మొట్టమొదటి బిఎమ్‌డబ్ల్యూ ఎలక్ట్రిక్ స్కూటర్‌ ఆవిష్కరణ; రేంజ్ ఎంతో తెలుసా?

జర్మన్ లగ్జరీ టూవీలర్ బ్రాండ్ బిఎమ్‌డబ్ల్యూ మోటోరాడ్ తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అధికారికంగా ఆవిష్కరించింది. బిఎమ్‌డబ్ల్యూ సిఈ04 అనే పేరుతో పరిచయం చేసిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కంపెనీ అత్యధిక బ్యాటరీ రేంజ్‌తో అభివృద్ధి చేసినట్లు తెలిపింది.

మొట్టమొదటి బిఎమ్‌డబ్ల్యూ ఎలక్ట్రిక్ స్కూటర్‌ ఆవిష్కరణ; రేంజ్ ఎంతో తెలుసా?

గత ఏడాది నవంబర్‌లో జరిగిన ఐఐసిఎంఎ మోటార్ షోలో బిఎమ్‌డబ్ల్యూ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కాన్సెప్ట్ రూపంగా ప్రదర్శించింది. ఈ కాన్సెప్ట్‌ను అనుసరించి, కంపెనీ ఇప్పుడు ఇందులో ప్రొడక్షన్ వెర్షన్‌ను తయారు చేసింది. మరికొద్ది నెలల్లోనే ఇది అధికారికంగా విడుదలయ్యే అవకాశం ఉంది.

మొట్టమొదటి బిఎమ్‌డబ్ల్యూ ఎలక్ట్రిక్ స్కూటర్‌ ఆవిష్కరణ; రేంజ్ ఎంతో తెలుసా?

సాంప్రదాయ స్కూటర్లతో పోలిస్తే, ఈ సరికొత్త బిఎమ్‌డబ్ల్యూ సిఈ04 ఎలక్ట్రిక్ స్కూటర్ పూర్తిగా విభిన్నమైన స్టైల్, మోడ్రన్ డిజైన్ మరియు అత్యాధునిక సాంకేతిక ఫీచర్లతో రూపొందించబడింది. బిఎమ్‌డబ్ల్యూ ఇటీవలే ఈ స్కూటర్‌కు రోడ్లపై రియల్ వరల్డ్ టెస్టులు కూడా నిర్వహించింది.

మొట్టమొదటి బిఎమ్‌డబ్ల్యూ ఎలక్ట్రిక్ స్కూటర్‌ ఆవిష్కరణ; రేంజ్ ఎంతో తెలుసా?

బిఎమ్‌డబ్ల్యూ సిఈ04 ఎలక్ట్రిక్ స్కూటర్ స్కేట్ బోర్డ్ మాదిరిగా డిజైన్ చేయబడింది. కంపెనీ దీని తయారీలో డాప్లర్ ఫ్రేమ్‌ను ఉపయోగించింది. ఇది డ్రాస్ట్రింగ్‌తో కప్పబడినట్లుగా కనిపిస్తుంది మరియు ఇందు కోసం కంపెనీ పెద్దగా కనిపించే ప్యానెళ్లను ఉపయోగించింది.

మొట్టమొదటి బిఎమ్‌డబ్ల్యూ ఎలక్ట్రిక్ స్కూటర్‌ ఆవిష్కరణ; రేంజ్ ఎంతో తెలుసా?

ఈ స్కూటర్‌లో ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లతో కూడిన 'వి' ఆకారపు హెడ్‌ల్యాంప్, సింగిల్ పీస్ సీట్, మల్టీ-లేయర్ ఫ్లోర్ బోర్డ్ మరియు కొంచెం ఎక్కువ ఎత్తులో ఉండే హ్యాండిల్‌బార్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ స్కూటర్‌లో ఎలక్ట్రిక్ మోటార్ మరియు బ్యాటరీలను భద్రత కోసం స్కూటర్ లోపల ఉంచబడతాయి.

మొట్టమొదటి బిఎమ్‌డబ్ల్యూ ఎలక్ట్రిక్ స్కూటర్‌ ఆవిష్కరణ; రేంజ్ ఎంతో తెలుసా?

