ఫ్రీ ఛార్జింగ్ 2022 జూన్ 30 వరకు: Ather Energy

భారతీయ మార్కెట్లో రోజురోజుకి ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. కానీ మన దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు కావలసిన మౌలిక సదుపాయాలు ఇంకా అందుబాటులో లేదు. కావున ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు కొంత వరకు మందగించాయి. అయితే ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఏథర్ (Ather) తన కస్టమర్లకు తగినన్ని ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే కంపెనీ ఛార్జింగ్ గ్రిడ్‌లో ఉచిత ఛార్జింగ్ సౌకర్యాన్ని కూడా కల్పిస్తోంది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

ఫ్రీ ఛార్జింగ్ 2022 జూన్ 30 వరకు: Ather Energy

కంపెనీ నివేదికల ప్రకారం ఏథర్ ఎనర్జీ తన ఛార్జింగ్ గ్రిడ్‌లో ఫ్రీ ఛార్జింగ్ సౌకర్యాన్ని 2022 జూన్ 30 వరకు పొడిగించింది. కంపెనీ ఈ సదుపాయాన్ని 2021 సెప్టెంబర్ నెలలో ప్రారంభించింది. అంతే కాకుండా కంపెనీ యొక్క ఎలక్ట్రిక్ స్కూటర్లపై ఫ్రీ కనెక్టివిటీ సౌకర్యం 2022 మే వరకు పొడిగించింది. ఇది నవంబర్ 15 న ప్రారంభించబడింది.

ఫ్రీ ఛార్జింగ్ 2022 జూన్ 30 వరకు: Ather Energy

ఏథర్ ఎనర్జీ యొక్క ఛార్జింగ్ గ్రిడ్ ప్రస్తుతం అన్ని కంపెనీల ఎలక్ట్రిక్ వాహనాలకు అందుబాటులో ఉంటుంది, కావున ఇది వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. సెప్టెంబరులో దేశవ్యాప్తంగా తన ఛార్జింగ్ గ్రిడ్‌ల సంఖ్య 200 దాటినప్పుడు ఏథర్ ఎనర్జీ దీన్ని ఉచితంగా చేస్తామని ప్రకటించింది. ఇందులో కేవలం ఏథర్ 450 శ్రేణికి మాత్రమే పరిమితం కాకుండా ఏ కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ వాహనం అయినా ఇక్కడ ఛార్జ్ చేయవచ్చు.

ఫ్రీ ఛార్జింగ్ 2022 జూన్ 30 వరకు: Ather Energy

కావున మీరు ఏ రకమైన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని కలిగి ఉన్నప్పటికీ మీరు కంపెనీ యొక్క ఛార్జింగ్ గ్రిడ్ ద్వారా ఛార్జ్ చేసుకోవచ్చు. ఇది ఎలక్ట్రిక్ టూ వీలర్ కలిగి ఉన్న వాహనదారులకు చాలా మంచి వార్త. గత నెలలో, కంపెనీ కొత్త ఛార్జింగ్ గ్రిడ్‌ను ప్రవేశపెట్టింది. ఇది కొత్త తరం ఫాస్ట్ ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నెట్‌వర్క్ ఓవర్-ది-ఎయిర్ (OTA) అప్‌డేట్ సామర్ధ్యం వంటి అధునాతన ఫీచర్‌లతో వస్తుంది.

ఫ్రీ ఛార్జింగ్ 2022 జూన్ 30 వరకు: Ather Energy

Ather కంపెనీ ఇప్పటికే బెంగళూరు మరియు చెన్నై వంటి ప్రధాన నగరాల్లో కొత్త ఛార్జింగ్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయడం ప్రారంభించింది, అంతే కాకుండా ఇది త్వరలో దేశంలోని మరిన్ని నగరాలకు విస్తరించే అవకాశం ఉంటుంది. కావున ఇవన్నీ ఎలక్ట్రిక్ వాహన వినియోగదారులకు మరింత అనుకూలంగా ఉంటుంది.

ఫ్రీ ఛార్జింగ్ 2022 జూన్ 30 వరకు: Ather Energy

కంపెనీ ప్రారంభించిన ఈ కొత్త తరం పబ్లిక్ ఛార్జింగ్ నెట్‌వర్క్ అనేది ప్రస్తుత ఛార్జింగ్ గ్రిడ్ కంటే చాలా వేగంగా ఎలక్ట్రిక్ వాహనాలను ఛార్జ్ చేస్తుంది. అంతే కాకూండా బగ్ ఫిక్సింగ్ మరియు చెకప్ ప్రక్రియ కూడా మునుపటి కంటే వేగంగా ఉంటుంది. కొత్త ఛార్జింగ్ గ్రిడ్‌లో OTA సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ వంటి ఫీచర్లు ఉంటాయి, ఇది స్కూటర్ సాఫ్ట్‌వేర్‌ను గ్రిడ్‌లో అప్‌డేట్ చేయడానికి అనుమతిస్తుంది.

