Just In
- 2 hrs ago
పూర్తి చార్జ్‌పై 350 కిలోమీటర్లు ప్రయాణించిన మహీంద్రా ఈ2ఓ ప్లస్!
- 5 hrs ago
విడుదలకు ముందే లీకైన స్కొడా కుషాక్ ఫొటోలు; జూన్ 2021లో లాంచ్!
- 6 hrs ago
ఆనంద్ మహీంద్రా నుండి థార్‌ను గిఫ్ట్‌గా పొందిన క్రికెటర్ శుబ్‌మన్ గిల్
- 6 hrs ago
కొత్త ఫోక్స్‌వ్యాగన్ పోలో ఫేస్‌లిఫ్ట్ వెల్లడి: ఫీచర్లు, స్పెసికేషన్లు మరియు వివరాలు
Don't Miss
- Sports
RCB vs RR: ప్రతీకారం తీర్చుకున్న దూబే.. మెరిసిన తేవాతియా! బెంగళూరు లక్ష్యం 178!
- Finance
Forbes 30 under 30 list: ఇద్దరు హైదరాబాదీలకు చోటు
- News
Covid: భారత్‌కు మరో దెబ్బ -విమాన సర్వీసులపై యూఏఈ నిషేధం -భారతీయు ప్రయాణికులపైనా ఆంక్షలు
- Movies
ఆయన ఊర మాస్.. ఆ అద్భుతమైన అనుభవానికి థ్యాంక్స్.. రకుల్ ప్రీత్ సింగ్ హాట్ కామెంట్స్
- Lifestyle
‘తనను వదిలేసి తప్పు చేశా.. అందం, ఆస్తి ఉందని ఆ ఇద్దరిరీ పడేశా... కానీ చివరికి...’
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే కొత్త బజాజ్ ప్లాటినా 100 ఎలక్ట్రిక్ స్టార్ట్ బైక్
భారత మార్కెట్లో సిఎఫ్ మోటో 300 ఎన్‌కె బిఎస్ 6 ఎట్టకేలకు విడుదలైంది. ఈ కొత్త బైక్ ధర దేశీయ మార్కెట్లో రూ. 2.29 లక్షలు (ఎక్స్‌షోరూమ్). సిఎఫ్ మోటో 300ఎన్‌కె బిఎస్ 6 యొక్క డిజైన్ దాదాపు బిఎస్ 4 మోడల్ నుండే తీసుకోబడింది. అయితే ఇంజిన్ బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా అప్డేట్ చేయబడింది.

కొత్త బజాజ్ ప్లాటినా 100 ఎలక్ట్రిక్ స్టార్ట్ కొత్త లుక్‌తో వస్తుంది. ఈ బైక్ అనేక కొత్త ఫీచర్లు మరియు పరికరాలతో పాటు కొన్ని సూక్ష్మ కాస్మటిక్స్ అప్డేట్స్ కూడా అందుకుంటుంది. ఇందులో కొత్త రియర్ వ్యూ మిర్రర్స్ మరియు కొత్త బాడీ గ్రాఫిక్స్ చాలా స్టైలింష్ గా ఉంటాయి.

ఇది హెడ్‌ల్యాంప్ యూనిట్లలో ఎల్‌ఈడీ డిఆర్‌ఎల్‌లు, వైడ్ రబ్బర్ ఫుట్‌ప్యాడ్‌లు, రైడర్ మరియు పిలియన్ రెండింటికీ ఎక్కువ సౌకర్యాన్ని అందించే పొడవైన సీటు ఉంటుంది. ఈ కొత్త బైక్ ఇప్పుడు రెండు కొత్త కలర్ ఆప్షన్లతో వస్తుంది. అవి కాక్‌టైల్ వైన్ రెడ్ మరియు ఎబోనీ బ్లాక్ విత్ సిల్వర్ డెకాల్స్.
MOST READ:2021 రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ రివ్యూ ; కొత్త ఫీచర్స్ & పూర్తి వివరాలు

కొత్త బజాజ్ ప్లాటినా 100 ఎలక్ట్రిక్ స్టార్ట్ బైక్ 102 సిసి సింగిల్ సిలిండర్ ఎయిర్-కూల్డ్ SOHC ఇంజిన్‌తో వస్తుంది. ఇది 7500 ఆర్‌పిఎమ్ వద్ద 7.8 బిహెచ్‌పి మరియు 5500 ఆర్‌పిఎమ్ వద్ద 8.36 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 4 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది.

కొత్త బజాజ్ ప్లాటినా 100 ఎలక్ట్రిక్ స్టార్ట్ ఇప్పుడు ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక భాగంలో హైడ్రాలిక్ షాక్ అబ్జార్బర్‌లతో కొత్త స్ప్రింగ్-ఆన్-స్ప్రింగ్ సస్పెన్షన్ సెటప్‌తో వస్తుంది. కొత్త సెటప్ ఇంప్రూవ్స్ షాక్ అబ్సార్పషన్ లెవెల్స్ మెరుగుపరుస్తుందని, మరింత సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తుందని బజాజ్ ప్రకటించింది.

ఇక ఈ బైక్ యొక్క బ్రేకింగ్ విషయానికి వస్తే ఇది 130 మిమీ మరియు 110 మిమీ డ్రమ్ బ్రేక్‌లను ఇరువైపులా కలిగి ఉంటుంది. దీనికి కాంబి-బ్రేకింగ్ సిస్టమ్ (సిబిఎస్) సపోర్ట్ కూడా లభిస్తుంది. మోటారుసైకిల్ 17 ఇంచెస్ చక్రాలపై 100/80 ప్రొఫైల్ ట్యూబ్ లెస్ టైర్లతో ముందుకు వెళ్తుంది. ఈ మోటారుసైకిల్ 11 లీటర్ ఫ్యూయెల్ ట్యాంక్ సామర్థ్యంతో వస్తుంది, మరియు దీని బరువు ఇప్పుడు 117 కేజీల వరకు ఉంటుంది.

భారత మార్కెట్లో విడుదలైన ఈ కొత్త బజాజ్ ప్లాటినా 100 ఎలక్ట్రిక్ స్టార్ట్ ఇప్పుడు అత్యంత సరసమైన ఎలక్ట్రిక్-స్టార్ట్ మోటార్ సైకిల్ కానుంది. బజాజ్ 100 ఎలక్ట్రిక్ స్టార్ట్ ఎంట్రీ-లెవల్ ప్యాసింజెర్ విభాగంలో ఉంచబడింది.
MOST READ:స్కూల్ బస్సులు యెల్లో కలర్లో ఉండటానికి కారణం ఏంటో తెలుసా.. అయితే ఇది చూడండి

ఈ బైక్ ఇప్పటికే అనేక కొత్త ఫీచర్స్ కలిగి ఉండటం వల్ల చాలామంది వినియోగదారులను ఆకర్షించడంలో ఉపయోగపడుతుంది. ఇప్పడు మంచి అమ్మకాలను సాగించడానికి దీని సరసమైన ధర కూడా తోడ్పడుతుంది.ఇది చూడటానికి చాలా ఆకర్షనీయంగా ఉండటంతో పాటు, వాహనదారులకు చాలా సౌకర్యంగా కూడా ఉంటుంది.