మీకు తెలుసా.. Honda Gold Wing ఇక కొత్త కలర్ ఆప్సన్స్‌లో కూడా.. రానున్నాయ్

దేశీయ మార్కెట్లో అత్యధిక అమ్మకాలతో ముందుకు దూసుకెళ్తున్న ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థల్లో ఒకటి హోండా మోటార్‌సైకిల్ (Honda Motorcycle). ఈ కంపెనీ యొక్క లగ్జరీ మరియు ఖరీదైన బైక్ గోల్డ్ వింగ్‌ (Gold Wing) ఇప్పటికే భారతీయ మార్కెట్లో అమ్మకానికి ఉంది. అయితే ఈ బైక్ ఇప్పుడు కొత్త కలర్ ఆప్సన్ లో కూడా అందుబాటులోకి వచ్చింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

మీకు తెలుసా.. Honda Gold Wing ఇక కొత్త కలర్ ఆప్సన్స్‌లో కూడా.. రానున్నాయ్

హోండా మోటార్‌సైకిల్ కంపెనీ తన 2022 హోండా గోల్డ్ వింగ్ (Honda Gold Wing) బైక్ ను కొత్త కలర్ ఎంపికతో విడుదలచేయడానికి సన్నద్ధమవుతోంది. ఈ కొత్త కలర్ ఆప్సన్స్ లో GL1800 గోల్డ్ వింగ్ మరియు GL1800 గోల్డ్ వింగ్ టూర్ అప్డేట్ కానున్నాయి. గోల్డ్ వింగ్ టూర్ యొక్క మాన్యువల్ వెర్షన్ ఇప్పుడు గన్‌మెటల్ బ్లాక్ మెటాలిక్‌తో బ్లాక్డ్ అవుట్ ఇంజిన్‌లో అందించబడుతుంది. ఇదే మోడల్ యొక్క DCT వేరియంట్ రెండు కొత్త షేడ్స్‌ను పొందుతుంది. అవి గ్లింట్ వేవ్ బ్లూ మెటాలిక్ మరియు పెర్ల్ గ్లేర్ వైట్ కలర్స్.

మీకు తెలుసా.. Honda Gold Wing ఇక కొత్త కలర్ ఆప్సన్స్‌లో కూడా.. రానున్నాయ్

ఇక హోండా GL1800 గోల్డ్ వింగ్ యొక్క DCT వేరియంట్ మ్యాట్ జీన్స్ బ్లూ మెటాలిక్ కలర్‌లో అందుబాటులో ఉంటుంది. అయితే ఈ కొత్త కలర్ ఆప్సన్స్ బ్రాండ్ కి మరింత శక్తివంతమైన మరియు ప్రతిష్టాత్మకమైన అమ్మకాలలో ఉపయోగపడే అవకాశం ఉంటుంది.

మీకు తెలుసా.. Honda Gold Wing ఇక కొత్త కలర్ ఆప్సన్స్‌లో కూడా.. రానున్నాయ్

గోల్డ్ వింగ్ బైక్స్ అద్భుతమైన సౌలభ్యం, అద్భుతమైన పనితీరు అందిస్తాయి. ఇఇ మంచి అప్డేటెడ్ టెక్నాలజీలను కలిగి ఉంటాయి. గోల్డ్ వింగ్ యొక్క బ్రాండ్ యొక్క ధర సాధారణ బైకులతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఇప్పుడు మరిన్ని అప్డేట్స్ పొందటం అల్ చాలామంది కొనుగోలుదారులను ఆకర్షించడంలో విజయం సాధిస్తాయి.

మీకు తెలుసా.. Honda Gold Wing ఇక కొత్త కలర్ ఆప్సన్స్‌లో కూడా.. రానున్నాయ్

హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్స్ ఇండియా తన గోల్డ్ వింగ్ టూర్ బైక్‌ను ఇటీవల భారతీయ మార్కెట్లో విడుదల చేసింది. ఈ లగ్జరీ హోండా గోల్డ్ వింగ్ టూర్ బైక్ కోసం బుకింగ్స్ ప్రారంభించిన కేవలం 24 గంటల్లో మొత్తం విక్రయించబడ్డాయి. నిజంగా ఇది చాలా గొప్ప విషయం. హోండా గోల్డ్ వింగ్ బైక్ టూర్ కంప్లీట్ బిల్ట్-అప్ యూనిట్ (CBU)గా భారతదేశానికి తీసుకురాబడుతుంది.

