డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేని ఎలక్ట్రిక్ బైక్ డెలివరీ షురూ చేసిన ఆటమ్‌మొబైల్; వివరాలు

దేశవ్యాప్తంగా ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహన శకం మొదలైంది. ఈ నేపథ్యంలో భాగంగా అన్ని వాహన తయారీదారులు ఎలక్ట్రిక్ వాహనాలను తయారుచేసి విక్రయించడంలో నిమగ్నమయ్యారు. దీనిని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్‌కు చెందిన ఆటమ్‌మొబైల్ అనే స్టార్టప్ కంపెనీ ఒకే ఛార్జీతో 100 కిలోమీటర్లు ప్రయాణించగల ఎలక్ట్రిక్ బైక్‌ను విడుదల చేసింది. దీని ప్రారంభ ధర 50000 రూపాయలు.

డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేని ఎలక్ట్రిక్ బైక్ డెలివరీ షురూ చేసిన ఆటమ్‌మొబైల్; వివరాలు

ఇప్పుడు ఈ ఆటమ్‌మొబైల్ స్టార్టప్ కంపెనీ యొక్క ఎలక్ట్రిక్ బైక్ డెలివరీలు ప్రారంభమయ్యాయి. ఈ కంపెనీ హైదరాబాద్ నుంచి డెలివరీ ప్రారంభించింది. ఈ బైక్ తయారీ సదుపాయంలో కంపెనీ 10 బైక్‌లను వినియోగదారులకు పంపిణీ చేసింది. ఈవీ స్టార్ట్-అప్ సంస్థ ఆటమ్‌మొబైల్ తన సరసమైన మరియు పర్ఫామెన్స్ బేస్డ్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌తో ముందుకు వస్తోంది.

డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేని ఎలక్ట్రిక్ బైక్ డెలివరీ షురూ చేసిన ఆటమ్‌మొబైల్; వివరాలు

ఇది చూడటానికి చాలా సింపుల్ గా ఉంటుంది. ఈ బైక్‌ను ఆటమ్ 1.0 అని పిలుస్తారు. ఆటమ్‌మొబైల్ యొక్క గ్రీన్ ఫీల్డ్ తయారీ కర్మాగారం హైదరాబాద్ లోని పటాన్ చెరు లో ఉంది. ఈ కంపెనీ తన ఎలక్ట్రిక్ బైక్ ని 2020 సెప్టెంబర్ 1 న విడుదల చేసింది.

MOST READ:మెర్సిడెస్ బెంజ్ ఎ-క్లాస్ లిమోసిన్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ [వీడియో]

డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేని ఎలక్ట్రిక్ బైక్ డెలివరీ షురూ చేసిన ఆటమ్‌మొబైల్; వివరాలు

ఈ బైక్ లాంచ్ అయినప్పటి నుండి ఇప్పటివరకు ఈ బైక్ యొక్క 400 కి పైగా యూనిట్లు బుక్ చేసుకున్నట్లు కంపెనీ సమాచారం. ఇతర నగరాలలో డెలివరీ గురించి కంపెనీ ఇంకా అధికారిక సమాచారం ఇవ్వలేదు.

డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేని ఎలక్ట్రిక్ బైక్ డెలివరీ షురూ చేసిన ఆటమ్‌మొబైల్; వివరాలు

కంపెనీ హైదరాబాద్‌తో పాటు ముంబై, న్యూ ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు వంటి నగరాల్లో అటామ్ 1.0 పంపిణీ చేయనున్నట్లు తెలిపింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మరియు సాధారణ పరికరాలను ఉపయోగించి కంపెనీ ఈ బైక్‌ను నిర్మించింది.

MOST READ:ట్రాఫిక్ ఫైన్ అడిగితే మంగళ సూత్రం ఇచ్చిన మహిళ.. ఇది ఎక్కడో కాదు, మన బెంగళూరులోనే

డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేని ఎలక్ట్రిక్ బైక్ డెలివరీ షురూ చేసిన ఆటమ్‌మొబైల్; వివరాలు

ఆటమ్ బైక్ చూడటానికి చాలా సింపుల్ గా ఉన్న పాతకాలపు కేఫ్-రేసర్ బైక్ లాగా రూపొందించబడింది. దీని బరువు కేవలం 35 కేజీలు మాత్రమే. కానీ దృఢమైన నిర్మాణం కలిగి ఉంది. ఈ బైక్ గంటాకు గరిష్టంగా 25 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది.

డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేని ఎలక్ట్రిక్ బైక్ డెలివరీ షురూ చేసిన ఆటమ్‌మొబైల్; వివరాలు

ఆటమ్ 1.0 ఎలక్ట్రిక్ బైక్ 48 వోల్ట్ 250 వాట్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో పనిచేస్తుంది. ఈ బ్యాటరీ కేవలం నాలుగు గంటల్లో ఛార్జ్ అవుతుంది. ఒక పూర్తి ఛార్జ్ అయినా తర్వాత దాదాపు 100 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఈ బైక్‌లో డిజిటల్ డిస్‌ప్లే కూడా ఉంది, ఇక్కడ వినియోగదారు బ్యాటరీ స్టేటస్, స్పీడ్ మరియు అన్ని కిలోమీటర్లు ప్రయాణించిందనే విషయాలను తెలుసుకోవచ్చు.

MOST READ:మెర్సిడెస్ బెంజ్ ఎ-క్లాస్ లిమోసిన్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇప్పుడు సూపర్ లుక్, సూపర్ ఫీచర్స్

డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేని ఎలక్ట్రిక్ బైక్ డెలివరీ షురూ చేసిన ఆటమ్‌మొబైల్; వివరాలు

ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ (ICAT) చేత ధృవీకరించబడిన తక్కువ-వేగంతో వెళ్లే మోటారుసైకిల్ కనుక, ఈ బైక్ ఉపయోగించే వాహనదారులకు డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు. ఏది ఏమైనా అతి తక్కువ ధరకు లభించే మరియు పూర్తిగా స్వదేశంలో తయారైన ఈ బైక్ కి ఏ విధమైన డిమాండ్ ఉంటుందో తెలుసుకోవడానికి ఇంకా కొంత కాలం వేచి చూడాలి.

Most Read Articles

English summary
Atumobile Starts Delivery Of Atum 1.0 Electric Motorcycle In Hyderabad Details. Read in Telugu.
Story first published: Monday, March 1, 2021, 14:23 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X