నాగ్‌పూర్‌లో విడుదలకు సిద్దమవుతున్న బజాజ్ చేతక్; కొత్త ధరలు & వివరాలు

దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన ద్విచక్ర వాహన తయారీదారుల్లో ఒకటి 'బజాజ్ ఆటో'. బజాజ్ కంపెనీ యొక్క వాహనాలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఈ కారణంగా కంపెనీ ఎప్పటికపుడు కోట వాహనాలను భారత మార్కెట్లో విడుదల చేస్తోంది. కంపెనీ యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన ద్విచక్ర వాహనంలో ఒకటి బజాజ్ చేతక్.

నాగ్‌పూర్‌లో విడుదలకు సిద్దమవుతున్న బజాజ్ చేతక్; వివరాలు

బజాజ్ కంపెనీ ఇప్పటికే ఇండియన్ మార్కెట్లో చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అది కొన్ని నగరాల్లో మాత్రమే లాంచ్ చేసింది. ఇప్పుడు కంపెనీ తన మార్కెట్ ను విస్తరించాలనే నేపథ్యంలో మరి కొన్ని నగరాల్లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల చేసింది.

నాగ్‌పూర్‌లో విడుదలకు సిద్దమవుతున్న బజాజ్ చేతక్; వివరాలు

ఇందులో భాగంగానే బజాజ్ ఆటో తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా నాగ్‌పూర్‌లో చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. అయితే కంపెనీ ఈ స్కూటర్ లాంచ్ చేయడానికి ముందే దాని ధరను మాత్రం అధికారికంగా విడుదల చేసింది.

నాగ్‌పూర్‌లో విడుదలకు సిద్దమవుతున్న బజాజ్ చేతక్; వివరాలు

కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను నాగ్‌పూర్‌లో రూ. 1.49 లక్షల ఆన్-రోడ్ ధరకు విడుదల చేయనుంది. బజాజ్ చేతక్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అవి ఒకటి అర్బన్ మరియు రెండు ప్రీమియం వేరియంట్. ఇందులో అర్బన్ వేరియంట్ ధర రూ. 1.49 లక్షలు కాగా, ప్రీమియం వేరియంట్ ధర రూ. 1.51 లక్షల వరకు ఉంటుంది.

నాగ్‌పూర్‌లో విడుదలకు సిద్దమవుతున్న బజాజ్ చేతక్; వివరాలు

కంపెనీ ప్రస్తుతం, నాగ్‌పూర్‌లో ఈ స్కూటర్ లాంచ్ చేసే ఖచ్చితమైన రోజును వెల్లడించలేదు. ఇది కూడా త్వరలో వెల్లడవుతుంది. అయితే ఈ స్కూటర్ కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు కంపెనీ యొక్క అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా కొనుగోలు చేయవచ్చు.

నాగ్‌పూర్‌లో విడుదలకు సిద్దమవుతున్న బజాజ్ చేతక్; వివరాలు

బజాజ్ ఆటో ఇప్పుడు నాగ్‌పూర్‌తో పాటు హైదరాబాద్, చెన్నైలలో కూడా ఈ స్కూటర్‌ను లాంచ్ చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం బజాజ్ ఆటో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను పూణే, మంగళూరు, బెంగళూరు, మైసూర్, ఔరంగాబాద్‌లో విక్రయిస్తోంది.

నాగ్‌పూర్‌లో విడుదలకు సిద్దమవుతున్న బజాజ్ చేతక్; వివరాలు

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అన్ని నగరాల్లోని అన్ని కెటిఎమ్ డీలర్‌షిప్‌లలో ప్రత్యేకంగా లభిస్తుంది. కొత్త నగరాల్లో కూడా ఈ స్కూటర్ కెటిఎమ్ డీలర్‌షిప్‌ల ద్వారా ప్రత్యేకంగా విక్రయించబడుతుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో బజాజ్ ఆటో చాలా గొప్ప ఫీచర్లను ఇచ్చింది.

నాగ్‌పూర్‌లో విడుదలకు సిద్దమవుతున్న బజాజ్ చేతక్; వివరాలు

బజాజ్ చేతక్ 3.8 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటారుతో పాటు 3 కిలోవాట్ ఐపి 67 లిథియం అయాన్ బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ స్కూటర్‌లో రిమూవబుల్ బ్యాటరీ సౌకర్యం లేదు. రిమూవబుల్ బ్యాటరీ ఫీచర్ బజాజ్ చేతక్ యొక్క ప్రత్యర్థి ఎలక్ట్రిక్ స్కూటర్, టివిఎస్ ఐ-క్యూబ్ మరియు ఏథర్ 450 ఎక్స్ లలో కూడా లేదు.

నాగ్‌పూర్‌లో విడుదలకు సిద్దమవుతున్న బజాజ్ చేతక్; వివరాలు

బజాజ్ చేతక్ పూర్తి ఛార్జీతో ఎకో మోడ్‌లో 95 కిలోమీటర్ల పరిధిని ఇస్తుంది. అదే సమయంలో దాని గరిష్ట వేగం గంటకు 70 కిమీ వరకు ఉంటుంది. 5 యాంపియర్ పవర్ సాకెట్‌తో ఈ స్కూటర్‌ను పూర్తిగా ఛార్జ్ చేయడానికి 5 గంటలు పడుతుంది. ఐకానిక్ రెట్రో డిజైన్ బజాజ్ చేతక్‌కు ఇవ్వబడింది.

నాగ్‌పూర్‌లో విడుదలకు సిద్దమవుతున్న బజాజ్ చేతక్; వివరాలు

ఈ స్కూటర్ యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో రౌండ్ షేప్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, ఇంటిగ్రేటెడ్ డిఆర్ఎల్ లు, ఎల్ఈడీ టైల్ లైట్స్ & టర్న్ ఇండికేటర్స్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌లు, ఫెదర్-టచ్-యాక్టివేటెడ్ స్విచ్‌లు, హెడ్‌ల్యాంప్ చుట్టూ క్రోమ్ ట్రిమ్స్ వంటి ఫీచర్స్ ఉంటాయి.

నాగ్‌పూర్‌లో విడుదలకు సిద్దమవుతున్న బజాజ్ చేతక్; వివరాలు

భారతదేశంలోని అన్ని విభాగాలలో ఎలక్ట్రిక్ స్కూటర్ల డిమాండ్ వేగంగా పెరుగుతోంది. ఈ కారణంగా దేశంలో మరిన్ని బ్రాండ్స్ ప్రవేశిస్తున్నాయి. ఇందులో ఓలా మరియు సింపుల్ ఎనర్జీ వంటి ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఉన్నాయి. ఈ సమయంలో కంపెనీ తన అమ్మకాలను మరింత విస్తరించడానికి చూస్తోంది.

నాగ్‌పూర్‌లో విడుదలకు సిద్దమవుతున్న బజాజ్ చేతక్; వివరాలు

భారత మార్కెట్లో బజాజ్ ఆటో యొక్క బజాజ్ చేతక్, ఏథర్ 450 ఎక్స్, టివిఎస్ ఐక్యూబ్ మరియు రాబోయే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ మరియు సింపుల్ వన్ ఇన్ ఇండియా వంటి వాటికీ ప్రత్యర్థిగా ఉంటుంది.

Most Read Articles

English summary
Bajaj Chetak Electric Scooter Nagpur Prices Revealed Ahead Of Launch. Read in Telugu.
Story first published: Monday, July 12, 2021, 9:47 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X