ఎఫ్‌జెడ్-ఎక్స్‌ బుకింగ్స్ ప్రారంభించిన యమహా.. పూర్తి వివరాలు

ప్రముఖ బైక్ తయారీదారు యమహా, దేశీయ మార్కెట్లో కొత్త ఎఫ్‌జెడ్-ఎక్స్‌ను విడుదల చేయడానికి సన్నాహాలను సిద్ధం చేస్తోంది. ఇందులో భాగాంగానే యమహా తన కొత్త యమహా ఎఫ్‌జెడ్-ఎక్స్ బైక్ విడుదల తేదీ ఇటీవల వెల్లడించింది. భారతదేశంలో విడుదల కానున్న ఈ కొత్త బైక్ గురించి పూర్తి సమాచారం ఇక్కడ చూద్దాం.. రండి.

ఎఫ్‌జెడ్-ఎక్స్‌ బుకింగ్స్ ప్రారంభించిన యమహా.. పూర్తి వివరాలు

కంపెనీ నివేదికల ప్రకారం, కొత్త యమహా ఎఫ్‌జెడ్-ఎక్స్‌ 2021 జూన్ 18 న వర్చువల్ ఈవెంట్ ద్వారా ప్రారంభించబడుతుంది. ఇప్పుడు యమహా డీలర్లు కొత్త మోడల్ కోసం అనధికారిక బుకింగ్‌లను స్వీకరించడం ప్రారంభించారు. ఆసక్తి ఉన్న కస్టమర్లు ఇప్పుడు ఎఫ్‌జెడ్-ఎక్స్ బైక్‌ను రూ. 1000 నుంచి రూ. 10,000 వరకు బుక్ చేసుకోవచ్చు.

ఎఫ్‌జెడ్-ఎక్స్‌ బుకింగ్స్ ప్రారంభించిన యమహా.. పూర్తి వివరాలు

లాంచ్ తర్వాత మోడల్‌తో కస్టమర్లు సంతృప్తి చెందకపోతే, టోకెన్ మొత్తాన్ని పూర్తిగా తిరిగి ఇస్తామని డీలర్లు పేర్కొన్నారు. జూన్ 18 న లాంచ్ అయిన తర్వాత ఎఫ్‌జెడ్-ఎక్స్ మోడల్ డెలివరీలు ఆగస్టు ఆరంభంలో ప్రారంభమవుతాయని భావిస్తున్నారు. రెట్రో తరహా మోడల్ ధర సుమారు 1.04 లక్షల రూపాయలు. అంటే యమహా ఎఫ్‌జెడ్-ఎక్స్ ధర దాని స్టాండర్డ్ మోడల్ కంటే రూ. 5,000 ఎక్కువ.

ఎఫ్‌జెడ్-ఎక్స్‌ బుకింగ్స్ ప్రారంభించిన యమహా.. పూర్తి వివరాలు

కొత్త ఎఫ్‌జెడ్-ఎక్స్‌ బైక్ డిజైన్ విషయానికొస్తే, ఇది టియర్ ఐ ఆకారపు ఫ్యూయెల్ ట్యాంక్‌తో లేటెస్ట్ రిట్రో డిజైన్ కలిగి ఉంటుంది. కొత్త యమహా ఎఫ్‌జెడ్-ఎక్స్ బైక్ రోడ్‌స్టెర్ డిజైన్ కారణంగా ట్యాంకుకు ఫెయిరింగ్ లేదా ట్రిమ్ లేదు. అయితే దీనికి బదులుగా మధ్యలో బ్లాక్ అవుట్ స్ట్రిప్‌తో డ్యూయల్-టోన్ ఫ్యూయెల్ ట్యాంక్ కలిగి ఉంటుంది.

ఎఫ్‌జెడ్-ఎక్స్‌ బుకింగ్స్ ప్రారంభించిన యమహా.. పూర్తి వివరాలు

ఈ కొత్త యమహా ఎఫ్‌జెడ్-ఎక్స్‌ రౌండ్ షేప్ హెడ్‌ల్యాంప్‌లు, బ్లాక్ అవుట్ ఫెండర్లు, ఎగ్జాస్ట్, రిబ్బెడ్ సింగిల్-పీస్ సీట్, రియర్ గ్రాబ్ రైల్, టైర్ హగ్గర్, సింగిల్ పాడ్ ఇన్‌స్టంట్ క్లస్టర్‌తో ఇంటిగ్రేటెడ్ డిఆర్‌ఎల్‌లు వంటి వాటిని కూడా కలిగి ఉంటుంది. ఇందులో ఉన్న క్లస్టర్ దాని స్టాండర్డ్ మోడల్ నుండి తీసుకోబడింది.

