Just In
- 1 hr ago
ప్రపంచవ్యాప్తంగా 2021 స్పీడ్ ట్రిపుల్ 1200 ఆర్ఎస్ బైక్ ఆవిష్కరించిన ట్రయంఫ్; వివరాలు
- 1 hr ago
రూ.45,000 మేర పెరిగిన హ్యుందాయ్ కార్ల ధరలు, కొత్త ధరల జాబితా
- 3 hrs ago
మేడ్ ఇన్ ఇండియా 'ప్రాణ' ఈ-బైక్ విడుదల; తయారు చేసింది ఎవరో తెలుసా?
- 4 hrs ago
భారత్‌లో కొత్త జీప్ కంపాస్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ : ధర & వివరాలు
Don't Miss
- Finance
Budget 2021: ఖర్చును ప్రోత్సహించే ప్లాన్! రూ.80,000 వరకు రిలీఫ్?
- Lifestyle
Zodiac Signs:ఈ రాశుల వారికి అబద్ధం చెప్పడమంటే ‘హల్వా’తిన్నంత సులభమట...! ఇలాంటోళ్లతో జర భద్రం..!
- Movies
పవన్ కల్యాణ్ షాకింగ్ నిర్ణయం వెనుక చిరంజీవి.. పవర్‌స్టార్‌కు కోసం మెగాస్టార్ మాస్టర్ ప్లాన్!
- News
10 కోట్లను దాటిన కరోనా కేసులు: 22 లక్షలకు చేరువగా మరణాలు: తల్లడిల్లుతోన్న అగ్రరాజ్యం
- Sports
ఫిబ్రవరి 18న ఐపీఎల్ మినీ వేలం.. ఎక్కడంటే?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఒక ఛార్జ్‌తో 100 కి.మీ డ్రైవింగ్.. ధర తక్కువ & డ్రైవింగ్ లైసెన్స్ అవసరమే లేదు
దేశవ్యాప్తంగా ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల శకం మొదలైంది. ఈ నేపథ్యంలో భాగంగా అన్ని వాహన తయారీదారులు ఎలక్ట్రిక్ వాహనాలను తయారుచేసి విక్రయించడంలో నిమగ్నమయ్యారు. దీనిని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్‌కు చెందిన అటుమొబైల్ అనే స్టార్టప్ ఒకే ఛార్జీతో 100 కిలోమీటర్లు ప్రయాణించగల ఎలక్ట్రిక్ బైక్‌ను విడుదల చేసింది. దీని ప్రారంభ ధర 50000 రూపాయలు.

ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ (ICAT) చేత ధృవీకరించబడిన తక్కువ-వేగంతో వెళ్లే మోటారుసైకిల్ కనుక, ఈ బైక్ ఉపయోగించే వాహనదారులకు డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు. ఇది చూడటానికి చాలా సింపుల్ గా ఉంటుంది. ఈ బైక్‌ను ఆటమ్ 1.0 అని పిలుస్తారు.

ఈ ఆటమ్ 1.0 బైక్ భారతీయ వినియోగదారుల అవసరాలఅనుకూలంగా తయారుచేయబడిన, మరియు స్టైలిష్ బైక్ అని ఈ ఆటోమొబైల్ ఫౌండర్ వంశీ గడ్డం తెలిపారు. ఈ బైక్ తక్కువ ధర కలిగి ఉండటం వల్ల కూడా ఎక్కువమంది వినియోగదారులను ఆకర్షించేది అవకాశం ఉంది.
MOST READ:కొత్త హ్యుందాయ్ ఐ 20 బుకింగ్స్ హవా.. ఇప్పటికీ తగ్గని జోరు

ఆటమ్ 1.0 తయారు కావడానికి ప్రధాన ఇన్స్పిరేషన్ :
"వంశీ గడ్డం" అమెరికాలోని పర్డ్యూ విశ్వవిద్యాలయం నుండి బిజినెస్ మేనేజ్‌మెంట్ డిగ్రీ 2011 లో పూర్తి చేసిన తర్వాత. అమెరికాలో చదువు పూర్తిచేఉకున్నాక తన కుటుంబ వ్యాపారమైన "విసాకా ఇండస్ట్రీస్ లిమిటెడ్"లో పనిచేయడానికి హైదరాబాద్‌కు తిరిగి వచ్చాడు. 40 సంవత్సరాలు ప్రతిష్ట వున్నా తన కంపెనీలో వంశీ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నారు.

తరువాత కాలంలో విస్తృతమైన పరిశోధన మరియు అభివృద్ధి తరువాత, మేము సోలార్ ప్యానెల్ ఇంటిగ్రేటెడ్ రూఫింగ్ సిస్టం అయిన ఆటమ్ ప్రారంభించారు. దీని తర్వాత ఏ రంగంలోకి ప్రవేశించాలి అని ఆలోచిస్తున్న తరుణంలో, ఇటీవల పెరుగుతున్న ఎలక్ట్రిక్ వాహనాల ఆదరణను తాము కూడా పొందాలని ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ రంగంవైపు మొగ్గు చూపడం జరిగింది.
MOST READ:పెరిగిన కియా సోనెట్, కియా సెల్టోస్ ధరలు; ఇవే కొత్త ధరలు..

