భారత్‌లో విడుదలైన అమెరికన్ లగ్జరీ బైక్: ధర రూ. 20.75 లక్షలు

అమెరికన్ లగ్జరీ టూవీలర్ బ్రాండ్ Indian Motorcycle (ఇండియన్ మోటార్‌సైకిల్) భారతీయ మార్కెట్లో కొత్త 2022 Indian Chief Lineup (ఇండియన్ చీఫ్ లైనప్‌) బైక్ విడుదల చేసింది. ఈ కొత్త 2022 Indian Chief Lineup ధర దేశీయ మార్కెట్లో రూ. 20.75 లక్షలు. 2022 Indian Chief Lineup బైక్ గురించి మరింత సమాచారం తెలుసుకుందాం.

భారత్‌లో విడుదలైన అమెరికన్ లగ్జరీ బైక్: ధర రూ. 20.75 లక్షలు

2022 Indian Chief Lineup బైక్ మూడు మోడల్స్ లో విడుదలైంది. అవి Indian Chief Dark Horse, Indian Chief Bobber Dark Horse మరియు Indian Super Chief మోడల్స్. Indian Motorcycle కంపెనీ 100 వ వార్షికోత్సవం సందర్భంగా ఈ బైక్‌లను విడుదల చేసింది. ఈ బైక్స్ బుకింగ్స్ కంపెనీ యొక్క అధికారిక వెబ్‌సైట్ లేదా అధికారిక డీలర్‌షిప్‌ను సందర్శించడం ద్వారా బుక్ చేసుకోవచ్చు.

భారత్‌లో విడుదలైన అమెరికన్ లగ్జరీ బైక్: ధర రూ. 20.75 లక్షలు

Indian Motorcycle కంపెనీ విడుదల చేసిన 2022 Indian Chief Lineup బైక్ సింప్లిస్టిక్ స్టీల్-ట్యూబ్ ఫ్రేమ్ ఆధారంగా నిర్మించబడింది. ఈ కొత్త బైక్ 15.1 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్, ఎల్ఈడీ లైటింగ్, కీలెస్ స్టార్ట్, రెండు ప్రీలోడ్-అడ్జస్టబుల్ రియర్ షాక్‌లు, రియర్ ఫెండర్లు మరియు పిరెల్లి నైట్ డ్రాగన్ టైర్లును కలిగి ఉన్నాయి.

భారత్‌లో విడుదలైన అమెరికన్ లగ్జరీ బైక్: ధర రూ. 20.75 లక్షలు

కొత్త 2022 Indian Chief Lineup బైక్ యొక్క సీటు ఎత్తు 662 మిమీ వరకు ఉంటుంది. అదేవిధంగా వీల్‌బేస్ 1626 మిమీ. ఈ బైక్ యొక్క బరువు 304 కేజీల వరకు ఉంటుంది. అయినప్పటికీ ఈ బైక్ రైడ్ చేయడానికి చాలా అనుకూలంగా ఉండటమే కాకూండా రోడ్డుపై మంచి పట్టును కూడా అందిస్తుంది.

భారత్‌లో విడుదలైన అమెరికన్ లగ్జరీ బైక్: ధర రూ. 20.75 లక్షలు

2022 Indian Chief Lineup బైక్ యొక్క ఇంజిన్ విషయానికి వస్తే, ఇది 1890 సిసి ఇంజిన్ కలిగి ఉంటుంది. ఇది 1690 ఎన్ఎమ్ తారక్ ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ లో ఏబీఎస్ స్టాండర్డ్ గా అందుబాటులో ఉంటుంది. Chief Dark Horse మరియు Chief Bobber Dark Horse బైకులు మరింత ఆకర్షణీయంగా ఉండటానికి గ్లోస్ బ్లాక్ ఫినిష్ కలిగి ఉంటాయి. అయితే Super Chief లిమిటెడ్‌ మాత్రం క్రోమ్ ఫినిష్ అందుకుంటుంది.

