అక్టోబర్ 12న భారత్‌లో విడుదల కానున్న BMW C400GT మాక్సీ స్కూటర్: పూర్తి వివరాలు

భారత టూవీలర్ మార్కెట్లో స్కూటర్లు రూపాంతరం చెందుతున్నాయి. ఒకప్పుడు ట్రెడిషనల్ స్కూటర్లకు మాత్రమే ప్రాధాన్యతనిచ్చిన భారతీయ వినియోగదారులు, ఇప్పుడు మరింత స్పోర్టీ మరియు హై-పెర్ఫార్మెన్స్ స్కూటర్లను కోరుకుంటున్నారు. కస్టమర్ల అభిరుచికి అనుగుంగా, ఆటోమొబైల్ కంపెనీలు కూడా అధునాతన స్కూటర్లను ఇక్కడి మార్కెట్లో ప్రవేశపెడుతున్నాయి.

అక్టోబర్ 12న భారత్‌లో విడుదల కానున్న BMW C400GT మాక్సీ స్కూటర్: పూర్తి వివరాలు

తాజాగా, భారతదేశంలో మాక్సీ స్కూటర్లకు డిమాండ్ జోరందుకుంది. ఈ విభాగంలో ఇప్పటికే సుజుకి (బర్గ్‌మ్యాన్) మరియు యమహా (ఏరో155) సంస్థలు కొత్త ఉత్పత్తులను అందిస్తుండగా, ఇప్పుడు లేటెస్ట్ గా జర్మన్ లగ్జరీ టూవీలర్ బ్రాండ్ బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్ (BMW motorrad) మరో కొత్త ఉత్పత్తిని ప్రవేశపెట్టబోతోంది.

అక్టోబర్ 12న భారత్‌లో విడుదల కానున్న BMW C400GT మాక్సీ స్కూటర్: పూర్తి వివరాలు

బిఎమ్‌డబ్ల్యూ మోటోరాడ్ తమ మాక్సీ స్కూటర్ సి400జిటి (BMW C400GT) ను భారతదేశంలో విడుదల చేయబోయే తేదీని వెల్లడించింది. బిఎమ్‌డబ్ల్యూ సి400జిటి ప్రీమియం మాక్సీ-స్కూటర్ కంపెనీ అక్టోబర్ 12, 2021వ తేదీ దేశీయ మార్కెట్లో విడుదల చేయనున్నట్లు కంపెనీ తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా అధికారికంగా ధృవీకరించింది.

అక్టోబర్ 12న భారత్‌లో విడుదల కానున్న BMW C400GT మాక్సీ స్కూటర్: పూర్తి వివరాలు

బిఎమ్‌డబ్ల్యూ సి400జిటి ఈ బ్రాండ్ కు భారతదేశంలో మొట్టమొదటి స్కూటర్ అవుతుంది. అంతేకాదు, ఇది భారత మార్కెట్లోనే అత్యంత ప్రీమియం స్కూటర్‌ గా ఉండబోతోంది. మార్కెట్ అంచనా ప్రకారం, ఈ మాక్సీ స్కూటర్ ధర సుమారు రూ. 5 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంటుందని సమాచారం. కంపెనీ ఇప్పటికే ఈ స్కూటర్ కోసం లక్ష రూపాయల టోకెన్ అడ్వాన్స్‌ తో బుకింగ్ లను ప్రీ-బుకింగ్ లను కూడా ప్రారంభించింది.

అక్టోబర్ 12న భారత్‌లో విడుదల కానున్న BMW C400GT మాక్సీ స్కూటర్: పూర్తి వివరాలు

కొత్త BMW C400GT భారతదేశంలోనే ఇప్పటివరకు తయారు చేయబడని అత్యంత శక్తివంతమైన స్కూటర్ గా ఉంటుంది. ఇది సుజుకి బర్గ్‌మన్ స్ట్రీట్ 125, అప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160 మరియు యమహా ఏరో155 మాదిరిగా కాకుండా ఇది చాలా ప్రత్యేకమైన సమర్పణ అవుతుంది. ఈ స్కూటర్‌లో చాలా విశిష్టమైన ఫీచర్లు ఇవ్వబడ్డాయి మరియు ఇది హైవేపై నడపడానికి చాలా అనువుగా ఉంటుంది.

అక్టోబర్ 12న భారత్‌లో విడుదల కానున్న BMW C400GT మాక్సీ స్కూటర్: పూర్తి వివరాలు

బిఎమ్‌డబ్ల్యూ సి400జిటి మజిక్యులర్ బాడీ ప్యానెల్స్‌ తో మ్యాక్సి-స్కూటర్ బాడీ స్టైల్ ని కలిగి ఉంటుంది. ట్రెడిషన్ స్కూటర్ల మాదిరిగానే, దీని ఇంజన్ సైడ్ లో ఉంటుంది. ఇందులో పొడవైన విండ్‌స్క్రీన్, పుల్-బ్యాక్ హ్యాండిల్‌బార్, పెద్ద స్టెప్ సీట్ మరియు డ్యూయల్ ఫుట్‌రెస్ట్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ స్కూటర్ యొక్క రైడింగ్ పొజిషన్ చాలా సౌకర్యవంతంగా ఉంటుంది మరియు దూర ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది.

