భారీగా తగ్గిన ఏథర్ 450ఎక్స్ స్కూటర్ ధర; త్వరలో విజయవాడ, విశాఖపట్నంలో లాంచ్!

దేశంలోని ఎలక్ట్రిక్ వాహన తయారీదారులు మరియు వినియోగదారుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఫేమ్ (ఫాస్ట్ అడాప్షన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ (హైబ్రిడ్) ఎలక్ట్రిక్) 2 ప్రణాళికలో భాగంగా, తాజాగా ఎలక్ట్రిక్ వాహనాలపై సబ్సిడీని సవరించారు. ఈ సబ్సిడీ సవరణ అనంతరం దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల ధరలు భారీగా తగ్గుతున్నాయి.

భారీగా తగ్గిన ఏథర్ 450ఎక్స్ స్కూటర్ ధర; త్వరలో విజయవాడ, విశాఖపట్నంలో లాంచ్!

ఈ ఫేమ్ 2 ప్రోత్సాహకాల సవరణ అనంతరం, ప్రముఖ ప్రీమియం ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ అందిస్తున్న 450ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలు భారీగా తగ్గాయి. తాజా ధరల తగ్గింపు తర్వాత, దేశ రాజధాని ఢిల్లీలో ఏథర్ 450ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.1.32 లక్షలకు (ఎక్స్-షోరూమ్) దిగొచ్చింది.

దేశంలోని వివిధ నగరాల్లో ఏథర్ 450ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలు ఇలా ఉన్నాయి:

City FAME II Subsidy Revised Price
Bengaluru Rs 1.44 Lakh
Chennai Rs 1.46 Lakh
Mumbai Rs 1.42 Lakh
Ahmedabad Rs 1.46 Lakh
Hyderabad Rs 1.46 Lakh
Pune Rs 1.41 Lakh
Kochi Rs 1.47 Lakh
Delhi Rs 1.32 Lakh
Jaipur Rs 1.45 Lakh
భారీగా తగ్గిన ఏథర్ 450ఎక్స్ స్కూటర్ ధర; త్వరలో విజయవాడ, విశాఖపట్నంలో లాంచ్!

ఏథర్ ఎనర్జీ ప్రస్తుతం భారత మార్కెట్లో ఏథర్ 450 అనే స్కూటర్‌ను మాత్రమే విక్రయిస్తోంది. ఇది రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అవి: ఏథర్ 450 ప్లస్ మరియు ఏథర్ 450ఎక్స్. ఈ రెండింటిలో ఏథర్ 450ఎక్స్ దేశవ్యాప్తంగా మంచి పాపులారిటీని దక్కించుకుంది.

భారీగా తగ్గిన ఏథర్ 450ఎక్స్ స్కూటర్ ధర; త్వరలో విజయవాడ, విశాఖపట్నంలో లాంచ్!

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 6 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటార్ సాయంతో పనిచేస్తుంది. ఈ మోటర్ గరిష్టంగా 26 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 2.9 కిలోవాట్ల లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ ఉంటుంది మరియు ఈ బ్యాటరీ ప్యాక్ ఐపి67 రేటెడ్ వాటర్‌ప్రూఫ్ వ్యవస్థను కలిగి ఉంటుంది.

భారీగా తగ్గిన ఏథర్ 450ఎక్స్ స్కూటర్ ధర; త్వరలో విజయవాడ, విశాఖపట్నంలో లాంచ్!

ఏథర్ 450ఎక్స్ స్కూటర్ స్పేస్ గ్రే, వైట్, మింట్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లోని బ్యాటరీని చార్జ్ చేసే ప్రతి నిమిషం 1.45 కిలోమీటర్ల రైడింగ్ రేంజ్ లభిస్తుందని, ఫాస్ట్ చార్జర్ సాయంతో కేవలం 10 నిమిషాల్లోనే 15 కిలోమీటర్లు ప్రయాణించేందుకు సరిపడా బ్యాటరీని చార్జ్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది.