ఎఫ్‌జెడ్-ఎక్స్‌ బుకింగ్స్ ప్రారంభించిన యమహా.. పూర్తి వివరాలు

ఈ కొత్త ఎఫ్‌జెడ్-ఎక్స్‌ బైక్ మంచి రైడింగ్ అనుభవాన్ని అందిస్తుంది. కావున దీనికి అనుకూలంగా ఉండే ఒక మంచి సీటింగ్ కూడా ఉంటుంది. ఇది విస్తృత హ్యాండిల్ బార్ మరియు ఫుట్‌పెగ్ కలిగి ఉంది. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

ఎఫ్‌జెడ్-ఎక్స్‌ బుకింగ్స్ ప్రారంభించిన యమహా.. పూర్తి వివరాలు

కొత్త ఎఫ్‌జెడ్-ఎక్స్‌ బైక్ యొక్క కొలతల విషయానికి వస్తే, దీని పొడవు 2,020 మిమీ, 785 మిమీ వెడల్పు మరియు 1,115 మిమీ ఎత్తు కలిగి ఉంటుంది. ఈ యమహా ఎఫ్‌జెడ్-ఎక్స్ బైక్‌ యొక్క వీల్ బేస్ 1,330 మిమీ వరకు ఉంటుంది. యమహా ఎఫ్‌జెడ్ -150 బైక్‌లో కూడా ఇలాంటి వీల్‌బేస్ ఉంటుంది.

ఎఫ్‌జెడ్-ఎక్స్‌ బుకింగ్స్ ప్రారంభించిన యమహా.. పూర్తి వివరాలు

కొత్త యమహా ఎఫ్‌జెడ్-ఎక్స్ బైక్ యొక్క సస్పెన్షన్ సెటప్ విషయానికొస్తే, దీని ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్ మరియు వెనుక భాగంలో మోనో-షాక్ సెటప్‌తో ప్రీ-లోడ్ అడ్జస్టబుల్ కలిగి ఉంటుంది. ఇక బ్రేకింగ్ విషయానికి వస్తే, ఈ బైక్ యొక్క ముందు భాగంలో 282 మిమీ డిస్క్ బ్రేక్ మరియు వెనుక వైపు 220 మిమీ డిస్క్ బ్రేక్ ఉంటుంది. దీనితో పాటు సింగిల్-ఛానల్ ఎబిఎస్‌ను కూడా ఇందులో ఉంటుంది.

ఎఫ్‌జెడ్-ఎక్స్‌ బుకింగ్స్ ప్రారంభించిన యమహా.. పూర్తి వివరాలు

యమహా కంపెనీ యొక్క కొత్త ఎఫ్‌జెడ్-ఎక్స్ అనేది భారత మార్కెట్లో బ్రాండ్ నుండి వచ్చిన స్పెషల్ ఆఫర్. ఈ బైక్ చాలా సింపుల్ డిజైన్ కలిగి ఉంది. అంతే కాదు చూడటానికి చాలా ఆకర్షణీయంగా కూడా ఉంటుంది. కొత్త ఎఫ్‌జెడ్-ఎక్స్ బైక్ భారతదేశంలో లాంచ్ అయిన తర్వాత కవాసకి డబ్ల్యూ 175 బైక్‌లకు ప్రత్యర్థిగా ఉంటుంది. ఈ యమహా ఎఫ్‌జెడ్-ఎక్స్ భారత మార్కెట్లో బ్రాండ్ నుండి ప్రత్యేకమైన ఆఫర్. ఈ బైక్ చాలా సింపుల్ డిజైన్ కలిగి ఉంది.

Images Are For Representative Purpose Only

Most Read Articles

Read more on: #యమహా #yamaha
English summary
Yamaha FZ-X 150cc Bookings Open. Read in Telugu.
Story first published: Saturday, June 12, 2021, 9:55 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X