 6000 ఆర్‌పిఎమ్ వద్ద 20 బిహెచ్‌పి పవర్‌ను మరియు 3500 ఆర్‌పిఎమ్ వద్ద 29 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

ఈ మోటార్‌సైకిల్‌లో గుండ్రటి హెడ్‌ల్యాంప్, టెయిల్ లాంప్స్ మరియు టర్న్-ఇండికేటర్లతో ఇది క్లాసిక్-రెట్రో రూపాన్ని కలిగి ఉంటుంది. ఇంపీరియల్ 400లోని హెడ్‌ల్యాంప్, టెయిల్ లాంప్స్, ఎగ్జాస్ట్, వీల్స్ మొదలైన వాటిని క్రోమ్‌తో గార్నిష్ చేయబడి ఉంటాయి.
దీని ఇంధన ట్యాంక్ మరియు ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఈ రెట్రో-క్లాసిక్ డిజైన్‌కు మరింత వన్నె తెస్తాయి. ఇందులోని డబుల్-పాడ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌లో చిన్నపాటి టిఎఫ్‌టి డిస్‌ప్లే ఉంటుంది. ఇధి ఓడో మీటర్ మరియు ట్రిప్-మీటర్‌కు సంబంధించిన సమాచారాన్ని తెలియజేస్తుంది.

బెనెల్లీ ఇంపీరియల్ 400 ముందు భాగంలో 41 మిమీ టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక భాగంలో ప్రీలోడెడ్ అడ్జస్ట్‌మెంట్‌తో కూడిన డ్యూయెల్-షాక్ అబ్జార్బర్స్ ఉంటాయి. ఇక బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందు భాగంలో 300 మిమీ డిస్క్ మరియు వెనుక వైపు 240 మిమీ డిస్క్ బ్రేక్స్ ఉంచాయి. మెరుగైన భద్రత కోసం ఇది డ్యూయెల్-ఛానెల్ ఏబిఎస్‌ను సపోర్ట్ చేస్తుంది.

బెనెల్లీ ఇంపీరియల్ 400 మోటార్‌సైకిల్ ఈ విభాగంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350, బుల్లెట్ 350, జావా 350 మరియు ఫోర్టీ టూ, రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350, హోండా హెచ్'నెస్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.
MOST READ:సినిమా స్టైల్‌లో బస్సును కొండపై యు-టర్న్ చేసిన డ్రైవర్ [వీడియో]