ఫ్రీ ఛార్జింగ్ 2022 జూన్ 30 వరకు: Ather Energy

ఏథర్ ఛార్జింగ్ గ్రిడ్ 2.0 మెరుగైన మన్నికతో వస్తుంది. ఇది తీవ్రమైన ఉష్ణోగ్రతలు మరియు ఇతర ఏదైనా వాతావరణ పరిస్థితులలో ఉపయోగించడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. కంపెనీ ఈ కొత్త గ్రిడ్‌ను తయారు చేయడానికి మాడ్యులర్ డిజైన్ టెక్నాలజీని ఉపయోగించామని, ఇది దాని సర్వీసింగ్‌ను సులభతరం చేస్తుందని కంపెనీ పేర్కొంది. కొత్త ఏథర్ గ్రిడ్ ఏథర్ యొక్క ప్రధాన సర్వర్‌లకు 24 గంటల్లో కనెక్ట్ చేయబడింది, తద్వారా ఏదైనా లోపాలను గురించి కంపెనీని హెచ్చరిస్తుంది.

ఫ్రీ ఛార్జింగ్ 2022 జూన్ 30 వరకు: Ather Energy

కంపెనీ గత కొన్ని సంవత్సరాలుగా దేశంలో ఫాస్ట్ ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను వేగంగా నిర్మిస్తోంది. ఏథర్ గ్రిడ్ ఛార్జింగ్ నెట్‌వర్క్ ప్రస్తుతం 21 భారతీయ నగరాల్లో 215 స్థానాల్లో విస్తరించి ఉంది. 2022 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి దేశంలోని ఇతర నగరాల్లో 500 కంటే ఎక్కువ ఛార్జింగ్ స్టేషన్లను ప్రారంభించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం కంపెనీ వేగంగా అడుగులు వేస్తోంది.

ఫ్రీ ఛార్జింగ్ 2022 జూన్ 30 వరకు: Ather Energy

కంపెనీ ఇటీవల తమిళనాడులోని హోసూర్‌లో ఉన్న తమ తయారీ కేంద్రాన్ని విస్తరించేందుకు దాదాపు రూ.130 కోట్ల పెట్టుబడిని వెచ్చించింది. రాబోయే రోజుల్లో ఈ ప్లాంట్‌లో ఏథర్ కంపెనీ మొత్తం పెట్టుబడి రూ. 650 కోట్లకు చేరనుంది. తద్వారా ఉత్పత్తి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది.

ఫ్రీ ఛార్జింగ్ 2022 జూన్ 30 వరకు: Ather Energy

ఏథర్ కంపెనీ దేశీయ మార్కెట్లో ప్రస్తుతం 450X మరియు 450 ప్లస్ అనే రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తోంది. ఏథర్ 450X ధర రూ. 1,44,500 వద్ద ఉంది. అంతే కాకుండా ఏథర్ 450 ప్లస్ ధర రూ. 1,25,490. ఏథర్ 450X 6 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటార్‌తో పాటు 2.9 kwh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఈ మోటార్ గరిష్టంగా 8 బిహెచ్‌పి పవర్ మరియు 26 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 3.3 సెకన్లలో 0 నుంచి 40 కిమీ/గం వేగాన్ని అందుకుంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ని ఒకసారి ఫుల్ ఛార్జింగ్ పెడితే 116 కి.మీ పరిధిని అందిస్తుంది.

ఫ్రీ ఛార్జింగ్ 2022 జూన్ 30 వరకు: Ather Energy

ఏథర్ ఎనర్జీ దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహన రంగంలో మంచి పురోగతిని సాధించింది. అంతే కాకుండా తన విభాగంలో అత్యధిక అమ్మకాలను చేపట్టిన ఎలక్ట్రిక్ స్కూటర్ గా కూడా నిలిచింది. రాబోయే రోజుల్లో దేశీయ మార్కెట్లో కంపెనీ యొక్క ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క అమ్మకాలు మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కావున కంపెనీ కూడా దీనికోసం తన పరిధిని చాలా వేగంగా విస్తరిస్తోంది.

Most Read Articles

English summary
Ather energy extends free charging service till 30 june 2022 details
Story first published: Tuesday, December 21, 2021, 11:36 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X