మీకు తెలుసా.. దేశీయ మార్కెట్లో లభిస్తున్న టాప్ 5 ఎలక్ట్రిక్ సైకిల్స్.. ఇవే

భారతదేశం అభివృద్ధిచెందుతున్న వేళ ఎలక్ట్రిక్ వాహనాలకు మంచి డిమాండ్ ఏర్పడింది. అయితే ఈ ఎలక్ట్రిక్ వాహన విభాగంలో కేవలం ఎలక్ట్రిక్ కార్లు మరియు ఎలక్ట్రిక్ బైకులు మాత్రమే కాకుండా ఎలక్ట్రిక్ సైకిల్స్ కూడా దేశీయ మార్కెట్లో మంచి ఆధారం పొందుతున్నాయి. ఈ నేపథ్యంలో భాగంగానే చాలా కంపెనీలు మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేస్తున్నాయి.

ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ లో భారతదేశంలో లభిస్తున్న టాప్ 5 ఎలక్ట్రిక్ సైకిల్స్ (ధరల వారిగా) గురించిన పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

మీకు తెలుసా.. దేశీయ మార్కెట్లో లభించిన టాప్ 5 ఎలక్ట్రిక్ సైకిల్స్.. ఇవే

Lectro Ezephyr TX 700C SS ఎలక్ట్రిక్ సైకిల్:

భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన సైకిల్స్ తయారీ దారు 'హీరో' కొత్త Lectro Ezephyr TX 700C SS దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త Lectro Ezephyr TX 700C SS ఎలక్ట్రిక్ సైకిల్ ధర దేశీయ మార్కెట్లో రూ. 21,000. ఇది వినియోగదారులకు చాలా సౌకర్యవంతమైన ఎలక్ట్రిక్ సైకిల్. ఇది చూడటానికి చాలా సింపుల్ గా ఉండి, అధునాతన ఫీచర్స్ కలిఙ్గి ఉంటుంది.

మీకు తెలుసా.. దేశీయ మార్కెట్లో లభించిన టాప్ 5 ఎలక్ట్రిక్ సైకిల్స్.. ఇవే

Lectro Ezephyr TX 700C SS ఎలక్ట్రిక్ సైకిల్ 250W, 36V హబ్ మోటార్ ఉపయోగిస్తుంది. దీనితో పాటు ఇది ఫ్రేమ్-ఇంటిగ్రేటెడ్ 5.8Ah లిథియం-అయాన్ బ్యాటరీని పొందుతుంది. ఈ బ్యాటరీ 40 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఈ సైకిల్ పూర్తి ఛార్జ్ కావడానికి పట్టే సమయం 4 గంటలు. ఈ సైకిల్ లో మల్టిఫుల్ రైడింగ్ మోడ్స్ ఉంటాయి. అయితే ఇందులోని మోడ్ ని బట్టి దీని పరిధి 25 కి.మీ నుంచి 40 కి.మీ పరిధిని అందిస్తుంది.

మీకు తెలుసా.. దేశీయ మార్కెట్లో లభించిన టాప్ 5 ఎలక్ట్రిక్ సైకిల్స్.. ఇవే

Nuze i1 ఎలక్ట్రిక్ సైకిల్:

Nuze i1 ఎలక్ట్రిక్ సైకిల్ భారతీయ మార్కెట్లో లభిస్తున్న అత్యుత్తమ ఎలక్ట్రిక్ సైకిల్స్ లో ఒకటి. దీని ధర దేశీయ మార్కెట్లో రూ. 30,616. ఈ ఎలక్ట్రిక్ సైకిల్ రోజు వారీ ప్రయాణానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ స్కూటర్ చూడటానికి స్టైలిష్ గా ఉండి, వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

మీకు తెలుసా.. దేశీయ మార్కెట్లో లభించిన టాప్ 5 ఎలక్ట్రిక్ సైకిల్స్.. ఇవే

Nuze i1 ఎలక్ట్రిక్ సైకిల్ 5.2 యాంపియర్ లిథియం-అయాన్ ఇంటిగ్రేటెడ్ బ్యాటరీని ఉపయోగిస్తుంది, ఇది పెడల్ అసిస్ట్ మోడ్‌లో 25 కి.మీ నుంచి 30 కి.మీ పరిధిని అందిస్తుంది. అదేవిధంగా ఇందులోని త్రాటల్ మోడ్‌ 22 కిమీ నుంచి 25 కిమీ పరిధిని అందిస్తుంది. ఈ Nuze i1 ఎలక్ట్రిక్ సైకిల్ పూర్తి ఛార్జ్ కావడానికి పట్టే సమయం 3 నుంచి 4 గంటలు. ఈ సైకిల్ రెండు చివర్లలో డిస్క్ బ్రేక్‌లు, ఫ్రంట్ సస్పెన్షన్ వంటి ఇతర అప్డేటెడ్ ఫీచర్స్ కలిగి ఉంటుంది.

