బెనెల్లీ TRK 502X బైక్ ఇప్పుడు మరో కొత్త కలర్‌లో.. మరింత అదుర్స్ గురూ..!!

ఇటాలియన్ సూపర్‍‌బైక్ తయారీ సంస్థ బెనెల్లి (Benelli) ఇప్పటికే భారతీయ మార్కెట్లో తన కొత్త 2021 మోడల్ బిఎస్6 టిఆర్‌కె 502ఎక్స్ (TRK 502X) మోటార్‌సైకిల్‌ విడుదల చేసిన విషయం తెలిసందే, అయితే కంపెనీ ఈ బైక్ ను ఇప్పుడు మరో కొత్త ఆకర్షణీయమైన కలర్ లో తీసుకువచ్చింది. ఈ కొత్త కలర్ బెనెల్లి బిఎస్6 టిఆర్‌కె 502ఎక్స్ గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

బెనెల్లీ TRK 502X బైక్ ఇప్పుడు మరో కొత్త కలర్‌లో.. మరింత అదుర్స్ గురూ..!!

దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త టిఆర్‌కె 502ఎక్స్ ధర రూ. 5.19 లక్షలు. ఈ బైక్ ఇప్పుడు ఇంతకు ముందు మూడు (మెటాలిక్ డార్క్ గ్రే, రెడ్, ప్యూర్ వైట్‌) కలర్ ఆప్సన్స్ లో మాత్రమే అందుబాటులో ఉంది. అయితే ఇప్పుడు ఇది కొత్త అడ్వెంచర్ ఎల్లో కలర్ లో కూడా అందుబాటులో ఉంది, కావున ఇప్పుడు మొత్తం నాలుగు కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంది. ఈ కొత్త కలర్ ఆప్సన్ వినియోగదారులను మరింత ఎక్కువ ఆకర్షించే అవకాశం ఉంది అని ఆశిస్తున్నాము.

బెనెల్లీ TRK 502X బైక్ ఇప్పుడు మరో కొత్త కలర్‌లో.. మరింత అదుర్స్ గురూ..!!

బెనెల్లి శ్రేణిలో ఆఫ్-రోడ్ కిట్‌తో వచ్చిన రెండవ మోడల్ ఈ కొత్త TRK 502X బైక్. ఇది 500 సీసీ ఇంజిన్ తో అందుబాటులో ఉంటుంది. ఈ ఇంజిన్ బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా అప్డేట్ చేయబడి ఉంటుంది. ఈ ఇంజిన్ 8,500 ఆర్‌పిఎమ్ వద్ద 46.8 బిహెచ్‌పి శక్తిని మరియు 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 46 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఇది మంచి పనితీరుని అందిస్తుంది.

బెనెల్లీ TRK 502X బైక్ ఇప్పుడు మరో కొత్త కలర్‌లో.. మరింత అదుర్స్ గురూ..!!

బెనెల్లి టిఆర్‌కె 502ఎక్స్ మెరుగైన విజిబిలిటీ కోసం ఇందులో బ్యాక్‌లిట్ స్విచ్ గేర్‌ను ప్రవేశపెట్టారు, ఇప్పుడు ఇది రాత్రివేళల్లో ప్రకాశిస్తూ కనిపిస్తుంది. ఇంకా ఇందులో అల్యూమినియం ఫ్రేమ్ నకల్ గార్డ్స్, కొత్త హ్యాండిల్ బార్ గ్రిప్స్ మరియు రీడిజైన్ చేయబడిన రియర్ వ్యూ మిర్రర్స్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

బెనెల్లీ TRK 502X బైక్ ఇప్పుడు మరో కొత్త కలర్‌లో.. మరింత అదుర్స్ గురూ..!!

ఈ మోటార్‌సైకిల్‌లోని ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కూడా సర్దుబాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఇది ఆరెంజ్ ఎల్‌సిడి మరియు వైట్ బ్యాక్‌లిట్ అనలాగ్ టాకోమీటర్‌ను కలిగి ఉంటుంది. ఇది మునుపటి కన్నా కాస్తంత భిన్నంగా అనిపిస్తుంది. ఈ రోడ్-స్పెక్ వెర్షన్ మోడల్‌లో ముందు వైపు 19 ఇంచెస్ మరియు వెనుక వైపు 17 ఇంచెస్ స్పోక్ వీల్స్‌ను ఉపయోగించారు. ఇవి 220 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్‌ను అందిస్తాయి.

బెనెల్లీ TRK 502X బైక్ ఇప్పుడు మరో కొత్త కలర్‌లో.. మరింత అదుర్స్ గురూ..!!

