డ్యూయెల్ టోన్ కలర్‌లో విడుదలైన బజాజ్ డామినార్ 250; ధర & వివరాలు

ప్రముఖ బైక్ అండ్ స్కూటర్ తయారీదారు బజాజ్ ఆటో ఇప్పుడు భారత మార్కెట్లో తన డామినార్ 250 యొక్క కొత్త స్పెషల్ డ్యూయల్ టోన్ కలర్ వేరియంట్‌ను విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త డామినార్ 250 బైక్ ధర రూ. 1,54,176 (ఎక్స్-షోరూమ్). దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

డ్యూయెల్ టోన్ కలర్‌లో విడుదలైన బజాజ్ డామినార్ 250; ధర & వివరాలు

భారత మార్కెట్లో ఇప్పటికే బాగా ప్రాచుర్యం పొందిన డామినార్ 250 ఇప్పుడు కొత్త డ్యూయెల్ కలర్ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. కొత్త డామినార్ 250 యొక్క డ్యూయల్-టోన్ వేరియంట్‌ను కంపెనీ దాని స్టాండర్డ్ వేరియంట్‌తో సమానమైన ధరలో విడుదల చేసింది.

డ్యూయెల్ టోన్ కలర్‌లో విడుదలైన బజాజ్ డామినార్ 250; ధర & వివరాలు

బజాజ్ ఆటో తన ప్రముఖ టూరింగ్ బైక్ బజాజ్ డామినార్ 250 యొక్క డ్యూయల్ టోన్ వేరియంట్‌ను ఇప్పుడు మూడు కలర్ ఆప్షన్‌లలో విడుదల చేసింది. ఇందులో రేసింగ్ రెడ్ & మ్యాట్ సిల్వర్, సిట్రస్ రష్ & మ్యాట్ సిల్వర్ మరియు స్పార్కింగ్ బ్లాక్ & మ్యాట్ సిల్వర్ కలర్స్ ఉన్నాయి.

డ్యూయెల్ టోన్ కలర్‌లో విడుదలైన బజాజ్ డామినార్ 250; ధర & వివరాలు

నివేదికల ప్రకారం, కంపెనీ తన కొత్త బజాజ్ డామినార్ 250 శ్రేణిని మార్కెట్లో మరింత విస్తరించేందుకు మార్కెట్లో ఈ స్పెషల్ ఎడిషన్‌ను ప్రవేశపెట్టింది. బజాజ్ కంపెనీ విడుదల చేసిన ఈ కొత్త కలర్ బైకులలో కొత్త కలర్ ఆప్సన్స్ తప్పా, మిగిలిన ఎలాంటి మార్పులు జరగలేదు.

డ్యూయెల్ టోన్ కలర్‌లో విడుదలైన బజాజ్ డామినార్ 250; ధర & వివరాలు

ఈ కొత్త కలర్ బైకులలో కూడా దాని స్టాండర్డ్ వేరియంట్ బైక్ లోని ఇంజిన్ అమర్చింది. బజాజ్ ఆటో లిమిటెడ్ మార్కెటింగ్ హెడ్ ఆర్యన్ సుందరరామన్ కొత్త డ్యూయల్ టోన్ బజాజ్ డామినార్ 250 ని ప్రారంభించారు. ఇవి చూడటానికి మునుపటికంటే కూడా చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి.

డ్యూయెల్ టోన్ కలర్‌లో విడుదలైన బజాజ్ డామినార్ 250; ధర & వివరాలు

ప్రపంచవ్యాప్తంగా మొత్తం 1,00,000 డామినార్‌ల అమ్మకాలతో చారిత్రాత్మక మైలురాయిని మేము ఇటీవల సాధించాము. ఇది మాకు ఎంతగానో గర్వకారణంగా ఉంది. ఇది మా లక్ష్యాన్ని పునరుద్ఘాటిస్తోంది. మరిన్ని అమ్మకాలను చేపట్టడానికి కంపెనీ ఇప్పుడు ఈ డ్యూయెల్ టోన్ బైకులను మార్కెట్లో విడుదల చేసింది. ఇది తప్పకుండా మరిన్ని ఎక్కువ అమ్మకాలు జరగటానికి దోహదపడుతుంది.

డ్యూయెల్ టోన్ కలర్‌లో విడుదలైన బజాజ్ డామినార్ 250; ధర & వివరాలు

కొత్త బజాజ్ డామినార్ 250 డ్యూయల్ టోన్ ఎడిషన్‌లో కనిపించే స్పెషల్ ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ బైక్‌కు ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్ మరియు రివర్స్ ఎల్సిడి స్క్రీన్ ఇవ్వబడింది. మనం ఇది వరకు అనుకున్నట్టుగానే ఈ కొత్త ఎడిషన్ లో కూడా దాని స్టాండర్డ్ బైక్ లోని ఇంజిన్ ఉపయోగించబడింది.

డ్యూయెల్ టోన్ కలర్‌లో విడుదలైన బజాజ్ డామినార్ 250; ధర & వివరాలు

కొత్త బజాజ్ డామినార్ 250 లోని 248.8 సిసి లిక్విడ్-కూల్డ్ ఇంజన్ 27 బిహెచ్‌పి పవర్ మరియు 23.5 ఎన్ఎమ్ టార్క్‌ను అందిస్తుంది. అదే సమయంలో ఈ బైక్ లో బ్రేకింగ్ సెటప్ కూడా అద్భుతంగా ఉంటుంది. ఈ బైక్ యొక్క ముందు మరియు వెనుక డిస్క్ బ్రేక్‌లతో డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ ఫీచర్‌ కూడా అందుబాటులో ఉంటుంది.

Most Read Articles

English summary
Bajaj launched dominar 250 dual tone edition in india find here all details
Story first published: Friday, August 6, 2021, 18:28 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X