దేశీయ మార్కెట్లో ప్రారంభమైన Aprilia SR 160 బుకింగ్స్: ఫీచర్స్ & వివరాలు

భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన ద్విచక్ర వాహన తయారీదారులలో ఒకటి ఎప్రిలియా (Aprilia). ఎప్రిలియా కంపెనీ దేశీయ మార్కెట్లో తన కొత్త స్కూటర్ అయిన ఎప్రిలియా ఎస్ఆర్ 160 (Aprilia SR 160) ను విడుదల చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తోంది. అయితే కంపెనీ ఈ స్కూటర్ ని విడుదల చేయకముందే బుకింగ్ ప్రారంభించింది. ఎప్రిలియా ఎస్ఆర్ 160 బుకింగ్స్ గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

దేశీయ మార్కెట్లో ప్రారంభమైన Aprilia SR 160 బుకింగ్స్: ఫీచర్స్ & వివరాలు

ఎప్రిలియా కంపెనీ అందించిన అధికారిక సమాచారం ప్రకారం, కొత్త ఎప్రిలియా ఎస్ఆర్ 160 స్కూటర్‌ బుకింగ్ కోసం వెబ్‌సైట్‌ అందుబాటులో ఉంది. కావున కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు కంపెనీ యొక్క అధికారిక వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవచ్చు. ఎప్రిలియా ఎస్ఆర్ 160 స్కూటర్‌ డీలర్‌షిప్‌కి చేరుకోవడం కూడా ప్రారంభించింది. కావున డెలివరీలు త్వరలో జరిగే అవకాశం ఉంటుంది.

దేశీయ మార్కెట్లో ప్రారంభమైన Aprilia SR 160 బుకింగ్స్: ఫీచర్స్ & వివరాలు

కంపెనీ ఇప్పటికి విడుదల చేసిన ఫోటోల ప్రకారం, ఈ కొత్త స్కూటర్ యొక్క ముందు డిజైన్‌ కొంత మార్చినట్లు వెల్లడించాయి. కొత్త మోడల్‌లో హాలోజన్ యూనిట్‌కు బదులుగా ఎల్ఈడీ హెడ్‌లైట్ యూనిట్ ఇవ్వబడింది. కొత్త LED హెడ్‌లైట్ యూనిట్‌కు మునుపటి కంటే షార్ప్ డిజైన్ ఇవ్వబడింది. ఈ కొత్త స్కూటర్ తో ఎక్కువమంది కొనుగోలుదారులను ఆకర్శించడానికి కంపెనీ అన్ని సన్నాహాలు సిద్ధం చేస్తోంది.

దేశీయ మార్కెట్లో ప్రారంభమైన Aprilia SR 160 బుకింగ్స్: ఫీచర్స్ & వివరాలు

ఈ కొత్త స్కూటర్ చూడగానే ఆకర్షించే విధంగా ఉంటుంది. కంపెనీ ప్రస్తుతానికి, కొత్త ఎప్రిలియా ఎస్ఆర్ 160 స్కూటర్‌ గురించి ఎక్కువ సమాచారం విడుదల చేయలేదు. అయినప్పటికీ కంపెనీ ఈ స్కూటర్‌లో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌ను కూడా అందించే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము. అంతే కాకుండా బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్ కూడా అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది.

దేశీయ మార్కెట్లో ప్రారంభమైన Aprilia SR 160 బుకింగ్స్: ఫీచర్స్ & వివరాలు

ఎప్రిలియా ఎస్ఆర్ 160 స్కూటర్‌ వివిధ కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. ఇందులో రెడ్, వైట్, బ్లాక్, గ్రే మరియు బ్లూ కలర్స్ ఉన్నాయి. ఈ స్కూటర్ ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