భారీగా తగ్గిన ఏథర్ 450ఎక్స్ స్కూటర్ ధర; త్వరలో విజయవాడ, విశాఖపట్నంలో లాంచ్!

ఎథర్ 450ఎక్స్ పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం 3.3 సెకన్లలోనే గంటకు 0 - 40 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోగలదు. దీని టాప్ స్పీడ్ గంటకు 80 కిలోమీటర్లుగా ఉంటుంది. ఇందులోని బ్యాటరీ పూర్తి ఛార్జ్‌పై గరిష్టంగా 85 కిలోమీటర్ల రేంజ్‌ని ఆఫర్ చేస్తుందని కంపెనీ చెబుతోంది.

భారీగా తగ్గిన ఏథర్ 450ఎక్స్ స్కూటర్ ధర; త్వరలో విజయవాడ, విశాఖపట్నంలో లాంచ్!

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 4జి నెట్‌వర్క్ మరియు బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన స్మార్ట్ టచ్‌స్క్రీన్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ ఉంటుంది. దీని సాయంతోనే స్కూటర్‌ను కంట్రోల్ చేయవచ్చు. ఇంకా ఇందులో పార్క్ అసిస్ట్ అనే ఫీచర్ ఉంటుంది. ఈ ఫీచర్ సాయంతో స్కూటర్‌ను రివర్స్‌లో రైడ్ చేయవచ్చు. ఇలా రివర్సులో రైడ్ చేసే స్కూటర్ స్పీడ్ 5 కెఎంపిహెచ్‌గా మాత్రమే ఉంటుంది.

భారీగా తగ్గిన ఏథర్ 450ఎక్స్ స్కూటర్ ధర; త్వరలో విజయవాడ, విశాఖపట్నంలో లాంచ్!

ఫేమ్ 2 స్కీమ్ క్రింద సవరించిన కొత్త ధరలు జూన్ 11, 2021వ తేదీ తరువాత నుండి ఇన్వాయిస్ చేసిన అన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లకు వర్తిస్తాయి. ఒకవేళ జూన్ 11, 2021 లోపు స్కూటర్ ఇన్వాయిస్ చేయబడి ఉండి, ఇంకా రిజిస్ట్రేషన్ కాకపోయినట్లయితే, ఈ సందర్భంలో కస్టమర్లు మరిన్ని వివరాల కోసం ఏథర్ ఎక్స్‌పీరియెన్స్ సెంటర్‌ను సంప్రదించవచ్చు.

భారీగా తగ్గిన ఏథర్ 450ఎక్స్ స్కూటర్ ధర; త్వరలో విజయవాడ, విశాఖపట్నంలో లాంచ్!

అలాకాకుండా, జూన్ 11, 2021 లోపు మీరు కొనుగోలు చేసిన ఏథర్ స్కూటర్ ఇన్వాయిస్ చేయబడి మరియు రిజిస్టర్ కూడా చేయబడినట్లయితే, అటువంటి సందర్భాల్లో మాత్రం ఈ అదనపు డిస్కౌంట్ లభించదు. పూర్తిగా కొత్త కస్టమర్లకు మాత్రమే ఈ ఆఫర్ / డిస్కౌంట్ వర్తిస్తుంది.

భారీగా తగ్గిన ఏథర్ 450ఎక్స్ స్కూటర్ ధర; త్వరలో విజయవాడ, విశాఖపట్నంలో లాంచ్!

ఏథర్ ఎనర్జీ ఇప్పుడు కొత్తగా దేశంలోని మరో 16 నగరాల్లో తమ 450ఎక్స్ స్కూటర్‌ను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది. వీటిలో మైసూర్, హుబ్లి, జైపూర్, ఇండోర్, పనాజీ, భువనేశ్వర్, నాసిక్, సూరత్, చండీగడ్, విజయవాడ, విశాఖపట్నం, గౌహతి, నాగ్‌పూర్, నోయిడా, లక్నో మరియు సిలిగురి నగరాలు ఉన్నాయి.

Most Read Articles

English summary
Ather 450X Price Dropped After Fame 2 Incentives Subsidy, New Price List. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X