కొత్త 2021 రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 వస్తోంది.. స్పై వీడియో

భారతదేశపు ప్రీమియం మోటార్‌సైకిల్ బ్రాండ్ రాయల్ ఎన్‌ఫీల్డ్, దేశీయ మార్కెట్లో తమ ప్రోడక్ట్ లైనప్‌ను క్రమంగా అప్‌గ్రేడ్ చేస్తూ వస్తోంది. ఇటీవలే మీటియోర్ 350 క్రూయిజర్ మోటార్‌సైకిల్‌ను విడుదల చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ మరికొద్ది రోజుల్లోనే కొత్త 2021 మోడల్ హిమాలయన్ అడ్వెంచర్ మోటార్‌సైకిల్‌ను ప్రవేశపెట్టేందుకు సిద్ధంగా ఉంది.

కొత్త 2021 రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 వస్తోంది.. స్పై వీడియో

ఇదిలా ఉంటే, కంపెనీ తాజాగా తమ క్లాసిక్ 350 మోటార్‌సైకిల్‌ను కూడా అప్‌గ్రేడ్ చేసే పనిలో బిజీగా ఉంది. ఇందుకు సంబంధించిన ఓ స్పై వీడియో కూడా ఆన్‌లైన్‌లో లీకైంది. ఈ వీడియోలో కొత్త 2021 మోడల్ క్లాసిక్ 350 మోటార్‌సైకిల్ రియర్ డిజైన్ వివరాలు వెల్లడయ్యాయి.

కొత్త 2021 రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 వస్తోంది.. స్పై వీడియో

రాయల్ ఎన్‌ఫీల్డ్ నుండి అత్యధికంగా అమ్ముడవుతున్న క్లాసిక్ 350 మోటార్‌సైకిల్‌లో కొత్తగా వస్తున్న ఈ 2021 ఇయర్ మోడల్‌లో వెనుక వైపు సరికొత్త ఎల్ఈడి టెయిల్ లైట్ సెటప్‌ను అమర్చినట్లు తెలుస్తోంది. ఇందులోని టెయిల్ ల్యాంప్స్ క్లియర్ లేదా ఆరెంజ్ కలర్ క్లస్టర్లతో కనిపిస్తాయి.

అంతేకాకుండా, ఈ కొత్త మోడల్ క్లాసిక్ 350 బైక్‌లోని సీట్లను కూడా ఇప్పుడు మరింత కుషన్‌తో సౌకర్యవంతంగా ఉండేలా డిజైన్ చేసినట్లుగా తెలుస్తోంది. అలాగే, ఇందులోని గ్రాబ్ హ్యాండిల్ కూడా పెద్దదిగా ఉన్నట్లు అనిపిస్తుంది.

కొత్త 2021 రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 వస్తోంది.. స్పై వీడియో

ప్రస్తుతానికి దీని ఫ్రంట్ డిజైన్ గురించి సరైన స్పష్టత లేకపోయినప్పటికీ, ఇందులో దాని మెయిన్ హాలోజన్ హెడ్‌లైట్ యూనిట్ చుట్టూ గుండ్రంగా ఉండే ఎల్ఈడి డిఆర్ఎల్‌తో కూడిన క్లస్టర్ ఉంటుందని సమాచారం.

కొత్త 2021 రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 వస్తోంది.. స్పై వీడియో

ఈ మోటారుసైకిల్‌లో చేయబోయే ఇతర మేజర్ అప్‌గ్రేడ్స్‌లో భాగంగా, ఇందులో బ్రాండ్ యొక్క లేటెస్ట్ ట్రిప్పర్ నావిగేషన్ సిస్టమ్‌ను కూడా ఆఫర్ చేసే అవకాశం ఉంది. ఇందుకోసం రాయల్ ఎన్‌ఫీల్డ్ తమ క్లాసిక్ 350 మోడల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను అప్‌డేటెడ్ చేయనుంది.

కొత్త 2021 రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 వస్తోంది.. స్పై వీడియో

రాయల్ ఎన్‌ఫీల్డ్ తమ సిగ్నేచర్ ట్రిప్పర్ నావిగేషన్ ఫీచర్‌ను తొలిసారిగా మీటియోర్ 350 మోడల్‌లో పరిచయం చేసింది. క్రమంగా ఈ ఫీచర్‌ను ఇప్పుడు తమ ప్రోడక్ట్ లైనప్‌లోని అన్ని వేరియంట్లకు అందించేలా కంపెనీ చర్యలు తీసుకుంటోంది. తాజాగా వస్తున్న 2021 హిమాలయన్‌లో కూడా ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది.

కొత్త 2021 రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 వస్తోంది.. స్పై వీడియో

ఇంకా ఇందులో చేయబోయే ఇతర మార్పులలో కొత్త హ్యాండిల్ బార్ గ్రిప్స్ మరియు కొత్త స్విచ్ గేర్ యూనిట్ కూడా ఉండే అవకాశం ఉంది. అయితే, ఈ కొత్త 2021 రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350, దాని ప్రస్తుత వెర్షన్ మాదిరిగానే ఒకేరకమైన డిజైన్ మరియు సిల్హౌట్‌ను కలిగి ఉంటుంది.

కొత్త 2021 రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 వస్తోంది.. స్పై వీడియో

అయితే, కొత్త మీటియోర్ 350 మోటార్‌సైకిల్‌లో ఉపయోగించిన అనేక భాగాలను ఈ కొత్త మోడల్‌లోనూ ఉపయోగించే అవకాశం ఉంది. ఇందులో ప్రస్తుతం క్లాసిక్ 350 తయారీలో ఉపయోగిస్తున్న సింగిల్ డౌన్‌ట్యూబ్ ఫ్రేమ్‌ను కొత్త డబుల్-క్రాడల్ ఫ్రేమ్‌తో భర్తీ చేయవచ్చని సమాచారం.

కొత్త 2021 రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 వస్తోంది.. స్పై వీడియో

ఇక ఇంజన్ విషయానికి వస్తే, ఇందులో ఎలాంటి మార్పు ఉండబోదని తెలుస్తోంది. కొత్త 2021 రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350లో కూడా ఇదివరకటి 349 సిసి సింగిల్ సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజన్‌నే ఉపయోగించే అవకాశం ఉంది. ఈ ఇంజన్ గరిష్టంగా 20.2 బిహెచ్‌పి పవర్‌ను మరియు 27 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది మరియు ఇది ఫైవ్-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

Source: MotorBeam

More from DriveSpark

Article Published On: Thursday, February 11, 2021, 17:57 [IST]
English summary
2021 Model Year Royal Enfield Classic 350 Spy Video Reveals New Updates. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+