దేశవ్యాప్తంగా 200 ఫాస్ట్ ఛార్జింగ్ Ather గ్రిడ్ స్టేషన్లు ప్రారంభం!

చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ (Ather Energy) దేశవ్యాప్తంగా 200 ఫాస్ట్ ఛార్జింగ్ ఏథర్ గ్రిడ్ (Ather Grid) స్టేషన్లను అందుబాటులోకి తెచ్చింది. ఇది దేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ నెట్‌వర్క్‌ లలో ఒకటి అని కంపెనీ పేర్కొంది.

దేశవ్యాప్తంగా 200 ఫాస్ట్ ఛార్జింగ్ Ather గ్రిడ్ స్టేషన్లు ప్రారంభం!

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీతో పాటు ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ మౌలిక సదుపాయాలలో పెట్టుబడి పెడుతున్న కంపెనీలలో Ather Energy కూడా ఒకటి. ఈ ఫాస్ట్ ఛార్జింగ్ యూనిట్‌లను దేశవ్యాప్తంగా ఇన్‌స్టాల్ చేయడమే కాకుండా, తమ అపార్ట్‌మెంట్‌లు మరియు భవనాలలో హోమ్ ఛార్జింగ్ సొల్యూషన్స్ ను ఏర్పాటు చేయడంలో కూడా కంపెనీ తమ వినియోగదారులకు సహాయపడుతోంది.

దేశవ్యాప్తంగా 200 ఫాస్ట్ ఛార్జింగ్ Ather గ్రిడ్ స్టేషన్లు ప్రారంభం!

ఈ విషయంపై Ather Energy సీఈఓ మరియు కో-ఫౌండర్ వ్యవస్థాపకుడు తరుణ్ మెహతా మాట్లాడుతూ.. తమ కంపెనీ ప్రతి నెలా కనీసం 45 ఫాస్ట్ ఛార్జింగ్ యూనిట్లను జోడిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే సమయం నాటికి కంపెనీ తన EV ఫాస్ట్ ఛార్జింగ్ నెట్‌వర్క్‌ ను దాదాపు 500 కి విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు గతంలో Ather Energy వెల్లడించింది.

దేశవ్యాప్తంగా 200 ఫాస్ట్ ఛార్జింగ్ Ather గ్రిడ్ స్టేషన్లు ప్రారంభం!

ప్రస్తుతం దేశంలో Ather ఎలక్ట్రిక్ స్కూటర్లు 13 నగరాల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ నగరాల్లో ఛార్జింగ్ నెట్‌వర్క్‌ లను కూడా కంపెనీ అభివృద్ధి చేస్తోంది. వచ్చే ఏడాది మార్చి నాటికి 50 నగరాలకు, రాబోయే రెండేళ్లలో దాదాపు 100 నగరాలకు విస్తరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. కంపెనీ విస్తరణ ప్రణాళికలలో దేశవ్యాప్తంగా EV ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం కూడా ప్రధాన భాగంగా ఉంది.

దేశవ్యాప్తంగా 200 ఫాస్ట్ ఛార్జింగ్ Ather గ్రిడ్ స్టేషన్లు ప్రారంభం!

బెంగుళూరు నుండి స్టార్టప్ కంపెనీగా వ్యాపారం ప్రారంభించిన ఏథర్ ఎనర్జీ, ఇప్పుడు తమ తయారీ కేంద్రాన్ని తమిళనాడుకు మార్చి, దేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్ బ్రాండ్ గా ఎదుగుతోంది. తమిళనాడులోని హోసూర్‌ లో ఉన్న తమ తయారీ కేంద్రాన్ని విస్తరించేందుకు Ather Energy రూ. 130 కోట్లు ఖర్చు చేయబోతోంది.

దేశవ్యాప్తంగా 200 ఫాస్ట్ ఛార్జింగ్ Ather గ్రిడ్ స్టేషన్లు ప్రారంభం!

రాబోయే కొన్నేళ్లలో కంపెనీ Ather ప్లాంట్‌లో మొత్తం రూ. 650 కోట్ల పెట్టుబడిని వెచ్చించనుంది. ఈ బ్రాండ్ నుండి ప్రస్తుతం దేశలో రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. అవి: Ather 450X (ఏథర్ 450ఎక్స్) మరియు Ather 450 Plus (ఏథర్ 450 ప్లస్).

దేశవ్యాప్తంగా 200 ఫాస్ట్ ఛార్జింగ్ Ather గ్రిడ్ స్టేషన్లు ప్రారంభం!

ఏథర్ 450ఎక్స్ అనేది ప్రమీయం మోడల్ ఎలక్ట్రిక్ స్కూటర్. ఇందులో 6 కిలో వాట్ ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఇది ఆన్-బోర్డ్ 2.9 kwh లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ సాయంతో పనిచేస్తుంది. ఈ బ్యాటరీ ద్వారా స్కూటర్ లోని ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 8 బిహెచ్‌పి పవర్‌ను మరియు 26 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

దేశవ్యాప్తంగా 200 ఫాస్ట్ ఛార్జింగ్ Ather గ్రిడ్ స్టేషన్లు ప్రారంభం!

పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, Ather 450X ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం 3.3 సెకన్లలోనే గంటకు 0 నుండి 40 కిమీ వేగాన్ని చేరుకుంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ ను ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 116 కిమీ వరకు రైడ్ చేయవచ్చు. ఇది సర్టిఫైడ్ రేంజ్ మాత్రమే, వాస్తవ పరిస్థితుల్లో ఇది మారే అకాశం ఉంటుంది.

దేశవ్యాప్తంగా 200 ఫాస్ట్ ఛార్జింగ్ Ather గ్రిడ్ స్టేషన్లు ప్రారంభం!

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో రెండు డ్రైవ్ మోడ్‌లు ఉన్నాయి. అవి: రైడ్ మరియు ఎకో మోడ్‌లు. దీని గరిష్ట వేగం గంటకు 80 కిలోమీటర్లు. అయితే, రైడర్ ఎంచుకునే మోడ్‌ని బట్టి ఈ వేగం మారుతూ ఉంటుంది. ఎకో మోడ్‌లో, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను 85 కిమీ వరకు నడపవచ్చు. రైడ్ మోడ్‌లో ఇది 75 కిలోమీటర్ల వరకు నడుస్తుంది.

దేశవ్యాప్తంగా 200 ఫాస్ట్ ఛార్జింగ్ Ather గ్రిడ్ స్టేషన్లు ప్రారంభం!

చార్జింగ్ విషయానికి వస్తే, ఏథర్ 450 ఎలక్ట్రిక్ స్కూటర్‌లోని బ్యాటరీని చార్జ్ చేసే ప్రతి నిమిషం 1.45 కిలోమీటర్ల రైడింగ్ రేంజ్ లభిస్తుందని కంపెనీ తెలిపింది. ఫాస్ట్ చార్జర్ సాయంతో కేవలం 10 నిమిషాల్లోనే 15 కిలోమీటర్లు ప్రయాణించేందుకు సరిపడా బ్యాటరీని చార్జ్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఏథర్ ఎనర్జీ ఈ బ్యాటరీపై మరియు ఎలక్ట్రిక్ స్కూటర్‌పై 3 ఏళ్ల సమగ్ర వారంటీని అందిస్తోంది.

దేశవ్యాప్తంగా 200 ఫాస్ట్ ఛార్జింగ్ Ather గ్రిడ్ స్టేషన్లు ప్రారంభం!

ఏథర్ 450ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో అనేక స్మార్ట్ ఫీచర్లు లభిస్తాయి. ఇందులో 4G నెట్‌వర్క్ మరియు బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన స్మార్ట్ టచ్‌స్క్రీన్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ ఉంటుంది. దీని సాయంతోనే పూర్తి స్కూటర్‌ను కంట్రోల్ చేయవచ్చు మరియు సంగీతం, వాయిస్ అసిస్టెంట్ వంటి ఫీచర్లను కూడా కంట్రోల్ చేయవచ్చు.

దేశవ్యాప్తంగా 200 ఫాస్ట్ ఛార్జింగ్ Ather గ్రిడ్ స్టేషన్లు ప్రారంభం!

ఏథర్ ఎనర్జీ తమ మొట్టమొదటి ఏథర్ స్పేస్ (Ather Space) షోరూమ్‌ ను 2018 లో బెంగళూరులో ప్రారంభించింది. ఇప్పుడు తాజాగా కోయంబత్తూర్ లో దేశంలోనే అతిపెద్ద ఏథర్ స్పేస్ షోరూమ్ ని ప్రారంభించింది. ప్రస్తుతం, ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్లు బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబై, పూణే, హైదరాబాద్, కొచ్చి, జైపూర్ మరియు అహ్మదాబాద్ వంటి ప్రధాన నగరాల్లో అందుబాటులో ఉన్నాయి.

దేశవ్యాప్తంగా 200 ఫాస్ట్ ఛార్జింగ్ Ather గ్రిడ్ స్టేషన్లు ప్రారంభం!

రాబోయే కొన్నేళ్లలో మరిన్ని కొత్త ఉత్పత్తులను మార్కెట్లో విడుదల చేయాలని Ather Energy యోచిస్తోంది. భారత మార్కెట్ కోసం కంపెనీ ఓ సరసమైన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తయారు చేయడంపై పనిచేస్తోంది. మార్కెట్లో దీని ధర సుమారు రూ. 1 లక్ష కంటే తక్కువగా ఉండొచ్చని సమాచారం. ఇది 2023 లో ప్రారంభించే అకాశం ఉంది.

Most Read Articles

English summary
Ather energy adds 200 fast charging ather grid stations across india details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X