ఈ బైక్‌లో 20 లీటర్ల పెద్ద ఇంధన ట్యాంక్ ఉంటుంది. కావున సుదూర ప్రాంతాలకు వెళ్లే వారికి ఇది చాలా అనుకూలంగా ఉంటుది. ఈ బైక్‌లో పెద్ద విండ్‌స్క్రీన్ మరియు కొత్త కాస్ట్ అల్యూమినియం రియర్ బాక్స్ బ్రాకెట్‌ కూడా ఉంటుంది. ఇది టూరింగ్ అవసరాలకు అనుగుణంగా ఉంటుంది.

బెనెల్లీ TRK 502X బైక్ ఇప్పుడు మరో కొత్త కలర్‌లో.. మరింత అదుర్స్ గురూ..!!

బ్రేకింగ్ విషయానికి వస్తే, ఇందులో ముందు వైపు రెండు పిస్టన్ కాలిపర్స్ ఫ్రంట్ అప్ ట్విన్ 320 మిమీ ఫ్లోటింగ్ డిస్కులు మరియు వెనుక వైపు సింగిల్ పిస్టన్ కాలిపర్‌తో 260 మిమీ డిస్క్ బ్రేక్‌లను ఉపయోగించారు. కావున ఇవి వేగంలో కూడా బైక్ ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడతాయి.

బెనెల్లీ TRK 502X బైక్ ఇప్పుడు మరో కొత్త కలర్‌లో.. మరింత అదుర్స్ గురూ..!!

బెనెల్లి కంపెనీ ఈ మధ్య కాలంలో దేశీయ మార్కెట్లో అనేక కొత్త మోడల్స్ విడుదల చేసింది. అయితే వీటి అమ్మకాలను పెంచుకోవడానికి దీని పరిధిని కూడా విస్తరిస్తూనే ఉంది. ఇందులో భాగంగానే కంపెనీ ఈ ఏడాది జమ్మూలో తన 42వ ఎక్స్‌క్లూజివ్ షోరూమ్‌ను ప్రారంభించింది.

బెనెల్లీ TRK 502X బైక్ ఇప్పుడు మరో కొత్త కలర్‌లో.. మరింత అదుర్స్ గురూ..!!

ఇదిలా ఉండగా బెనెల్లీ (Benelli) భారత మార్కెట్లో ఇటీవల ఎట్టకేలకు తన కొత్త ఎంట్రీ లెవల్ అడ్వెంచర్ మోటార్‌సైకిల్‌ 'బెనెల్లీ టిఆర్‌కె 251' విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త మోటార్‌సైకిల్‌ ప్రారంభ ధర రూ. రూ. 2.51 లక్షలు (ఎక్స్-షోరూమ్).

బెనెల్లీ TRK 502X బైక్ ఇప్పుడు మరో కొత్త కలర్‌లో.. మరింత అదుర్స్ గురూ..!!

బెనెల్లీ కంపెనీ విడుదల చేసిన ఈ కొత్త టిఆర్‌కె 251 బైక్ యొక్క ఫ్రీ బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభంమయ్యాయి. దీనికి కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు రూ. 6,000 చెల్లించి కంపెనీ యొక్క అధికారిక వెబ్‌సైట్‌లో లేదా సమీపంలోని బెనెల్లీ ఇండియా డీలర్‌షిప్‌లో బుక్ చేసుకోవచ్చు. డెలివెరీలు రానున్న కొత్త సంవత్సరంలో ప్రారంభమవుతాయి.

బెనెల్లీ TRK 502X బైక్ ఇప్పుడు మరో కొత్త కలర్‌లో.. మరింత అదుర్స్ గురూ..!!

దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త బెనెల్లీ టిఆర్‌కె 251 ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం ఫుల్లీ డిజిటల్ LCD డిస్‌ప్లేను పొందుతుంది. ఇది డ్రైవర్‌కు వివిధ రైడ్ సంబంధిత సమాచారాన్ని అందిస్తుంది. ఈ ఎంట్రీ-లెవల్ అడ్వెంచర్ మోటార్‌సైకిల్‌ 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ కూడా పొందుతుంది. కావున మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తుంది.

బెనెల్లీ TRK 502X బైక్ ఇప్పుడు మరో కొత్త కలర్‌లో.. మరింత అదుర్స్ గురూ..!!

కొత్త బెనెల్లీ టిఆర్‌కె 251 బైక్ లో లియోన్సినో 250 కి శక్తినిచ్చే అదే ఇంజన్‌ కలిగి ఉంటుంది. ఇది బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా అప్డేట్ చేయబడి ఉంటుంది. ఇది 250 సిసి సింగిల్-సిలిండర్, 4-వాల్వ్ ఇంజన్‌ని కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ 25.5 బిహెచ్‌పి పవర్ మరియు 21.2 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. ఇది మంచి పనితీరుని అందిస్తుంది. ఇది కూడా దేశీయ మార్కెట్లో మంచి ఆదరణ పొందుతుందని ఆశిస్తున్నాము.

Most Read Articles

English summary
Benelli trk 502x new color option launched details
Story first published: Monday, December 20, 2021, 11:28 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X