భారత్‌లో విడుదలైన అమెరికన్ లగ్జరీ బైక్: ధర రూ. 20.75 లక్షలు

Indian Motorcycle బైక్స్ మంచి ప్రీమియం అనుభూతిని కలియు ఉంటాయి. ఇవి 101 మిమీ రైడ్ కమాండ్ సిస్టమ్‌ను కలిగి ఉంది. రైడ్ కమాండ్ సిస్టమ్‌ను రైడర్ గ్రిప్ కంట్రోల్స్ ఉపయోగించి ఆపరేట్ చేయవచ్చు లేదా డిజిటల్ IPS టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేను ఉపయోగించి కూడా కంట్రోల్ చేయవచ్చు. ఇది వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

భారత్‌లో విడుదలైన అమెరికన్ లగ్జరీ బైక్: ధర రూ. 20.75 లక్షలు

ఇందులో ఉన్న మల్టిపుల్ ఇంటర్‌ఫేస్‌ల ద్వారా బైక్ మరియు రైడ్ సమాచారం మరియు కాన్ఫిగరేషన్‌లను రైడర్లు సద్వినియోగం చేసుకోవచ్చు. అంతే కాకుండా, రైడర్ వైర్‌లెస్ హెల్మెట్ కమ్యూనికేటర్‌ను ఉపయోగిస్తే, రైడ్ కమాండ్ సహాయంతో మ్యూజిక్ కూడా కంట్రోల్ చేయవచ్చు.

భారత్‌లో విడుదలైన అమెరికన్ లగ్జరీ బైక్: ధర రూ. 20.75 లక్షలు

ఈ కొత్త బైకులో కాల్స్, కాంటాక్ట్ నంబర్ ప్యాడ్ మరియు టెక్స్ట్ మెసేజ్ హిస్టరీ వంటి ఫోన్ సమాచారాన్ని యాక్సెస్ చేయవచ్చు. ఇది కనెక్ట్ అయినప్పుడు, ఇన్‌కమింగ్ కాల్‌లు ముందు కనిపిస్తాయి మరియు రైడ్ కమాండ్ సహాయంతో మాట్లాడవచ్చు లేదా డిస్కనెక్ట్ చేయవచ్చు. ఈ బైక్ లో అధునాత సాంకేతిక టెక్నాలజీ వంటివి కలిగి ఉంటాయి.

భారత్‌లో విడుదలైన అమెరికన్ లగ్జరీ బైక్: ధర రూ. 20.75 లక్షలు

Indian Motorcycle కంపెనీ ఈ కొత్త బైక్ యొక్క డెలివరీలు త్వరలో ప్రారంభించనుంది. కావున త్వరలో కంపెనీ యొక్క అధీకృత డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం కంపెనీ ఈ కొత్త బైక్ విడుదలతో తన పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించడానికి చూస్తోంది. అంతే కాకుండా కొత్త కస్టమర్లను ఆకర్షించడానికి కంపెనీ ఈ కొత్త బైకులో కొత్త ఫీచర్లు మరియు పరికరాలతో విడుదల చేసింది.

భారత్‌లో విడుదలైన అమెరికన్ లగ్జరీ బైక్: ధర రూ. 20.75 లక్షలు

ఈ కొత్త అమెరికన్ లగ్జరీ బైక్ చూడటానికి చాలా మంచ్చి డిజైన్ మరియు స్టైలిష్ కలిగి ఉండి, చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ బైక్ ధర కాస్త ఎక్కువైనప్పటికీ వహనాప్రియుల మనసు దోచడంలో మాత్రం ముందుంటుంది. అయితే ఇప్పుడు దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త Indian Motorcycle కంపెనీ యొక్క 2022 Indian Chief Lineup బైక్ కస్టమర్ల నుంచి ఎలాంటి స్పందన అందుకుంటుంది, మరియు ఎలాంటి అమ్మకాలతో ముందుకు వెళుతుంది అనే విషయాలు త్వరలో తెలుస్తాయి.

Most Read Articles

English summary
2022 indian chief lineup launched in india price rs 20 75 lakh features engine details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X