దేశీయ మార్కెట్లో ప్రారంభమైన Aprilia SR 160 బుకింగ్స్: ఫీచర్స్ & వివరాలు

ఎప్రిలియా ఎస్ఆర్ 160 స్కూటర్‌ యొక్క ఇంజిన్ విషయానికి వస్తే, ఈ ఇంజిన్ లో ఎటువంటి మార్పులు ఉండే అవకాశం లేదు. కావున ఎప్రిలియా యొక్క ప్రస్తుత మోడల్‌లోని అదే 160.03 సిసి ఇంజన్ ఉపయోగించబడుతుంది. ఇది ఇప్పటికే బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా అప్డేట్ చేయబడి ఉంది. కావున ఈ ఇంజిన్ 10.84 బిహెచ్‌పి పవర్ మరియు 11.6 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది.

దేశీయ మార్కెట్లో ప్రారంభమైన Aprilia SR 160 బుకింగ్స్: ఫీచర్స్ & వివరాలు

ఇంజిన్ మాత్రమే కాకుండా ఈ కొత్త స్కూటర్ లో కూడా దాని మునుపటి మోడల్స్ లోని అదే సస్పెన్షన్ మరియు బ్రేక్‌లు వంటివి ఉంటాయి. కంపెనీ యొక్క బుకింగ్ వెబ్‌సైట్‌లో ఈ కొత్త స్కూటర్ ధర రూ. 1.06 లక్షలు(ఎక్స్-షోరూమ్, పూణే). ఈ స్కూటర్ యొక్క లాంచ్ గురించి ఇంకా అధికారిక సమాచారం అందుబాటులో లేనప్పటికీ, ఈ పండుగ సీజన్‌లో విడుదల చేయవచ్చని భావిస్తున్నారు.

దేశీయ మార్కెట్లో ప్రారంభమైన Aprilia SR 160 బుకింగ్స్: ఫీచర్స్ & వివరాలు

ఎప్రిలియా ఇండియా ఇటీవల దేశీయ మార్కెట్లో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కొత్త Tuono 660 బైక్ ను ఎట్టకేలకు విడుదల చేసింది. భారతీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త Aprilia Tuono 660 బైక్ ధర రూ. 13.09 లక్షలు(ఎక్స్-షోరూమ్). ఈ కొత్త బైక్ కొనుగోలు కోసం బుకింగ్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి.

దేశీయ మార్కెట్లో ప్రారంభమైన Aprilia SR 160 బుకింగ్స్: ఫీచర్స్ & వివరాలు

దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త Aprilia Tuono 660 బైక్ మూడు కలర్ అప్సన్స్ లో లభిస్తుంది. అవి కాన్సెప్ట్ బ్లాక్, ఇరీడియం గ్రే మరియు యాసిడ్ గోల్డ్ కలర్స్.

కొత్త Aprilia Tuono 660 బైక్ లో లిక్విడ్ కూల్డ్, DOHC, ప్యారలల్ ట్విన్ సిలిండర్ 659 సిసి ఇంజిన్ అమర్చబడి ఉంటుంది. ఈ ఇంజన్ 10,500 ఆర్‌పిఎమ్ వద్ద 94 బిహెచ్‌పి పవర్ మరియు 8,500 ఆర్‌పిఎమ్ వద్ద 67 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగలదు. ఇంజిన్ స్లిప్-అసిస్ట్ క్లచ్‌తో 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడింది.

దేశీయ మార్కెట్లో ప్రారంభమైన Aprilia SR 160 బుకింగ్స్: ఫీచర్స్ & వివరాలు

Aprilia Tunon 660 బైక్ దాని RS660 నుండి దాదాపు అన్ని పరికరాలను పొందుతుంది. ఈ బైక్ రోజూవారీ ఉపయోగానికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. Aprilia Tunon 660 బైక్ దేశీయ మార్కెట్లో హోండా CB650R, కవాసకి Z650, ట్రయంఫ్ ట్రైడెంట్ 660 మరియు KTM డ్యూక్ 790 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

Most Read Articles

English summary
Aprilia sr 160 pre bookings starts launch soon in india details
Story first published: Tuesday, November 9, 2021, 18:28 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X