ఏథర్ ఎనర్జీ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్లాంట్ టూర్.. చూసొద్దాం రండి..

బెంగుళూరుకి చెందిన ఎలక్ట్రిక్ వెహికల్ తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ, రెండేళ్ల క్రితం ఓ స్టార్టప్ కంపెనీగా ప్రారంభమై ఇప్పుడు దేశంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థలలో ఒకటిగా మారింది. ఏథర్ ఎనర్జీ ఇటీవలే తమ మకాంను బెంగుళూరు నుండి తమిళనాడుకు మార్చింది.

ఏథర్ ఎనర్జీ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్లాంట్ టూర్.. చూసొద్దాం రండి..

తమిళనాడులోని హోసూర్‌లో ఏథర్ ఎనర్జీ తమ కొత్త ప్లాంట్‌ను ఇటీవలే ప్రారంభించింది. ప్రస్తుతం ఈ ప్లాంట్‌లో ఏథర్ 450ఎక్స్ మరియు ఏథర్ 450 ప్లస్ మోడళ్లను ఉత్పత్తి చేస్తున్నారు. కంపెనీ ఇటీవలే మూడు కొత్త ఉత్పత్తులను కూడా ప్రారంభించింది. భవిష్యత్తులో ఈ ప్లాంట్‌లో మరిన్ని మోడళ్లను తయారు చేయాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది.

ఏథర్ ఎనర్జీ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్లాంట్ టూర్.. చూసొద్దాం రండి..

తాజాగా ఈ ప్లాంట్‌ను మా తెలుగు డ్రైవ్‌స్పార్క్ బృందం సందర్శించింది. మరి ఆ విశేషాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

ఏథర్ ఎనర్జీ ప్లాంట్‌ను మొత్తం 1,23,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. ఈ ప్లాంట్‌లో ముడి పదార్థాల నిల్వ, ముడి పదార్థాల పరీక్ష, ప్రీ అసెంబ్లీ ఏరియా, బ్యాటరీల కోసం టెంపరేచర్ కంట్రోల్డ్ సెల్ స్టోరేజ్, 37-బేలతో కూడిన అసెంబ్లీ లైన్ మరియు బ్యాటరీ తయారీ ప్రాంతాల కోసం వివిద విభాగాలు ఉన్నాయి.

ఏథర్ ఎనర్జీ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్లాంట్ టూర్.. చూసొద్దాం రండి..

ఈ ప్లాంట్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్లు మరియు బ్యాటరీ ప్యాక్‌ల గరిష్ట ఉత్పాదక సామర్థ్యం వరుసగా 1.1 లక్ష యూనిట్లు మరియు 1.2 లక్షల యూనిట్లు. మేము సందర్శించిన సమయంలో, ఈ ప్లాంట్‌లో ఒక షిఫ్టుకు రోజుకు 90 ఎలక్ట్రిక్ స్కూటర్లను తయారు చేశారు. చేయడంతో ఒకే షిఫ్ట్‌ను నడుపుతోంది.

ఏథర్ ఎనర్జీ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్లాంట్ టూర్.. చూసొద్దాం రండి..

ప్రొడక్షన్ లైన్ నుండి ప్రతి స్కూటర్ కేవలం 4 నిమిషాల్లోనే తయారై బయటకు వస్తుంది. అయితే, ప్రతి స్కూటర్‌ను ప్రొడక్షన్ లైన్‌కు రెడీ చేసి పంపడానికి ప్రీ-అసెంబ్లీ ఏరియాలో 280 నిమిషాల సమయం పడుతుంది. ఇక్కడ ముడిపదార్థాలన్నింటినీ సమీకరించి ఏథర్ స్కూటర్లను ప్రొడక్షన్ లైన్‌కు సిద్ధం చేస్తారు.

ఏథర్ ఎనర్జీ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్లాంట్ టూర్.. చూసొద్దాం రండి..

వివిధ రకాల సరఫదారులు పంపిణీ చేసిన విడిభాగాలను ఒకే ప్లాంతంలో నిల్వ చేసి ఉంచుతారు. బ్యాటరీలో ఉపయోగించే సెల్స్‌ను కొరియా నుంచి దిగుమతి చేసుకుంటారు. వీటి మినహా ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీలో ఉపయోగించే అన్ని ఇతర భాగాల్లో 90 శాతం వాటిని స్థానికంగానే కొనుగోలు చేస్తున్నట్లు కంపెనీ పేర్కొంది.

