భారత్‌లో Benelli TRK 251 బైక్ కోసం బుకింగ్స్ ప్రారంభం; కేవలం రూ. 6,000 లకే..

ప్రముఖ ఇటాలియన్ ప్రీమియం మోటార్‌సైకిల్ బ్రాండ్ బెనెల్లీ (Benelli) భారత మార్కెట్లో మరో కొత్త బైక్ ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. బెనెల్లీ టిఆర్‌కె 251 (Benelli TRK 251) కొత్త అడ్వెంచర్ టూరింగ్ మోటార్‌సైకిల్ ను బెనెల్లీ త్వరలోనే విడుదల చేయనుంది. ఇందులో భాగంగా, కంపెనీ ఈ కొత్త మోడల్ కోసం దేశవ్యాప్తంగా బుకింగ్ లను కూడా ప్రారంభించింది. ఆసక్తిగల కస్టమర్లు రూ. 6,000 చెల్లించి ఈ బైక్ ను కంపెనీ వెబ్‌సైట్ ద్వారా కానీ లేదా బెనెల్లీ డీలర్‌షిప్ ల నుండి కానీ బుక్ చేసుకోవచ్చు.

భారత్‌లో Benelli TRK 251 బైక్ కోసం బుకింగ్స్ ప్రారంభం; కేవలం రూ. 6,000 లకే..

కొత్త బెనెల్లీ టిఆర్‌కె 251 బైక్ డెలివరీలు జనవరి 2022 నుండి ప్రారంభం కానున్నాయి. రాబోయే వారాల్లో కంపెనీ దీని ధర ఇతర వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. బెనెల్లీ టిఆర్‌కె 251 బైక్ ను కంపెనీ ఇటు ఆన్-రోడ్ మరియు అటు ఆఫ్-రోడ్ ప్రయోజనం కోసం రూపొందించింది. అడ్వెంచర్ టూరర్ మోటార్‌సైకిల్ విభాగంలో వచ్చిన ఈ బైక్ మూడు కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉండనుంది. ఇది అంతర్జాతీయ మార్కెట్లలో బెనెల్లీ విక్రయిస్తున్న టిఆర్‌కె 251 బైక్ మాదిరిగానే ఉంటుంది.

భారత్‌లో Benelli TRK 251 బైక్ కోసం బుకింగ్స్ ప్రారంభం; కేవలం రూ. 6,000 లకే..

బెనెల్లీ ఇండియా ఇటీవలే ఈ కొత్త టిఆర్‌కె 251 యొక్క టీజర్ ను విడుదల చేసింది. ఈ టీజర్ ను గమనిస్తే, గ్లోబల్ మోడల్ కి ఇండియన్ మోడల్ కి డిజైన్ పరంగా పెద్ద తేడా లేదని తెలుస్తోంది. బెనెల్లీ 2014 ప్రారంభంలో తన మొదటి మోటార్‌సైకిల్‌ను భారతదేశంలో విడుదల చేయడానికి ముందు, ఇక్కడి మార్కెట్లో 250 సీసీ నుండి 600 సీసీ శ్రేణిలో 7 కొత్త బైక్‌ లను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. బెనెల్లీ ఇండియా గడచిన నాలుగేళ్లలో ఈ 7 బైక్‌ లలో ఇప్పటికే 2021 సంవత్సరంలో 4 మోటార్‌సైకిళ్లను లాంచ్ చేసింది. కాగా, ఇప్పుడు తమ 5వ మోటార్‌సైకిల్‌ ను త్వరలో విడుదల చేయబోతోంది.

భారత్‌లో Benelli TRK 251 బైక్ కోసం బుకింగ్స్ ప్రారంభం; కేవలం రూ. 6,000 లకే..