బిఎమ్‌డబ్ల్యూ సిఈ04 ఇ-స్కూటర్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. అవి: స్టాండర్డ్ మరియు అవాంట్‌గార్డ్ స్టైల్. ఇందులోని స్టాండర్డ్ వేరియంట్ వైట్ మరియు మ్యాట్ బ్లాక్ కలర్లలో లభిస్తుంది. కాగా, అవాంట్‌గార్డ్ స్టైల్ వేరియంట్ గ్రే మెటాలిక్ మరియు బ్లాక్ / ఆరెంజ్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

మొట్టమొదటి బిఎమ్‌డబ్ల్యూ ఎలక్ట్రిక్ స్కూటర్‌ ఆవిష్కరణ; రేంజ్ ఎంతో తెలుసా?

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను బ్లాక్ మరియు ఆరెంజ్ కలర్ డీటేల్స్‌తో గార్నిష్ చేశారు. ఈ స్కూటర్ అలంకరణను పెంచడానికి ఇందులో ఆకర్షణీయమైన బాడీ గ్రాఫిక్స్‌ను కూడా జోడించారు. చాలా ఆకర్షణీయమైన శైలిలో ఉండే అద్దాలు, రిఫ్లెక్టర్లు, బ్రేక్ లైట్లు మరియు టైర్ హ్యాకర్లను ఈ స్కూటర్‌లో గమనించవచ్చు.

మొట్టమొదటి బిఎమ్‌డబ్ల్యూ ఎలక్ట్రిక్ స్కూటర్‌ ఆవిష్కరణ; రేంజ్ ఎంతో తెలుసా?

బిఎమ్‌డబ్ల్యూ సిఈ04 ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 10.25 ఇంచ్ టిఎఫ్‌టి కలర్ స్క్రీన్ డిస్‌ప్లే యూనిట్ ఉంటుంది. ఇది నావిగేషన్ మరియు స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీని సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా, అనేక రకాల సమాచారాన్ని ఈ డిస్‌ప్లేపై ప్రదర్శిస్తుంది. ఇంకా ఇందులో ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, మల్టీ-రైడింగ్ మోడ్‌లు మరియు కీలెస్ స్టార్ట్ వంటి ఫీచర్లు మరెన్నో ఉన్నాయి.

మొట్టమొదటి బిఎమ్‌డబ్ల్యూ ఎలక్ట్రిక్ స్కూటర్‌ ఆవిష్కరణ; రేంజ్ ఎంతో తెలుసా?

ఇక ఎలక్ట్రిక్ స్కూటర్ పవర్‌ట్రైన్ విషయానికి వస్తే, ఇందులో 8.9 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్‌ను ఉపయోగించారు. ఇది పూర్తి ఛార్జీపై 130 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. ఈ బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయడానికి 4 గంటల 20 నిమిషాలు సమయం పడుతుంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ మరియు బ్యాటరీలు 20 బిహెచ్‌పి నుండి 41.5 బిహెచ్‌పిల వరకు శక్తిని ఉత్పత్తి చేయదగలదు.

మొట్టమొదటి బిఎమ్‌డబ్ల్యూ ఎలక్ట్రిక్ స్కూటర్‌ ఆవిష్కరణ; రేంజ్ ఎంతో తెలుసా?

బిఎమ్‌డబ్ల్యూ సిఈ04 ఎలక్ట్రిక్ స్కూటర్‌లో బ్రష్-లెస్ డిసి (బిఎల్‌డిసి) ఎలక్ట్రిక్ మోటారును ఉపయోగించారు. ఈ స్కూటర్ బెల్ట్ డ్రైవ్‌తో నడుస్తుంది. సాధారణ ఎలక్ట్రిక్ స్కూటర్ల మాదిరిగా కాకుండా ఇందులో ఎలక్ట్రిక్ మోటార్ మధ్య భాగంలో ఉండి, బెల్ట్ సాయంతో ముందుకు నడిపిస్తుంది. ఈ మోటర్ గరిష్టంగా గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడానికి సహకరిస్తుంది. ఇది కేవలం 2.6 సెకన్లలోనే గంటకు 0 నుండి 50 కి.మీ వేగాన్ని చేరుకోగలదు.

Most Read Articles

English summary
BMW EC04 Electric Scooter Officially Unveiled, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X