ఏథర్ ఎనర్జీ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్లాంట్ టూర్.. చూసొద్దాం రండి..

ఇలా కొనుగోలు చేసిన ముడి పదార్థాలను లోపాల కోసం శాంపిల్ వారీగా పరీక్షిస్తారు. శాంపిల్ బ్యాచ్ ఉత్పత్తి దశకు చేరుకునే ముందు కఠినమైన పరీక్షకు లోనవుతుంది. ఇలా ముడి పదార్థాలను క్రమబద్ధీకరించిన తర్వాత, ఎలక్ట్రిక్ మోటార్, బ్యాటరీ ప్యాక్, ఫ్రంట్ సస్పెన్షన్ మరియు టైర్లను ఫ్రేమ్‌కు బోల్ట్ చేసి ప్రీ-అసెంబ్లీ ప్రాంతానికి తరలిస్తారు.

ఏథర్ ఎనర్జీ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్లాంట్ టూర్.. చూసొద్దాం రండి..

ఇలా ఎలక్ట్రిక్ స్కూటర్ సగం అసెంబ్లీ అయిన తర్వాత, 37-బే అసెంబ్లీ లైన్‌కు వెళుతుంది. ఈ అసెంబ్లీ లైన్‌పై 70 మంది పనిచేస్తుంటారు. స్కూటర్ 33వ బే వద్దకు చేరుకోగానే ఇదిగా పూర్తిగా అసెంబుల్ అయినట్లు నిర్ధారించబడుతుంది. ఆ తర్వాత ఈ స్కూటర్‌ను 34వ బే నుండి 37వ బే వరకూ వివిధ రకాల నాణ్యత పరీక్షలకు గురిచేస్తారు.

ఏథర్ ఎనర్జీ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్లాంట్ టూర్.. చూసొద్దాం రండి..

ఈ క్వాలిటీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించని లోపభూయిష్ట స్కూటర్లను తిరిగి ఫిక్స్ చేయటం, షాప్‌కి తరలిస్తారు. ఈ షాప్‌లో స్కూటర్ లోపాలని సరిచేస్తారు. స్కూటర్ మొదటి దశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత, ఇది పరీక్ష యొక్క రెండవ దశలోకి ప్రవేశిస్తుంది. దీనిని డైనో రన్ అంటారు.

ఏథర్ ఎనర్జీ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్లాంట్ టూర్.. చూసొద్దాం రండి..

ఇలా డైనో రన్ దాటిన తరువాత, స్కూటర్ మూడవ దశ పరీక్షలోకి ప్రవేశిస్తుంది, దీనిని (పిడిఐ) ప్రీ-డెలివరీ తనిఖీ అని పిలుస్తారు. పిడిఐ తనిఖీ విజయవంతమైన తరువాత ప్లాంట్ వద్ద ఉన్న టెస్ట్ రైడ్ ట్రాక్‌పై తుది ఉత్పత్తిని పరీక్షిస్తారు. ఈ పరీక్ష కూడా పూర్తయిన తర్వాత, ఇది డీలర్‌షిప్‌లకు రవాణా చేయటానికి సిద్ధంగా ఉన్నట్లు పరిగణించడం జరుగుతుంది.

ఏథర్ ఎనర్జీ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్లాంట్ టూర్.. చూసొద్దాం రండి..

ఈ ప్లాంట్‌లో స్కూటర్ అసెంబ్లీ లైన్‌తో పాటు బ్యాటరీ ప్యాక్ అసెంబ్లీ కూడా ఉంది. కొరియా నుండి దిగుమతి చేసుకున్న బ్యాటరీ సెల్స్‌ను హై-ఎండ్ రోబోట్‌లను ఉపయోగించి బ్యాటరీ ప్యాక్‌లుగా మారుస్తారు. ఇందులో బ్యాటరీల తయారీ కోసం రెండు అసెంబ్లీ లైన్స్ ఉన్నాయి.

ఏథర్ ఎనర్జీ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్లాంట్ టూర్.. చూసొద్దాం రండి..

