బజాజ్ నుంచి రానున్న మరో కొత్త పల్సర్ బైక్; పూర్తి వివరాలు

భారతీయ మార్కెట్లో అత్యంత ప్రాచుర్యం పొందిన కంపెనీలలో ఒకటి బజాజ్ ఆటో. బజాజ్ కంపెనీ యొక్క బజాజ్ పల్సర్ సిరీస్ బైక్‌లు దేశీయ మార్కెట్లో విపరీతమైన ప్రజాదరణ పొందాయి. భారతదేశంలో పల్సర్ బైక్‌లకు ఒక ప్రత్యేక స్థానం ఉంది అనటంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. అయితే కంపెనీ కూడా దేశీయ విఫణిలో తన పల్సర్ సిరీస్‌ను మరింత పెద్ద ఎత్తున విస్తరించడానికి చూస్తుంది.

బజాజ్ నుంచి రానున్న మరో కొత్త పల్సర్ బైక్; పూర్తి వివరాలు

బజాజ్ కంపెనీ నవంబర్‌ నెలలో పల్సర్ బ్రాండ్ 20 వ వార్షికోత్సవాన్ని జరుపుకోనుంది. ఈ సమయంలో బజాజ్ పల్సర్ కొత్త 250 ఎఫ్ బైక్ లాంచ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో బజాజ్ ఆటో కొత్త పల్సర్ ప్లాట్‌ఫామ్‌ను పరిచయం చేయడానికి సిద్ధంగా ఉంది.

బజాజ్ నుంచి రానున్న మరో కొత్త పల్సర్ బైక్; పూర్తి వివరాలు

బజాజ్ కంపెనీ విడుదల చేయనున్న కొత్త పల్సర్ మోడల్ పేరు మరియు వివరాలను అధికారికంగా వెల్లడించలేదు. అయితే ఇది కొత్త 2021 బజాజ్ పల్సర్ 250 అని భావిస్తున్నాము. ఈ సంవత్సరం సరికొత్త పల్సర్ మోడళ్లను విడుదల చేయడానికి కంపెనీ ఏర్పాట్లు చేస్తోంది. దేశీయ మార్కెట్లో ప్రాక్టికల్ మరియు ఎఫెక్టివ్ మోడల్స్ ఉత్పత్తి చేయడానికి బజాజ్ తన ప్రత్యేకమైన ఈవి సబ్-బ్రాండ్‌ను ఉపయోగిస్తుంది

బజాజ్ నుంచి రానున్న మరో కొత్త పల్సర్ బైక్; పూర్తి వివరాలు

బజాజ్ ఆటో దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్లు, మోటార్ సైకిళ్లు, త్రీ వీలర్స్ మరియు 4 చక్రాలను విక్రయించాలని యోచిస్తోంది. అయితే తరువాతి కంపెనీ కమర్షియల్ విభాగంలో కూడా ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేయనుంది. ఈ సంవత్సరం జూలైలో, EV ల అభివృద్ధి కోసం బ్రాండ్ కొత్త సబ్-బ్రాండ్ కోసం సైన్ అప్ చేసింది.

బజాజ్ నుంచి రానున్న మరో కొత్త పల్సర్ బైక్; పూర్తి వివరాలు

బజాజ్ ఆటో తన కొత్త పల్సర్ 250 బైక్‌ను వచ్చే నెలల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. బజాజ్ తన పల్సర్ సిరీస్ బైకుల కోసం పూర్తిగా కొత్త ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేస్తోంది. సరికొత్త పల్సర్ 250 కొత్త ప్లాట్‌ఫామ్ కింద ప్రారంభమవుతుంది.

