అప్‌గ్రేడెడ్ ఎస్ఎర్ 160 స్కూటర్‌ను విడుదల చేయనున్న అప్రిలియా

ఇటాలియన్ టూవీలర్ బ్రాండ్ ఆప్రిలియా భారత మార్కెట్లో విక్రయిస్తున్న150సిసి స్కూటర్ ఎస్ఆర్ 160లో కంపెనీ ఓ కొత్త అప్‌గ్రేడెడ్ వెర్షన్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. గతేడాది బిఎస్6 అప్‌గ్రేడ్‌తో కంపెనీ ఈ ఎంట్రీ లెవల్ స్కూటర్‌ను భారత్ మార్కెట్లో విడుదల చేసింది.

అప్‌గ్రేడెడ్ అప్రిలియా ఎస్ఎర్ 160 వస్తోంది

ఉత్తమ రైడింగ్ అనుభవాన్ని అందించే కొన్ని స్కూటర్లలో అప్రిలియా ఎస్ఆర్160 కూడా ఒకటి. ప్రాక్టికాలిటీ, రైడ్ క్వాలిటీ మరియు ఫీచర్ల జాబితా వంటి పలు అంశాల్లో ఈ స్కూటర్ చాలా మెరుగ్గా ఉంటుంది. ఈ స్కూటర్ విషయంలో కస్టమర్లు మరియు నిపుణుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న పియాజ్జియో సంస్థ, ఇప్పుడు దీనిని అప్‌గ్రేడ్ చేసేందుకు సిద్ధమవుతోంది.

అప్‌గ్రేడెడ్ అప్రిలియా ఎస్ఎర్ 160 వస్తోంది

పియాజియో ఇండియా ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ డియెగో గ్రాఫి తెలిపిన వివరాల ప్రకారం, అప్రిలియా ఎస్ఆర్ 160 ఇతర ఎస్ఆర్ సిరీస్‌లతో పాటు రీడిజైన్ చేయబడుతుంది. ఈ రీడిజైన్‌లో భాగంగా, అనేక మార్పులు ఆశించవచ్చు.

MOST READ:అలెర్ట్: కర్ణాటకలో 14 రోజుల కఠిన ఆంక్షలతో కరోనా లాక్‌డౌన్

అప్‌గ్రేడెడ్ అప్రిలియా ఎస్ఎర్ 160 వస్తోంది

అప్‌గ్రేడెడ్ అప్రిలియా ఎస్ఆర్ 160 మోడల్‌లో రీడిజైన్ చేయబడిన ఎల్‌ఈడీ హెడ్‌లైట్లు, సగటు ఇంధన సామర్థ్యాన్ని ప్రదర్శించే ఇంటిగ్రేటెడ్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ మరియు బ్లూటూత్ కనెక్టివిటీ వంటి అనేక ఫీచర్లను ఇందులో జోడించే అవకాశం ఉంది.

అప్‌గ్రేడెడ్ అప్రిలియా ఎస్ఎర్ 160 వస్తోంది

అంతేకాకుండా, ఇందులో స్టార్ట్-స్టాప్ ఫీచర్ కూడా ఆఫర్ చేసే అవకాశం ఉంది. ఈ అప్‌డేటెడ్ వెర్షన్ రాబోయే పండుగ సీజన్ నాటికి భారత మార్కెట్లోకి ప్రవేశించవచ్చని సమాచారం. ఇంజన్ విషయానికి వస్తే, కొత్త ఆప్రిలియా ఎస్ఆర్ 160 స్కూటర్‌లో ఇదివరకటి అప్‌డేటెడ్ బిఎస్6 ఇంజన్‌నే ఈ కొత్త వెర్షన్‌లో కొనసాగించనున్నారు.

MOST READ:కేవలం 2.7 సెకన్లలో గంటకు 100 కిమీ చేరుకోగల కొత్త ఫెరారీ కార్; వివరాలు

అప్‌గ్రేడెడ్ అప్రిలియా ఎస్ఎర్ 160 వస్తోంది

ఈ ఇటాలియన్ బ్రాండ్ తమ 75వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా కొత్త ఎస్ఎక్స్ఆర్ 125 స్కూటర్‌ను మరియు ఓ లిమిటెడ్ ఎడిషన్ వెస్పాను కూడా ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. కొత్త అప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 125 ఈ విభాగంలో సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ 125 మాక్సీ స్కూటర్‌కి పోటీగా నిలుస్తుంది.

అప్‌గ్రేడెడ్ అప్రిలియా ఎస్ఎర్ 160 వస్తోంది

ఆప్రిలియా ఈ ఏడాది ఎస్ఎక్స్ఆర్ 160తో పలు ఉత్తేజకరమైన ఉత్పత్తులను కంపెనీ మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఉత్సాహాన్ని కోల్పోకుండా, రానున్న రోజుల్లో మరిన్ని కొత్త మోడళ్లను విడుదల చేయాలని కంపెనీ భావిస్తోంది.

MOST READ:సొంత కారు అమ్మి ప్రజలకు ఉచితంగా సేవ చేస్తున్న రియల్ హీరో.. ఎవరో తెలుసా?

అప్‌గ్రేడెడ్ అప్రిలియా ఎస్ఎర్ 160 వస్తోంది

ఈ ఏడాది జనవరిలో కంపెనీ తమ సరికొత్త 2021 ఎస్ఎక్స్ఆర్ 160 స్కూటర్ డెలివరీలను ప్రారంభించింది. భారత మార్కెట్లో ఈ స్కూటర్ ప్రారంభ ధర రూ.1.25 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. కాగా, ఇటీవలే కంపెనీ తమ ఎస్ఎక్స్ఆర్ సిరీస్‌లో కొత్తగా ఓ 125సీసీ స్కూటర్‌ను కూడా విడుదల చేయనుంది.

అప్‌గ్రేడెడ్ అప్రిలియా ఎస్ఎర్ 160 వస్తోంది

భారత మార్కెట్లో అప్రిలియా తమ ఎస్ఎక్స్ఆర్ 125 స్కూటర్ కోసం ప్రీ-లాంచ్ బుకింగ్‌లను కూడా ప్రారంభించింది. ఈ కొత్త స్కూటర్ బుక్ చేసుకోవాలనుకునే కస్టమర్లు కంపెనీ యొక్క అధికారిక వెబ్‌సైట్‌లో లేదా డీలర్‌షిప్‌లో రూ.5,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ని గమనిస్తూ ఉండండి.

MOST READ:భారత మార్కెట్లో టాప్ 5 బెస్ట్ మైలేజ్ కార్లు.. వివరాలు

Source: Financial Express

Most Read Articles

English summary
Aprilia Planning To Introduce Updated SR160 In India, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X