ఆటమ్ 1.0 బైక్ ఫీచర్స్ :
ఆటమ్ 1.0 బైక్ ను అభివృద్ధి చేయడానికి వంశీ అతనితో పాటు 10 మంది ఇంజనీర్లు దాదాపు మూడు సంవత్సరాలు నిరంతరం కృషి చేశారు. తర్వాత ఈ బైక్ తయారైంది. ఈ బైక్ తయారైన తర్వాత టెస్టింగ్ కోసం ఇచ్చారు. ఎట్టకేలకు ఈ బైక్ మార్కెట్లో లాంచ్ అయింది.
ఆటమ్ బైక్ చూడటానికి చాలా సింపుల్ గా ఉన్న పాతకాలపు కేఫ్-రేసర్ బైక్ లాగా రూపొందించబడింది. దీని బరువు కేవలం 35 కేజీలు మాత్రమే. కానీ దృఢమైన నిర్మాణం కలిగి ఉంది. ఈ బైక్ గంటాకు గరిష్టంగా 25 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. ఈ బైక్‌లు రెండేళ్ల వారంటీతో వస్తాయి. ఈ ఆటమ్ బైక్ యువకులకు మరియు పెద్దవారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది.

ఆటమ్ 1.0 ఎలక్ట్రిక్ బైక్ 48 వోల్ట్ 250 వాట్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో పనిచేస్తుంది. ఈ బ్యాటరీ కేవలం నాలుగు గంటల్లో ఛార్జ్ అవుతుంది. ఒక పూర్తి ఛార్జ్ అయినా తర్వాత దాదాపు 100 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఈ బైక్‌లో డిజిటల్ డిస్‌ప్లే కూడా ఉంది, ఇక్కడ వినియోగదారు బ్యాటరీ స్టేటస్, స్పీడ్ మరియు అన్ని కిలోమీటర్లు ప్రయాణించిందనే విషయాలను తెలుసుకోవచ్చు.
MOST READ:కొత్త మహీంద్రా థార్ కొనుగోలు చేసిన మలయాళీ సెలబ్రెటీ, ఎవరో చూసారా ?

ఈ బైక్ ను ప్రసిద్ధ యూట్యూబర్ ప్రకాష్ చౌదరి 2020 అక్టోబర్ ప్రారంభంలో ఆటమ్ 1.0 టెస్ట్ చేశారు. అతడు ఈ బైక్ భారత మార్కెట్‌లో ప్రవేశపెట్టిన ప్రత్యేకమైన డిజైన్ బైక్ అని ప్రస్తావించాడు. అంతే కాకుండా ఇది ఒక సాధారణ మోటార్‌సైకిల్‌ను పోలి ఉంటుంది. ఈ బైక్ భారతీయ రోడ్లకు కచ్చితంగా సరిపోయేవిధంగా ఉంటుంది. ఈ బైక్ ముందు భాగంలో స్టోరేజ్ బాక్స్ ఉంది, ఇది మాత్రమే కాకుండా చక్రాలకు డిస్క్ బ్రేక్ లు అమర్చబడ్డాయి.

ప్రస్తుతం ఈ ఆటోమొబైల్ యొక్క ఆటమ్ 1.0 బైక్ మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలతో పాటు మొత్తం మనదేశంలో దాదాపు 300 బుకింగ్స్ అందుకుంది.
MOST READ:న్యూ ఇయర్లో భారీగా తగ్గిపోయిన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు.. అసలు కారణం ఇదే..

ఈ బైక్ గురించి ఆటోమొబైల్ ఫౌండర్ వంశీ మాట్లాడుతూ, ఈ బైక్‌లు తెలంగాణలోని ప్రొడక్షన్ యూనిట్‌లో తయారవుతున్నాయని, అంతే కాకుండా ఈ యూనిట్ ప్రతిరోజూ 250 నుంచి 300 బైక్‌లను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. భవిష్యత్ లో కస్టమర్ల డిమాండ్‌ను బట్టి పెద్ద ఎత్తున తయారీ ప్రారంభమవుతుందని తెలిపారు.

ఈ బైక్ ను బుక్ చేసుకోవాలంటే ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు. ఆటమ్ 1.0 ఫ్రీ బుకింగ్ చేసుకోవాలనుకునే కస్టమర్లు వెబ్‌సైట్ ద్వారా 3000 ముందస్తుగా చెల్లించాలి. డెలివరీలు త్వరలో ప్రారంభమవుతాయి. ఇది పూర్తిగా మనదేశంలో తయారైన బైక్, అంతే కాకుండా దీనికి డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు కావున, యువకులు, పెద్దవారు ఎవరైనా ఉపయోగించుకోవచ్చు.