ఢిల్లీలో ఏథర్ 450ఎక్స్ డెలివరీ స్టార్ట్.. హీరో చైర్మన్‌కి మొదటి యూనిట్

భారతమార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు రోజురోజుకి డిమాండ్ బాగా పెరుగుతున్న నేపథ్యంలో, ఇప్పటికే చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయిస్తున్నాయి. ఈ తరుణంలోనే ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదలైన సంగతి తేలింది. అయితే ప్రస్తుతం ఏథర్ 450 ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీ చాలా కొత్త నగరాల్లో ప్రారంభమయ్యాయి.

ఢిల్లీలో ఏథర్ 450ఎక్స్ డెలివరీ స్టార్ట్.. హీరో చైర్మన్‌కి మొదటి యూనిట్

ఏథర్ 450 ఎక్స్ డెలివరీలు ఇప్పుడు దేశ రాజధాని నగరం ఢిల్లీలో కూడా ప్రారంభమైంది. ఢిల్లీలో ప్రారంభమైన ఈ ఏథర్ 450 ఎక్స్ యొక్క మొదటి యూనిట్‌ను హీరో మోటోకార్ప్ సిఇఒ డాక్టర్ పవన్ ముంజాల్‌ సొంతం చేసుకున్నారు. హీరోకి ఈథర్ ఎనర్జీలో దాదాపు 35 వాటా హీరో కంపెనీకి ఉంది.

ఢిల్లీలో ఏథర్ 450ఎక్స్ డెలివరీ స్టార్ట్.. హీరో చైర్మన్‌కి మొదటి యూనిట్

ఏథర్ ఎనర్జీ సీఈఓ తరుణ్ మెహతా ఈ మొదటి ఏథర్ 450 ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను హీరో మోటోకార్ప్ సిఇఒ పవన్ ముంజల్‌కు కేటాయించారు. దీనితో ఢిల్లీ నగరంలో 450 ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ల డెలివరీని కంపెనీ ప్రారంభించింది, ఇది రాబోయే రోజుల్లో సాధారణ వినియోగదారులకు పంపిణీ చేయబడుతుంది.

MOST READ:ఇండియన్ మార్కెట్లో అత్యంత చీపెస్ట్ బైక్స్ ; ధర తక్కువ & మైలేజ్ ఎక్కువ

ఢిల్లీలో ఏథర్ 450ఎక్స్ డెలివరీ స్టార్ట్.. హీరో చైర్మన్‌కి మొదటి యూనిట్

ఈ సందర్భంగా ఏథర్ ఎనర్జీ సీఈఓ తరుణ్ మెహతా మాట్లాడుతూ, మేము ఇంతకు ముందే ఈ ఏథర్ 450 ఎక్స్ ను మార్కెట్లలో లాంచ్ చేసాము. అయితే ఇప్పుడు న్యూ ఢిల్లీలో ప్రారంభించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రారంభ సమయంలో, మేము మా మొదటి యూనిట్ డాక్టర్ పవన్ ముంజల్ ను అప్పగించడం చాలా సంతోషంగా ఉంది.

ఢిల్లీలో ఏథర్ 450ఎక్స్ డెలివరీ స్టార్ట్.. హీరో చైర్మన్‌కి మొదటి యూనిట్

దీని గురించి హీరో మోటోకార్ప్ సిఈఓ డాక్టర్ పవన్ ముంజాల్ మాట్లాడుతూ, తరుణ్ చేతుల మీదుగా ఈ ఏథర్ 450 ఎక్స్ స్కూటర్‌ తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పటికే మనషి ప్రజాదరణ పొందింది. ఇందులో లేటెస్ట్ ఫీచర్స్ మరియు మంచి మైలేజ్ వంటివి ఉండటం వల్ల దేశీయ మార్కెట్లో మంచి విక్రయాలతో ముందు వెళ్తోంది అన్నారు.

MOST READ:సరదా తీర్చిన సెల్ఫీ; యువకులకు భారీ జరిమానా!

