భారత్‌లో విడుదల కానున్న బర్డ్ ఇఎస్1 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని, ఈ విభాగంలోని అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఆనేక కొత్త ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థలు ఇక్కడి మార్కెట్లోకి ప్రవేశిస్తున్నాయి. తాజాగా, బర్డ్ గ్రూప్‌కి చెందిన అనుబంధ సంస్థ బర్డ్ ఎలక్ట్రిక్ మొబిలిటీ భారత మార్కెట్లో తమ ఎలక్ట్రిక్ టూవీలర్లను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది.

భారత్‌లో విడుదల కానున్న బర్డ్ ఇఎస్1 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్

బర్డ్ మొబిలిటీ దేశంలో తమ తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ ఇఎస్1 ప్లస్ (ES1 +)ను విడుదల చేయాలని యోచిస్తోంది. ఈ స్కూటర్ యొక్క అధికారిక వివరాలు ఇంకా వెల్లడి కానప్పటికీ, 2021 మధ్య నాటికి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ దేశీయ మార్కెట్లో విడుదల కావచ్చని అంచనా.

భారత్‌లో విడుదల కానున్న బర్డ్ ఇఎస్1 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్

ప్రారంభంలో, భాగంగా, బర్డ్ ఇఎస్1 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో అందుబాటులోకి వస్తుందని సమాచారం. ఆ తర్వాతి కాలంలో ఇది ఇతర టైర్ I మరియు టైర్ II నగరాల్లోకి అందుబాటులోకి రానుంది. బ్రడ్ గ్రూప్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను చైనా నుండి సికెడి (కంప్లీట్లీ నాక్డ్ డౌన్) రూట్‌లో భారతదేశానికి విడిభాగాలుగా దిగుమతి చేసుకొని, ఇక్కడే అసెంబుల్ చేయనుంది.

MOST READ:13,000 యూనిట్లు దాటిన హోండా సిబి350 అమ్మకాలు

భారత్‌లో విడుదల కానున్న బర్డ్ ఇఎస్1 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్

ఈ కొత్త బర్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీ గతేడాది ఆరంభంలో జరిగిన 2020 ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించింది. భారత మార్కెట్లో దీని పరిచయ ధర సుమారు 50,000 రూపాయలు (ఎక్స్-షోరూమ్) ఉండొచ్చని అంచనా. ఒకవేళ ఇది ఈ ధర వద్ద ప్రారంభించబడినట్లయితే, బర్డ్ ఇఎస్1 ప్లస్ దేశంలోనే అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల్లో ఒకటిగా ఉంటుంది.

భారత్‌లో విడుదల కానున్న బర్డ్ ఇఎస్1 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్

బర్డ్ గ్రూప్ నుండి రానున్న ఇఎస్1 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్, సూపర్ సోకో బ్రాండ్ ఆవిష్కరించిన క్యుక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు రీడిజైన్డ్ వెర్షన్‌గా అనిపిస్తుంది. ఇందులో షార్ప్‌గా డిజైన్ చేసిన ఎల్‌ఇడి హెడ్‌ల్యాంప్ మరియు ఎల్‌ఇడి టెయిల్ ల్యాంప్స్, స్ప్లిట్ సీట్ మరియు ఎల్‌సిడి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

MOST READ:సి5 ఎయిర్‌క్రాస్ లాంచ్ డేట్ ఫిక్స్ చేసిన సిట్రోయెన్; వివరాలు

భారత్‌లో విడుదల కానున్న బర్డ్ ఇఎస్1 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్

కొలతల ప్రకారం, బర్డ్ కంపెనీ నుండి రానున్న ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ పొడవు 1782 మిమీ, వెడల్పు 727 మిమీ మరియు ఎత్తు 1087 మిమీగా ఉంటుంది. ఇది 720 మిమీ సీట్ హైట్‌ను కలిగి ఉండి, 1217 మిమీ పొడవైన వీల్‌బేస్‌ను కలిగి ఉంటుంది. ఈ స్కూటర్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ 140 మిమీగా ఉంటుంది.

భారత్‌లో విడుదల కానున్న బర్డ్ ఇఎస్1 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్

బర్డ్ ఇఎస్1 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ఇరువైపులా 12 ఇంచ్ వీల్స్ ఉపయోగించారు. ఇందులో ముందు మరియు వెనుక వైపున డిస్క్ బ్రేక్స్ అమర్చారు. ఈ స్కూటర్ మొత్తం బరువు 62 కిలోలుగా ఉంటుంది. సస్పెన్షన్ విషయానికి వస్తే, ముందు వైపు టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక వైపు ట్విన్ స్ప్రింగ్ షాక్ అబ్జార్బర్స్‌ను ఉపయోగించారు.

MOST READ:ఆడి క్యూ 7 లగ్జరీ కార్ కొన్న నటుడు చందు గౌడ

భారత్‌లో విడుదల కానున్న బర్డ్ ఇఎస్1 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్

ఇక ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ విషయానికి వస్తే, ఇది 1.6 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటార్ మరియు 3 ఆంపియర్ లిథియం అయాన్ బ్యాటరీలతో పనిచేస్తుంది. పూర్తి ఛార్జ్‌పై ఇది 55 కిలోమీటర్ల రేంజ్‌ను ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది. దీని గరిష్ట వేగం గంటకు 45 కిలోమీటర్లుగా ఉంటుంది.

Source: electricvehicleweb

Most Read Articles

English summary
Bird Mobility To Launch ES1+ Electric Scooter In India, Details. Read In Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X