మీకు తెలుసా.. దేశీయ మార్కెట్లో లభించిన టాప్ 5 ఎలక్ట్రిక్ సైకిల్స్.. ఇవే

Toutche Electric Heileo M100 ఎలక్ట్రిక్ సైకిల్:

రూ. 49,900 ధర వద్ద అధునాతన ఫీచర్స్ కలిగిన ఎలక్ట్రిక్ సైకిల్ ఈ Toutche Electric Heileo M100. ఇది చూడటానికి ఆకర్షణీయంగా మరియు స్టైలిష్ గా ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ సైకిల్ ఆఫ్‌-రోడింగ్ చేయటానికి మరియు సిటీ రైడింగ్‌కు చాలా అనుకూలంగా ఉంటుంది.

మీకు తెలుసా.. దేశీయ మార్కెట్లో లభించిన టాప్ 5 ఎలక్ట్రిక్ సైకిల్స్.. ఇవే

Toutche Electric Heileo M100 ఎలక్ట్రిక్ సైకిల్ 10.4Ah, 36V లిథియం అయాన్ డిటాచబుల్ బ్యాటరీతో శక్తినిస్తుంది. ఇది త్రాటల్ మోడ్ లో 60 కిమీ పరిధిని మరియు పెడల్ అసిస్ట్ మోడ్ లో 50 కిమీ పరిధిని అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ సైకిల్ ఒక సరి ఛార్జ్ చేసుకోవడానికి 2.5 గంటల సమయం పడుతుంది.

మీకు తెలుసా.. దేశీయ మార్కెట్లో లభించిన టాప్ 5 ఎలక్ట్రిక్ సైకిల్స్.. ఇవే

EMotorad EMX ఎలక్ట్రిక్ సైకిల్:

ఈ జాబితాలో రూ. 54,999 ధర వద్ద లభిస్తున్న ఎలక్ట్రిక్ సైకిల్ EMotorad EMX. ఇది ధరకు తగిన ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ సైకిల్ యొక్క ముందు మరియు వెనుక భాగంలో ఫ్రీలోడ్ అడ్జస్టబుల్ సెగ్మెంట్-ఫస్ట్ డ్యూయల్-సస్పెన్షన్ సెటప్ అందుబాటులో ఉంటుంది.

మీకు తెలుసా.. దేశీయ మార్కెట్లో లభించిన టాప్ 5 ఎలక్ట్రిక్ సైకిల్స్.. ఇవే

EMotorad EMX ఎలక్ట్రిక్ సైకిల్ 10.4Ah లిథియం-అయాన్ బ్యాటరీని పొందుతుంది. ఈ బ్యాటరీ డిటచబుల్. కావున దీనిని ఎక్కడైనా బయటకు తీసి ఛార్జ్ చేసుకోవచ్చు. అయితే ఈ ఎలక్ట్రిక్ సైకిల్ ఛార్జ్ చేయడానికి పట్టే సమయం 4 నుంచి 5 గంటలు. ఈ సైకిల్ పరిధి విషయానికి వస్తే పెడల్ అసిస్ట్ ఉపయోగించి 65 కి.మీ.ల పరిధిని మరియు త్రాటల్ లో 50 కిమీ పరిధిని అందిస్తుంది.

మీకు తెలుసా.. దేశీయ మార్కెట్లో లభించిన టాప్ 5 ఎలక్ట్రిక్ సైకిల్స్.. ఇవే

Hero Lectro EHX20 ఎలక్ట్రిక్ సైకిల్:

మనం చెప్పుకుంటున్న టాప్ 5 ఎలక్ట్రిక్ సైకిల్స్ జాబితాలో అత్యధిక ధర కలిగిన ఎలక్ట్రిక్ సైకిల్ ఈ Hero Lectro EHX20. దీని ధర రూ. 1.3 లక్షలు. ఈ ఎలక్ట్రిక్ సైకిల్ డిమాచబుల్ బ్యాటరీ మరియు మిడ్-మౌంటెడ్ మోటార్‌తో వస్తుంది, ఇది మంచ్చి పర్ఫామెన్స్ అందించడానికి చాలా అనుకూలంగా ఉంటుంది.

మీకు తెలుసా.. దేశీయ మార్కెట్లో లభించిన టాప్ 5 ఎలక్ట్రిక్ సైకిల్స్.. ఇవే

Hero Lectro EHX20 ఎలక్ట్రిక్ సైకిల్ లోని బ్యాటరీ బరువు 2 కేజీల కంటే తక్కువ, కావున దీనిని చార్జ్ చేయడానికి పట్టే సమయం కేవలం 3 నుంచి 5 గంటలు మాత్రమే. ఈ ఎలక్ట్రిక్ సైకిల్ ఒక చార్జ్ తో దాదాపు 80 కిమీ పరిధిని అందిస్తుంది. ఈ సైకిల్ లేటెస్ట్ ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. ఇందులో భాగంగానే కంపెనీ ఇందులో డిజిటల్ డిస్‌ప్లేను కూడా అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ సైకిల్ వినియోగాదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

భారతదేశంలో అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ సైకిల్స్ వాటి ధరలు మరియు ఫీచర్స్ వంటివి తెలుసుకున్నారు కదా.. దీనిపై మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోడానికి కింద కామెంట్స్ చేయండి. మరిన్ని కొత్త వాహనాలకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మా ఛానల్ ఫాలో అవ్వండి.

Most Read Articles

English summary
Best electric bicycles in indian market list details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X