ఢిల్లీలో ఏథర్ 450ఎక్స్ డెలివరీ స్టార్ట్.. హీరో చైర్మన్‌కి మొదటి యూనిట్

హీరోకి ఏథర్ ఎనర్జీతో 2016 నుంచి సుమారు 35 శాతం వాటా ఉంది. ఏథర్ కొన్ని నెలల క్రితం తన 450 ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తీసుకువచ్చింది. మార్కెట్లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రవేశించినప్పటి నుంచి బాగా అమ్ముడవుతోంది, ఈ స్కూటర్ ద్వారా దేశవ్యాప్తంగా కొత్త మార్కెట్లోకి విస్తరించాలని కంపెనీ కోరుకుంటుంది.

ఢిల్లీలో ఏథర్ 450ఎక్స్ డెలివరీ స్టార్ట్.. హీరో చైర్మన్‌కి మొదటి యూనిట్

ఇప్పుడు ఇది ఫేజ్-2 కింద ఢిల్లీ, ముంబై, పూణేతో సహా పలు కొత్త నగరాల్లో ఎలక్ట్రిక్ స్కూటర్ల బుకింగ్ మరియు టెస్ట్ రైడ్‌లు ప్రారంభించబడుతున్నాయి. వచ్చే ఏడాది ఆరంభంలో మరిన్ని నగరాల్లో విస్తరించబోతున్నట్లు కంపెనీ ఇప్పటికే ప్రకటించింది.

MOST READ:సైకిల్ వాలా దోశకి బలే డిమాండ్ గురూ.. ఎక్కడో తెలుసా?

ఢిల్లీలో ఏథర్ 450ఎక్స్ డెలివరీ స్టార్ట్.. హీరో చైర్మన్‌కి మొదటి యూనిట్

కొత్త నగరాల్లో, వినియోగదారులు ఛార్జింగ్ సమస్యలను ఎదుర్కోకుండా ఏథర్ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ గ్రిడ్లను నిర్మించడం ప్రారంభించారు. నవంబర్‌లోనే 7 కొత్త నగరాల్లో కంపెనీ స్కూటర్‌ను విడుదల చేసింది. ఈ కొత్త నగరాల్లో 27 కొత్త డీలర్‌షిప్‌లను కంపెనీ ప్రారంభించబోతోంది.

ఢిల్లీలో ఏథర్ 450ఎక్స్ డెలివరీ స్టార్ట్.. హీరో చైర్మన్‌కి మొదటి యూనిట్

ఈ కొత్త నగరాల్లో మైసూర్, హుబ్లి, జైపూర్, ఇండోర్, పనాజీ, భువనేశ్వర్, నాసిక్, సూరత్, చండీగర్, విజయవాడ, విశాఖపట్నం, గౌహతి, నాగ్‌పూర్, నోయిడా, లక్నో మరియు సిలిగురి మొదలైనవి ఉన్నాయి. సంస్థ తన కొత్త ప్లాంట్‌ను జనవరిలో ప్రారంభించింది మరియు ఈ మూడు నెలల్లోనే అనేక కొత్త నగరాలకు డెలివరీలను ప్రారంభిస్తుంది.

MOST READ:రెప్పపాటు కాలంలో తప్పించుకున్న స్కూటరిస్ట్.. లేకుంటే ఏమయ్యేదో?

ఢిల్లీలో ఏథర్ 450ఎక్స్ డెలివరీ స్టార్ట్.. హీరో చైర్మన్‌కి మొదటి యూనిట్

ప్రస్తుతం పెట్రోల్ మరియు డీజిల్ ధరలు చాలా వరకు పెరిగిపోతున్న కారణంగా, వినియోగదారులు ఎలక్ట్రిక్ వాహనాలపై మొగ్గు చూపుతున్నారు. అంతే కాకుండా ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని పెంచడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటూ, రాయితీలను కూడా కల్పిస్తోంది.

Most Read Articles

English summary
Ather 450x Delivery Begins In Delhi. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X