డిజైన్ పరంగా చూస్తే, కొత్త బెనెల్లీ టిఆర్‌కె 251 అడ్వెంచర్ 250 సీసీ మోటార్‌సైకిల్ దాని పెద్దన్న అయిన బెనెల్లీ టిఆర్‌కె 502 అడ్వెంచర్ టూరర్ 500 సీసీ బైక్ మాదిరిగానే ఉంటుంది. కంపెనీ దీనిని స్టీల్ ట్యూబ్ ట్రేల్లిస్ ఫ్రేమ్‌ పై నిర్మించింది. బెనెల్లీ టిఆర్‌కె 251 లో 17 ఇంచ్ మల్టీ స్పోక్ అల్లాయ్‌ వీల్స్, ముందు వైపు 110/70 ప్రొఫైల్ టైర్ మరియు వెనుక వైపు 150/60 ప్రొఫైల్ టైర్లను కలిగి ఉంటుంది.

భారత్‌లో Benelli TRK 251 బైక్ కోసం బుకింగ్స్ ప్రారంభం; కేవలం రూ. 6,000 లకే..

ఇందులోని మెకానికల్స్ ను గమనిస్తే, ముందు భాగంలో 41 మిమీ అప్‌సైడ్ డౌన్ ఫోర్క్స్ మరియు వెనుక వైపు 51 మిమీ మోనోషాక్ సస్పెన్షన్ సెటప్ ఉంటాయి. అలాగే, బ్రేకింగ్ విషయానికి వస్తే ముందు భాగంలో 4 పిస్టన్ కాలిపర్ తో కూడిన 280 మిమీ సింగిల్ ఫ్లోటింగ్ డిస్క్ మరియు వెనుక భాగంలో సింగిల్ పిస్టన్ కాలిపర్ తో కూడిన 240 మిమీ డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. ఇవి రెండూ ఏబిఎస్ ఫీచర్ ను సపోర్ట్ చేస్తాయి.

భారత్‌లో Benelli TRK 251 బైక్ కోసం బుకింగ్స్ ప్రారంభం; కేవలం రూ. 6,000 లకే..

ఈ బైక్ లోని ప్రధాన ఫీచర్లను గమనిస్తే, ఎల్ఈడి హెడ్‌ల్యాంప్‌లు, విలక్షణమైన ఫ్రంట్ మడ్‌గార్డ్ మరియు పొడవాటి విండ్‌షీల్డ్‌ వంటి అంశాలు ఉన్నాయి. రెయిజ్డ్ ఫ్రంట్ డిజైన్, ఎత్తులో అమర్చిన సైలెన్సర్, పొడవాటి వైజర్, లో రైడర్ సీట్ హైట్, నకల్ గార్డ్స్ మరియు నేక్డ్ బాడీతో ఇదొక ఉత్తమైన ఆఫ్-రోడర్‌గా ఉంటుంది. ఇందులో మరొక ప్రధాన ఆకర్షణ దాని పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఇది రైడర్ కు కావల్సిన అన్ని రకాల సమాచారాన్ని తెలియజేస్తుంది.

భారత్‌లో Benelli TRK 251 బైక్ కోసం బుకింగ్స్ ప్రారంభం; కేవలం రూ. 6,000 లకే..

ఇంకా ఇందులోని స్ప్లిట్ పిలియన్ మరియు రైడర్ సీట్లు, లాంగ్ గ్రాబ్ హ్యాండిల్స్ మరియు కాంపాక్ట్ ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్ కూడా ఈ ఆఫ్-రోడర్ ఫీచర్లలో ఒక భాగంగా ఉంటాయి. ఇక బెనెల్లీ టిఆర్‌కె 251 ఇంజన్ విషయానికి వస్తే, ఇందులో 250 సిసి, లిక్విడ్-కూల్డ్, ఫోర్-స్ట్రోక్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 9,250 ఆర్‌పిఎమ్ వద్ద 26 బిహెచ్‌పి శక్తిని మరియు 8,000 ఆర్‌పిఎమ్ వద్ద 21 న్యూటన్ మీటర్ టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. ఈ కొత్త బైక్ ధర మరియు ఇతర వివరాల కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.