బజాజ్ నుంచి రానున్న మరో కొత్త పల్సర్ బైక్; పూర్తి వివరాలు

భారతదేశంలో స్పాట్ టెస్ట్ ద్వారా కొత్త బజాజ్ పల్సర్ స్పై ఫోటోలు ద్వారా కొంత సమాచారం వెల్లడైంది. ఈ ఫోటోల ప్రకారం ఈ కొత్త బైక్‌లో క్వార్టర్ ఫెయిరింగ్, ఫ్యూయల్ ట్యాంక్, ఫెయిరింగ్-మౌంటెడ్ రియర్ వ్యూ మిర్రర్స్, క్లిప్-ఆన్ హ్యాండిల్‌బార్ హెడ్‌ల్యాంప్ సెక్షన్ వంటివి ఉన్నట్లు తెలుస్తుంది. కొత్త పల్సర్ బైక్ గ్రాబ్ రైల్ మరియు విభిన్న ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్ డిజైన్‌ను పొందుతుంది. ఇందులో అల్లాయ్ వీల్స్, టైర్ హగ్గర్స్, డిస్క్ బ్రేక్స్ మరియు ఎగ్సాస్ట్ ఉన్నాయి.

బజాజ్ నుంచి రానున్న మరో కొత్త పల్సర్ బైక్; పూర్తి వివరాలు

ఈ కొత్త పల్సర్ బైక్ ఇంజిన్ విషయానికొస్తే, రాబోయే బజాజ్ పల్సర్ 250 సరికొత్త 250 సిసి ఆయిల్-కూల్డ్ ఇంజిన్‌తో వస్తుంది. ఈ ఇంజిన్ 24 బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయనుంది. ఇంజిన్ ఇప్పుడు 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో అమర్చబడి ఉంటుంది. ఈ బైక్‌లో స్ప్లిట్ సీట్లు కూడా ఉన్నాయి.

బజాజ్ నుంచి రానున్న మరో కొత్త పల్సర్ బైక్; పూర్తి వివరాలు

2021 బజాజ్ పల్సర్ 250 ఎఫ్ బైక్ సస్పెన్షన్ సెటప్ విషయానికి వస్తే, ఈ బైక్ యొక్క ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్ మరియు వెనుకవైపు మోనోషాక్ సెటప్ ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇందులోని బ్రేకింగ్ సెటప్ విషయానికి వస్తే, బైక్ ముందు మరియు వెనుక భాగంలో డిస్క్ బ్రేక్‌లు అమర్చబడి ఉంటాయి. ఇది స్టాండర్డ్ డ్యూయల్-ఛానల్ ఏబీఎస్ కలిగి ఉంటుంది.

బజాజ్ నుంచి రానున్న మరో కొత్త పల్సర్ బైక్; పూర్తి వివరాలు

2021 బజాజ్ పల్సర్ 250 బైక్ ధర దాదాపు రూ. 1.32 లక్షల నుండి రూ. 1.34 లక్షల వరకు ఉంటుందని భావిస్తున్నాము. ఈ కొత్త బైక్ త్వరలో భారతీయ మార్కెట్లో విడుదల చేయబడుతుంది. ఇండియన్ మార్కెట్లో కొత్త బజాజ్ పల్సర్ 250 లాంచ్ అయిన తర్వాత, సుజుకి జిక్సర్ 250, యమహా FZ-25 మరియు కెటిఎమ్ డ్యూక్ 250 బైక్‌ వంటి వాటికీ ప్రత్యర్థిగా ఉంటుంది.

బజాజ్ నుంచి రానున్న మరో కొత్త పల్సర్ బైక్; పూర్తి వివరాలు

ఇటీవల బజాజ్ యొక్క డామినార్ 250 బైక్ కూడా కొత్త కలర్ ఆప్షన్‌ని పొందింది. కొత్త బజాజ్ డామినార్ 250 బైక్ భారతీయ మార్కెట్లో మూడు కొత్త కలర్ ఆప్సన్స్లో అందుబాటులో ఉంది. అవి బ్లాక్ అండ్ మాట్టే సిల్వర్, రేసింగ్ రెడ్ అండ్ మాట్టే సిల్వర్, సిట్రస్ రష్ మరియు మాట్టే సిల్వర్ కలర్స్. కాన్యన్ రెడ్ మరియు చార్‌కోల్ బ్లాక్ భారతీయ మార్కెట్లో ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. దీని గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
Bajaj auto confirms new pulsar 250 launch this year in india details
Story first published: Tuesday, August 17, 2021, 19:09 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X