కొత్తగా 10 ఫాస్ట్ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసిన ఏథర్ ఎనర్జీ

ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ భారతదేశంలో తమ నెట్‌వర్క్‌ను శరవేగంగా విస్తరింపజేస్తోంది. తాజాగా, ముంబైలో ఓ కొత్త డీలర్‌షిప్‌ను ఓపెన్ చేసిన ఏథర్ ఎనర్జీ, అక్కడి మార్కెట్లో తమ ఎలక్ట్రిక్ స్కూటర్ల పంపిణీని కూడా ప్రారంభించింది. అంతేకాకుండా, ముంబైలో కొత్తగా 10 ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లను కూడా కంపెనీ ప్రారంభించింది.

కొత్తగా 10 ఫాస్ట్ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసిన ఏథర్ ఎనర్జీ

ముంబై నగరంలోని ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లు లింకింగ్ రోడ్, గోరేగావ్, అంధేరి, ఫోర్ట్ వంటి ప్రధాన ప్రాంతాల్లో ఏర్పాటు చేసినట్లు ఏథర్ ఎనర్జీ తెలిపింది. వచ్చే ఏడాది నాటికి ముంబై నగరంలో మొత్తం 30 ఛార్జింగ్ స్టేషన్లను ప్రారంభించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

కొత్తగా 10 ఫాస్ట్ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసిన ఏథర్ ఎనర్జీ

ముంబైలో ఈవీ లొకేషన్‌ను ఏర్పాటు చేయడానికి పార్క్ + సంస్థతో ఏథర్ ఎనర్జీ ఓ భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. ఏథర్ ఎనర్జీ తమ ఈవీ యజమానులకు చార్జింగ్ సౌకర్యాన్ని సులభంగా ప్రాప్యత (యాక్సెసబిలిటీ)ను కల్పించేందుకు అనేక కొత్త కంపెనీలతో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంటోంది.

MOST READ:కొత్త ల్యాండ్ రోవర్ డిఫెండర్ కొన్న పంజాబీ సింగర్, ఎవరో తెలుసా?

కొత్తగా 10 ఫాస్ట్ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసిన ఏథర్ ఎనర్జీ

అంతేకాకుండా, ఏథర్ ఎనర్జీ ముంబైలోని కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ మరియు ఓనర్స్ అసోసియేషన్స్‌తో కలిసి అపార్టుమెంట్లు మరియు భవనాలకు హోమ్ ఛార్జింగ్ పరిష్కారాలను అందించడానికి కూడా కృషి చేస్తోంది. అపార్ట్‌మెంట్లలో నివసిస్తూ, చార్జింగ్ సమస్యను ఎదుర్కునే ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్ల వినియోగదారులకు ఇదొక చక్కటి పరిష్కారాన్ని అందించనుంది.

కొత్తగా 10 ఫాస్ట్ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసిన ఏథర్ ఎనర్జీ

ఏథర్ ఎనర్జీ ఇప్పటివరకు, దేశంలోని 18 నగరాల్లో 128 ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. ఈ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లను కేవలం ద్విచక్ర వాహనాలే కాకుండా నాలుగు చక్రాల వాహనాలు కూడా ఉపయోగించుకోవచ్చు. అంతేకాకుండా, సెప్టెంబర్ 2021 వరకూ ఈ చార్జింగ్ స్టేషన్లను పూర్తిగా ఉచితంగా ఆఫర్ చేయనున్నారు.

MOST READ: ఎట్టకేలకు భారత్‌లో అడుగెట్టిన సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్; ధర & వివరాలు

కొత్తగా 10 ఫాస్ట్ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసిన ఏథర్ ఎనర్జీ

ఈ ఛార్జింగ్ స్టేషన్‌లను ఏథర్ గ్రిడ్ యాప్ సహాయంతో యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ యాప్ సాయంతో ఛార్జింగ్ స్టేషన్‌లను గుర్తించడం మరియు వాటి లభ్యతను తనిఖీ చేయడం చేవయచ్చు. ఏథర్ ఎనర్జీ దేశంలోని నగరాల్లో తమ స్కూటర్ల డెలివరీని ప్రారంభించడానికి ముందే కనీసం 5 నుండి 6 ఛార్జింగ్ స్టేషన్లనైనా ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

కొత్తగా 10 ఫాస్ట్ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసిన ఏథర్ ఎనర్జీ

ముంబైలో ప్రారంభించిన ఈ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లు రన్వాల్ ఆంథూరియం, ములుండ్ వెస్ట్, కాలా ఘోడా కేఫ్ ఫోర్ట్, సుబా ఇంటర్నేషనల్, అంధేరి ఈస్ట్, ఈథర్ స్పేస్ ముంబై లింకింగ్ రోడ్, క్లబ్ అక్వేరియా బోరివాలి, కె స్టార్ మాల్ చెంబూర్, సెలెస్టియా స్పేస్ సావరీ, లోధా ఫ్లోరెంజా గోరేగావ్, బ్లూ టోకై మహాలక్ష్మి, కార్నివాల్ సినిమా వడాలా ప్రాంతాల్లో ఉన్నాయి.

MOST READ:ఒంటరిగా కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు మాస్క్ అవసరమా? లేదా?.. హైకోర్టు క్లారిటీ

కొత్తగా 10 ఫాస్ట్ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసిన ఏథర్ ఎనర్జీ

ఏథర్ ఎనర్జీ ముంబై నగరంలోకి ప్రవేశించి, బాండ్రా ప్రాంతంలో తమ మొదటి డీలర్‌షిప్‌ను ప్రారంభించింది. ఈ డీలర్‌షిప్ ద్వారా కంపెనీ తమ సిరీస్ 1 ఎలక్ట్రిక్ స్కూటర్‌ను 450 మోడల్‌ను విక్రయిస్తోంది. ఇదవరకు దేశంలోని 16 నగరాల్లో కంపెనీ తమ డీలర్‌షిప్‌లను ప్రారంభించింది.

Most Read Articles

English summary
Ather Energy Opens 10 New Fast Charging Stations In Mumbai, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X