భారత్‌లో Benelli TRK 251 బైక్ కోసం బుకింగ్స్ ప్రారంభం; కేవలం రూ. 6,000 లకే..

Benelli 502C క్రూయిజర్ బైక్ విడుదల

ఇదిలా ఉంటే, ఈ ఏడాది జులై నెలలో బెనెల్లీ తమ సరికొత్త 502సి అర్బన్ క్రూయిజర్ మోటార్‌సైకిల్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ఆ సమయంలో దేశీయ విపణిలో బెనెల్లీ 502సి అర్బన్ క్రూయిజర్ ధర రూ. 4.98 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణణయించారు. బెనెల్లీ యొక్క అడ్వెంచర్ టూరర్ మోటార్‌సైకిల్ అయిన 502ఎక్స్ మోడల్ ను ఆధారంగా చేసుకునే ఈ క్రూయిజర్ బైక్ ను ప్రవేశపెట్టారు. ఇది అతి తక్కువ ప్యానెళ్లతో చాలా వరకూ నేక్డ్ మోటార్‌సైకిల్‌లా కనిపిస్తుంది.

భారత్‌లో Benelli TRK 251 బైక్ కోసం బుకింగ్స్ ప్రారంభం; కేవలం రూ. 6,000 లకే..

ముందు వైపు నుండి చూస్తే ఈ బైక్ డిజైన్ చాలా అగ్రెసివ్‌‌గా ఉంటుంది. ఈ క్రూయిజర్ బైక్‌ను బయటి నుండి కనిపించే ట్రేల్లిస్ ఫ్రేమ్‌పై నిర్మించారు. కంపెనీ దీనిని క్రూయిజర్ బైక్ అని చెబుతున్నప్పటికీ, చూడటానికి ఇది నేక్డ్ స్ట్రీట్‌ఫైటర్ మోటార్‌సైకిల్‌లా ఉంటుంది. ఈ బైక్‌లో చాలా తక్కువ సీటింగ్ స్పేస్ ఉంటుంది. బహుశా ఇది ఒక్క రైడర్ కోసం మాత్రమే డిజైన్ చేయబడినట్లుగా అనిపిస్తుంది. ఈ బైక్‌లో మజిక్యులర్ ఫ్యూయల్ ట్యాంక్, ఎల్‌ఈడి లైటింగ్, సౌకర్యవంతమైన సస్పెన్షన్ సెటప్, డబుల్ బ్యారెల్ స్టీల్ ఎగ్జాస్ట్ పైప్ మొదలైన అంశాలు ఉన్నాయి.

భారత్‌లో Benelli TRK 251 బైక్ కోసం బుకింగ్స్ ప్రారంభం; కేవలం రూ. 6,000 లకే..

బైక్ డిజైన్ అన్ని వైపుల నుండి కండలు తిరిగినట్లుగా మరియు మంచి రోడ్ ప్రెజెన్స్‌ని అందించే విధంగా ఉంది. ఇది మ్యాట్ కాగ్నాక్ రెడ్ మరియు మ్యాట్ బ్లాక్ అనే రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇక ఇంజన్ విషయానికి వస్తే, బెనెల్లీ 502సి బైక్ లో శక్తివంతంమైన 502 సిసి ట్విన్ సిలిండర్, డిఓహెచ్‌సి ఫ్యూయల్ ఇంజెక్ట్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 8500 ఆర్‌పిఎమ్ వద్ద 47.5 బిహెచ్‌పి శక్తిని మరియు 6000 ఆర్‌పిఎమ్ వద్ద 45 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్‌లో వాటర్ కూలింగ్ టెక్నాలజీ ఇవ్వబడింది.

Most Read Articles

English summary
Benelli india started accepting bookings for trk 251 engine specs features and details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X