అప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 125 స్కూటర్ ధర ఎంతంటే..?

ఇటాలియన్ టూవీలర్ బ్రాండ్ అప్రిలియా భారత మార్కెట్లో విక్రయిస్తున్న అప్రిలియా ఎస్ఎక్స్ఆర్ సిరీస్‌లో కంపెనీ కొత్తగా ఓ 125సీసీ వేరియంట్ స్కూటర్‌ను ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసినదే. ఇప్పటికే ఈ మోడల్ కోసం కంపెనీ అధికారికంగా బుకింగ్‌లను కూడా స్వీకరిస్తోంది.

అప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 125 స్కూటర్ ధర ఎంతంటే..?

తాజా సమాచారం ప్రకారం, అప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 125 స్కూటర్ ధరలు ఇంటర్నెట్‌లో లీక్ అయ్యాయి. భారత మార్కెట్లో ఈ మ్యాక్సీ స్టైల్ స్కూటర్ ధర రూ.1.16 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉండొచ్చని అంచనా. త్వరలోనే కంపెనీ ఈ స్కూటర్‌ను అధికారికంగా మార్కెట్లో విడుదల చేయనుంది.

అప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 125 స్కూటర్ ధర ఎంతంటే..?

అప్రిలియా ఇప్పటికే ఎస్ఎక్స్ఆర్ సిరీస్‌లో 160సీసీ ఇంజన్‌తో కూడిన ఓ మాక్సీ స్కూటర్‌ను విక్రయిస్తోంది. ఇప్పుడు కొత్తగా రానున్న ఎస్ఎక్స్ఆర్ 125సీసీ స్కూటర్ కూడా చూడటానికి మొత్తం ఎస్ఎక్స్ఆర్ 160 మాదిరిగానే అనిపిస్తుంది. ఈ రెండు మోడళ్లలో ఇంజన్ మినహా వేరే ఎలాంటి మార్పులు ఉండబోవు.

MOST READ:బజాజ్ ఆటో లాంచ్ చేసిన కొత్త బైక్; పూర్తి వివరాలు

అప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 125 స్కూటర్ ధర ఎంతంటే..?

అప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 125 స్కూటర్‌ను పియాజ్జియోకి చెందిన పూనే ప్లాంట్‌లో ఉత్పత్తి చేస్తున్నారు. ఈ బైక్ మార్కెట్లో విడుదలైన మొదటి వారంలోనే దీని డెలివరీలు కూడా ప్రారంభం కానున్నాయి. మార్కెట్లో దీని ఆన్-రోడ్ ధర (ఢిల్లీలో) సుమారు రూ.1.31 లక్షలు ఉండొచ్చని అంచనా.

అప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 125 స్కూటర్ ధర ఎంతంటే..?

అప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160 మాదిరిగానే ఈ కొత్త అప్రిలియా 125 స్కూటర్ కూడా ఈ విభాగంలోని ఇతర స్కూటర్ల కన్నా ఖరీదైనదిగా ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న టీవీఎస్ ఎన్‌టార్క్ స్కూటర్ ధరతో పోలిస్తే, అప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 125 ధర సుమారు రూ.38,000 ఎక్కువగా ఉంటుంది.

MOST READ:చిట్టి చిట్టి రోబో కాదు, పిజ్జా డెలివరీ రోబో, తెలుసా.. అయితే ఇది చూడండి

అప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 125 స్కూటర్ ధర ఎంతంటే..?

అలాగే, అప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 125 స్కూటర్‌కు ఈ విభాగంలో ప్రధాన పోటీదారు అయిన సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ మాక్సీ స్కూటర్ ధర కంటే ఇది రూ.27,000 ఖరీదైనదిగా ఉంటుంది. వాస్తవానికి అప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 125 స్కూటర్ అధిక కలిగి ఉన్నప్పటికీ, ఇందులో అనేక అదనపు ఫీచర్లు లభ్యం కానున్నాయి.

అప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 125 స్కూటర్ ధర ఎంతంటే..?

ఇందులో ప్రధానంగా, యుఎస్‌బి ఛార్జింగ్ పోర్ట్, బ్లూటూత్ కనెక్టివిటీని సపోర్ట్ చేసే డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైజర్ మరియు వై-ఆకారపు అల్లాయ్ వీల్స్ మొదలైనవి ఇందులో ఉన్నాయి. ఈ స్కూటర్ రెడ్, బ్లూ, బ్లాక్ మరియు వైట్ కలర్ ఆప్షన్లలో లభ్యం కానుంది.

MOST READ:2021 టయోటా ఫార్చ్యూనర్ లెజెండర్ రివ్యూ.. భారత మార్కెట్లో పవర్‌పుల్ ఎస్‌యూవీ

అప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 125 స్కూటర్ ధర ఎంతంటే..?

అన్ని కలర్ ఆప్షన్లు కూడా ప్రత్యేకమైన అప్రిలియా గ్రాఫిక్స్‌తో లభిస్తాయి. అప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 125 స్కూటర్ పట్ల ఆసక్తిగల కస్టమర్లు, దానిని ప్రీ-బుకింగ్ చేసుకోవటానికి కంపెనీ వెబ్‌సైట్‌ను కానీ లేదా సమీపంలోని డీలర్‌షిప్‌ను కానీ సందర్శించవచ్చు. రూ.5,000 అడ్వాన్స్‌తో దీనిని బుక్ చేసుకోవచ్చు.

అప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 125 స్కూటర్ ధర ఎంతంటే..?

అప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 125 స్కూటర్‌ను సరికొత్త మరియు ఆధునిక గ్లోబల్ డిజైన్ ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని రూపొందించారు. ఈ స్కూటర్‌లో పూర్తి ఎల్‌ఈడీ హెడ్‌లైట్, ఎల్‌ఈడీ టెయిల్ లైట్స్, బ్లూటూత్ కనెక్టివిటీ మరియు సౌకర్యవంతమైన రైడింగ్ కోసం విశాలమైన సీట్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

MOST READ:బ్రేకింగ్ న్యూస్; బెంగళూరులో తిరగాలంటే మీ బైక్‌కి ఇది తప్పని సరి.. లేకుంటే?

అప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 125 స్కూటర్ ధర ఎంతంటే..?

ఇంజన్ విషయానికి వస్తే, ఈ స్కూటర్‌లో 125 సిసి త్రీ వాల్వ్ ఫ్యూయల్ ఎజెక్టెడ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 9.5 బ్రేక్ హార్స్ పవర్‌ను మరియు 9.2 న్యూటన్ మీటర్ల టార్క్‌ను జనరేట్ చేస్తుంది. అప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 125 లో సర్దుబాటు చేయగల రియర్ సస్పెన్షన్, డిస్క్ బ్రేక్‌లతో కూడిన సిబిఎస్ బ్రేకింగ్ సిస్టమ్ ఉన్నాయి.

Source: ZigWheel

Most Read Articles

English summary
New Aprilia SXR 125 Price Revealed Unofficially: Features, Specs And Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X