అక్టోబర్ 12న భారత్‌లో విడుదల కానున్న BMW C400GT మాక్సీ స్కూటర్: పూర్తి వివరాలు

ఈ స్కూటర్ లో లభించే కొన్ని ప్రత్యేకమైన ఎలక్ట్రానిక్ మరియు రైడ్ అసిస్ట్ ఫీచర్లలో పూర్తి ఎల్ఈడి లైటింగ్, కీలెస్ ఇగ్నిషన్, హీటెడ్ గ్రిప్స్, హీటెడ్ సీట్లు, ఏబిఎస్, యాంటీ-థెఫ్ట్ అలారం సిస్టమ్ మరియు బ్లూటూత్-ఎనేబుల్డ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మొదలైనవి ఉన్నాయి. ఇవే కాకుండా, ఇందులో రైడ్-బై-వైర్ థ్రోటల్, ట్రాక్షన్ కంట్రోల్ మరియు మల్టిపుల్ రైడింగ్ మోడ్‌లు వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

అక్టోబర్ 12న భారత్‌లో విడుదల కానున్న BMW C400GT మాక్సీ స్కూటర్: పూర్తి వివరాలు

ఇంజన్ విషయానికి వస్తే, బిఎమ్‌డబ్ల్యూ సి400జిటి మాక్సి స్కూటర్ లో శక్తివంతమైన ఇంజన్ ఇన్‌స్టాల్ చేయబడి ఉంటుంది. ఈ స్కూటర్ లోని 350 సిసి, సింగిల్ సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజన్‌ గరిష్టంగా 33.5 బిహెచ్‌పి పవర్ ను మరియు 35 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజన్ పరంగా చూస్తే, బిఎమ్‌డబ్ల్యూ సి400జిటి భారతదేశంలోనే అత్యంత శక్తివంతమైన స్కూటర్ అవుతుంది.

అక్టోబర్ 12న భారత్‌లో విడుదల కానున్న BMW C400GT మాక్సీ స్కూటర్: పూర్తి వివరాలు

బిఎమ్‌డబ్ల్యూ సి400జిటి మాక్సి స్కూటర్ కి ప్రస్తుతం భారత మార్కెట్లో ఎలాంటి ప్రత్యక్ష పోటీ లేదు. ఒకవేళ హోండా భారత మార్కెట్లో తమ ఫోర్జా 350 స్కూటర్ ని విడుదల చేసినట్లయితే, ఇది పోటీపడే అవకాశం ఉంది. అయితే, ఈ విషయంపై హోండా నుండి ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు.

అక్టోబర్ 12న భారత్‌లో విడుదల కానున్న BMW C400GT మాక్సీ స్కూటర్: పూర్తి వివరాలు

ఫ్యూచర్ మొబిలిటీపై బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్ ఆసక్తి

ఇదిలా ఉంటే, బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్ ఫ్యూచర్ మొబిలిటీపై కూడా పనిచేస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా, కంపెనీ ఈ విభాగంలోకి ప్రవేశించేందుకు ఆసక్తి చూపుతోంది. ఇందులో భాగంగానే, అర్బన్ మొబిలిటీ కోసం కంపెనీ ఇటీవల ఎలక్ట్రిక్ సైకిల్‌ను కూడా విడుదల చేసింది. ఇది చూడటానికి చిన్నసైజు మోటార్‌సైకిల్‌లా కనిపించే ఎలక్ట్రిక్ సైకిల్, ఇందులో గేర్లకు బదులుగా రైడింగ్ మోడ్‌లు ఉంటాయి.

అక్టోబర్ 12న భారత్‌లో విడుదల కానున్న BMW C400GT మాక్సీ స్కూటర్: పూర్తి వివరాలు

ఈ సరికొత్త ఎలక్ట్రిక్ సైకిల్ పేరు బిఎమ్‌బ్ల్యూ ఐ విజన్ యాంబీ (BMW i Vision AMBY). ఇదొక బ్యాటరీ ఆపరేటెడ్ పెడల్ ఎలక్ట్రిక్ సైకిల్. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఇది సింగిల్ చార్జ్ పై గరిష్టంగా 300 కిలోమీటర్ల రేంజ్ ను ఆఫర్ చేస్తుందని కంపెనీ చెబుతోంది. ఇందులో 2,000 Wh లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది, దీని టాప్ స్పీడ్ గరిష్టంగా గంటకు 60 కిలోమీటర్ల వరకూ ఉంటుంది. అంటే, ఇది స్టాండర్డ్ పెట్రోల్ పవర్డ్ బైక్ లకు ఏమాత్రం తీసిపోదన్నమాట.

అక్టోబర్ 12న భారత్‌లో విడుదల కానున్న BMW C400GT మాక్సీ స్కూటర్: పూర్తి వివరాలు

బిఎమ్‌బ్ల్యూ ఐ విజన్ యాంబీ ఎలక్ట్రిక్ సైకిల్ మూడు స్పీడ్ రేటింగ్‌లను కలిగి ఉంటుంది. దీని స్పీడ్ ను సైకిల్ ట్రాక్‌‌ల కోసం 25 కెఎంపిహెచ్ సిటీ రోడ్ల కోసం 45 కెఎంపిహెచ్ మరియు మల్టీ లేన్ రోడ్స్ (హైవేల) కోసం 60 కెఎంపిహెచ్ గా రేట్ చేయబడింది. అయితే, ఈ సైకిల్ ను హైవేలపై మరియు గంటకు 25 కెఎంపిహెచ్ కన్నా ఎక్కువ వేగంతో నడపాలంటే మాత్రం, డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి.

Most Read Articles

English summary
Bmw c400gt maxi scooter india launch date reveled price specs feature booking details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X