ఏథర్ ఎనర్జీ ఫ్యాక్టరీ నుండి సున్నా ఉద్ఘారాలు వెలువడుతాయి. ఈ ఫ్యాక్టరీలో తయారయ్యే ఈ-వ్యర్థాలను రీసైకిల్ చేసేందుకు కంపెనీ అధీకృత రీసైక్లర్లతో ఒప్పందాలను కలిగి ఉంది. అంతేకాకుండా, ఈ ప్లాంట్‌లో ఉపయోగించిన నీటిని కూడా రీసైకిల్ చేసి, తిరిగి మొక్కల కోసం ఉపయోగిస్తారు. కాబట్టి, ఈ ప్లాంట్ నుండి బయటకు వచ్చే వేస్ట్ వాటర్ కూడా ఉండదు.

ఏథర్ ఎనర్జీ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్లాంట్ టూర్.. చూసొద్దాం రండి..

ఏథర్ ఎనర్జీ ప్లాంట్‌లో తయారయ్యే బ్యాటరీలను పరీక్షించేటప్పుడు, బ్యాటరీ యూనిట్‌ను ఛార్జ్ చేసి డిశ్చార్జ్ చేస్తారు. ఇలా బ్యాటరీలు డిశ్చార్జ్ అవుతున్నప్పుడు విడుదలయ్యే ఎలక్ట్రిక్ యూనిట్లను తిరిగి పవర్ గ్రిడ్‌కు పంపేలా చర్యలు తీసుకుంటారు. కాబట్టి, ఇక్కడ విద్యుత్ వేస్టేజ్ కూడా ఉండదు.

ఈ ప్లాంట్ పూర్తిగా కనెక్ట్ చేయబడిన సాంకేతికతను కలిగి ఉంటుంది మరియు ప్రొడక్షన్ లైన్స్‌లో ఏదైనా సమస్యలు ఎదురైతే వాటిని పరిష్కరించడానికి జిరా సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తారు.

ఏథర్ ఎనర్జీ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్లాంట్ టూర్.. చూసొద్దాం రండి..

ఈ కొత్త ప్లాంట్ గురించి ఏథర్ ఎనర్జీ సీఈఓ మరియు సహ వ్యవస్థాపకుడు తరుణ్ మెహతా మాట్లాడుతూ.. భారతదేశంలో ఇప్పటి వరకూ తమ ప్రయాణం చాలా గొప్పగా సాగిందని, ఈ కొత్త ప్లాంట్‌ని తెరవడం నిజంగా ఏథర్‌కు ఒక గొప్ప మైలురాయిగా ఉంటుందని అన్నారు. వినియోగదారుల నుండి నిరంతరం పెరుగుతున్న డిమాండ్ కారణంగా, తమ బ్రాండ్ కొత్త మార్కెట్లకు విస్తరించిందని చెప్పారు.

ఏథర్ ఎనర్జీ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్లాంట్ టూర్.. చూసొద్దాం రండి..

హోసూర్‌లో ఏర్పాటు చేసిన ఈ అత్యాధునిక ప్లాంట్ దేశవ్యాప్తంగా ఏర్పడుతున్న డిమాండ్‌ను తీర్చడంలో సహకరిస్తుందని అన్నారు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా, తమ ఉత్పత్తులను తయారు చేయటం, ఈవీల తయారీ కోసం తమిళనాడు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాల పట్ల గర్వంగా ఉందని ఆయన అన్నారు.

ఏథర్ ఎనర్జీ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్లాంట్ టూర్.. చూసొద్దాం రండి..

ఏథర్ ఎనర్జీ ప్రస్తుతం 15 రాష్ట్రాల్లోని 27 ప్రధాన నగరాల్లో తన ఉనికిని కలిగి ఉంది. ఈ ఏడాది చివరి నాటికి తమ నెట్‌వర్క్‌ను 40 నగరాలకు విస్తరించే దిశగా కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. బెంగళూరు, చెన్నై, ముంబై, పూణే, ఢిల్లీ, హైదరాబాద్, కొచ్చి, కోయంబత్తూర్, కోల్‌కతా, కాలికట్, అహ్మదాబాద్, మైసూర్, హుబ్లి, జైపూర్, ఇండోర్, పనాజీ, భువనేశ్వర్, నాసిక్, సూరత్, చండీగడ్, విజయవాడ, విశాఖపట్నం, లక్నో మరియు సిలిగురి నగరాల్లో ఏథర్ ఎనర్జీ షోరూమ్‌లు ఉన్నాయి.

Most Read Articles

English summary
Drivespark Team Visits Ather Energy Manufacturing Facility; Here Is Everything You Need To Know. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X