దక్షిణ భారత్‌లో కొత్త డీలర్‌షిప్‌ ఓపెన్ చేసిన బెనెల్లీ; వివరాలు

భారతదేశంలో బెనెల్లీ కొత్త మోడళ్లను ప్రవేశపెట్టిన తరువాత దేశీయ మార్కెట్లో తన ఉనికిని మరింత బలోపేతం చెయడానికి ఇప్పుడు కొత్త డీలర్‌షిప్‌లను ఓపెన్ చేయడం ప్రారంభించింది. బెనెల్లీ కంపెనీ ఇప్పుడు దక్షిణ భారతదేశంలో పట్టు సాధించడానికి వెల్లూర్‌లో డీలర్‌షిప్‌లను ఓపెన్ చేసింది. బెనెల్లి కంపెనీ ఈ డీలర్‌షిప్‌లో ఇంపీరియల్ 400 బిఎస్ 6 ను ప్రదర్శిస్తున్నారు.

దక్షిణ భారత్‌లో కొత్త డీలర్‌షిప్‌ ఓపెన్ చేసిన బెనెల్లీ; వివరాలు

కొత్త డీలర్‌షిప్‌ ఓపెన్ చేయడంతో బుకింగ్స్ మరియు డెలివరీలు అక్కడే ప్రారంభమయ్యాయి. ఇది దేశవ్యాప్తంగా కంపెనీకి ఉన్న 38 వ ప్రత్యేక డీలర్‌షిప్. ఇటీవలే త్రిచి మరియు పుదుచ్చేరిలో కొత్త డీలర్‌షిప్‌లు ప్రారంభించబడ్డాయి, ఎందుకంటే దక్షిణ భారతదేశంలో మార్కెట్‌ను తయారు చేయడంలో కంపెనీ నిరంతరం కృషిచేస్తోంది.

దక్షిణ భారత్‌లో కొత్త డీలర్‌షిప్‌ ఓపెన్ చేసిన బెనెల్లీ; వివరాలు

కొత్త డీలర్షిప్ వెల్లూరులోని అలమేలుమంగపురం 374, 375 వద్ద ఉంది. జెసిఎస్ బివైకె ప్రైవేట్ లిమిటెడ్ డీలర్‌షిప్‌తో పాటు షోరూమ్‌ను ప్రారంభించినట్లు కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ వికాస్ జాబ్కా సంతోషం వ్యక్తం చేశారు.

MOST READ:ప్రజలపై 'గ్రీన్ టాక్స్' మోతకు కేంద్రం గ్రీన్ సిగ్నల్; ఏప్రిల్ 1 నుండి..

దక్షిణ భారత్‌లో కొత్త డీలర్‌షిప్‌ ఓపెన్ చేసిన బెనెల్లీ; వివరాలు

ఇంపీరియల్ 400 బిఎస్ 6 ను ప్రవేశపెట్టిన తరువాత, డీలర్‌షిప్‌ను విస్తరించాలని కంపెనీ నిరంతరం చూస్తోంది, కంపెనీకి చెందిన ఈ బైక్‌కు గొప్ప స్పందన వస్తోంది. కంపెనీ ఇండియన్ లైనప్‌లో ఇది చౌకైన మరియు అతిచిన్న మోడల్, కాబట్టి బెనెల్లి అభిమానులకు ఇది చాలా మంచి ఎంపిక.

దక్షిణ భారత్‌లో కొత్త డీలర్‌షిప్‌ ఓపెన్ చేసిన బెనెల్లీ; వివరాలు

బిఎస్ 6 ఇంపీరియల్ 400 ను బైకును రూ. 1.99 లక్షల ఎక్స్ షోరూమ్ వద్ద విక్రయిస్తున్నారు. ఈ బైక్ బుక్ చేసుకోవాలనుకులే వినియోగదారులు కేవలం 6000 రూపాయల ముందస్తు మొత్తాన్ని చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఇందుకోసం కస్టమర్లు వెల్లూర్ డీలర్‌షిప్‌లో బుక్ చేసుకోవచ్చు లేదా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు.

MOST READ:బైక్‌నే బస్సుపైకి తలపై మోసిన రియల్ బాహుబలి [వీడియో]

దక్షిణ భారత్‌లో కొత్త డీలర్‌షిప్‌ ఓపెన్ చేసిన బెనెల్లీ; వివరాలు

ఈ బైక్ రెడ్, బ్లాక్ మరియు సిల్వర్ వంటి మూడు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. అంతే కాకుండా ఇఎంఐ పద్ధతి ద్వారా ఈ బైక్ నెలకు 4999 రూపాయలు చెల్లించే అవకాశం కూడా ఉంది. ఈ విధమైన ఆఫర్లను ప్రవేశపెట్టడం వల్ల ఎక్కువమంది కస్టమర్లను ఆకర్షించవచ్చు.

దక్షిణ భారత్‌లో కొత్త డీలర్‌షిప్‌ ఓపెన్ చేసిన బెనెల్లీ; వివరాలు

ఈ ఆఫర్‌లతో ఇంపీరియల్ 400 కొనుగోలును సులభతరం చేయాలని కంపెనీ భావిస్తోంది. దీనితో పాటు 3 సంవత్సరాల అపరిమిత కిలోమీటర్ వారంటీ మరియు 2 సంవత్సరాల సప్లిమెంటరీ సర్వీస్ అందిస్తుంది.

MOST READ:కారు ఎక్కువ కాలం ఉపయోగించాలనుకుంటున్నారా.. అయితే ఈ టిప్స్ తప్పక పాటించాలి

దక్షిణ భారత్‌లో కొత్త డీలర్‌షిప్‌ ఓపెన్ చేసిన బెనెల్లీ; వివరాలు

రాబోయే కాలంలో బిఎస్ 6 అప్‌డేట్‌తో టిఆర్‌కె 502, టిఆర్‌కె 502 ఎక్స్, లియాన్‌సినో 500, 302 ఎస్, 302 ఆర్, లియాన్సినో 250, టిఎన్‌టి 600 ఐలను బెనెల్లీ తీసుకువస్తుందని కంపెనీ తెలిపింది. ఇప్పుడు ఈ సూపర్ బైక్‌లు ఎలా స్పందిస్తాయో చూడాలి. సాధారణంగా బెనెల్లీ బైకులు చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.

Most Read Articles

English summary
Benelli India Launches its 38th Exclusive Dealership in Vellore. Read in Telugu.
Story first published: Wednesday, January 27, 2021, 19:08 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X