మీకు తెలుసా.. Honda Gold Wing ఇక కొత్త కలర్ ఆప్సన్స్‌లో కూడా.. రానున్నాయ్

హోండా గోల్డ్ వింగ్ టూర్ బైక్ ప్రీమియం బిగ్ వింగ్ డీలర్‌షిప్ ద్వారా విక్రయించబడుతుంది. మునుపటి మోడల్‌తో పోలిస్తే 2021 హోండా గోల్డ్ వింగ్ బైక్‌లో పెద్దగా మార్పులు చేయలేదు. కానీ కొన్ని చిన్న మార్పులు చేయబడ్డాయి. ఇవి ఈ బైక్ ని మరింత ఆకర్షణీయంగా చేస్తాయి.

మీకు తెలుసా.. Honda Gold Wing ఇక కొత్త కలర్ ఆప్సన్స్‌లో కూడా.. రానున్నాయ్

హోండా మోటార్ సైకిల్ యొక్క గోల్డ్ వింగ్ ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న అత్యంత లగ్జరీ బైక్‌లలో ఒకటి. కొత్త బైక్ యొక్క హైలైట్ దాని 1,695 మిమీ లాంగ్-వీల్‌బేస్. ఇందులో డ్యూయల్-పాడ్ హెడ్‌లాంప్స్ ఉన్నాయి. ఈ బైక్ వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది దూర ప్రయాణాలకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది.

మీకు తెలుసా.. Honda Gold Wing ఇక కొత్త కలర్ ఆప్సన్స్‌లో కూడా.. రానున్నాయ్

2021 గోల్డ్ వింగ్ బైక్ యొక్క ఇంజిన్ విషయానికి వస్తే, ఇది ఫ్లాట్-సిక్స్ లిక్విడ్-కూల్డ్ 1833 సిసి ఇంజన్ కలిగి ఉంటుంది. ఇది 5,500 ఆర్‌పిఎమ్ వద్ద 125 బిహెచ్‌పి పవర్ మరియు 4,500 ఆర్‌పిఎమ్ వద్ద 170 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ లేదా 7-స్పీడ్ డిసిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. అంతే కాకూండా స్లిప్పర్ క్లచ్‌ ఇందులో స్టాండర్డ్ ఫీచర్ గా ఉంటుంది.

ఈ లగ్జరీ టూర్ బైక్‌లో చాలా ప్రీమియం ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇది 7.0 ఇంచెస్ TFT ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌తో పాటు Apple Car Play మరియు Android Auto కనెక్టివిటీని వంటి వాటిని కూడా కలిగి ఉంటుంది. ఈ గోల్డ్ వింగ్ టూర్ బైక్ సస్పెన్షన్ సెటప్ విషయానికి వస్తే, దీని ముందు భాగంలో డబుల్ విష్‌బోన్ యూనిట్ మరియు వెనుక వైపున ప్రో-లింక్ సెటప్‌ను కలిగి ఉంది.

మీకు తెలుసా.. Honda Gold Wing ఇక కొత్త కలర్ ఆప్సన్స్‌లో కూడా.. రానున్నాయ్

ఈ కొత్త గోల్డ్ వింగ్ టూర్ బైక్‌లో ట్రావెల్, స్పోర్ట్, రెయిన్ మరియు ఐకాన్ అనే రైడింగ్ మోడ్స్ అందుబాటులో ఉంటాయి. 2021 గోల్డ్ వింగ్ బైక్‌లో స్టెప్ సీట్లు కూడా ఉన్నాయి, కావున లాంగ్ రైడ్‌లకు ఖచ్చితంగా సరిపోయేవిధంగా ఉంటాయి. ఇందులో ఇవి మాత్రమే కాకూండా స్మార్ట్ కీలు, ఎల్‌ఈడీ ఫాగ్ లాంప్స్, క్రూయిజ్ కంట్రోల్, యుఎస్‌బి టైప్-సి పోర్ట్, ఆన్-బోర్డ్ నావిగేషన్ విత్ గైరోకాంపాస్, ప్యాసింజర్ ఆడియో కంట్రోల్ స్విచ్ మరియు 21.1-లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ లభిస్తుంది. ఈ బైక్ బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా అప్డేట్ చేయబడి ఉంటుంది.

మీకు తెలుసా.. Honda Gold Wing ఇక కొత్త కలర్ ఆప్సన్స్‌లో కూడా.. రానున్నాయ్

హోండా గోల్డ్ వింగ్ బైక్ ఇప్పుడు కొత్త కలర్ ఆప్సన్స్ లో విడుదలైతే తప్పకుండా మరింత ఆధారణపొందుతాయి అని మేము ఆశిస్తున్నాము. అయితే ఈ కొత్త కలర్ ఆప్సన్ బైకుల ధరలు దాని స్టాండర్డ్ బైక్ ధరల మాదిరిగా ఉంటాయా, లేదా ఇంకా ఎక్కువ ధర కలిగి ఉంటాయా అనే విషయం ఖచ్చితంగా తెలియదు.

Most Read Articles

English summary
2022 honda gold wing gets new colour options details
Story first published: Wednesday, November 24, 2021, 9:34 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X