వామ్మో సీట్ క్రింద సైలెన్సర్లా..? కస్టమైజ్డ్ బిఎమ్‌డబ్ల్యూ జి310ఆర్ బైక్

మోటార్‌సైకిళ్లను తమకు నచ్చినట్లుగా కస్టమైజ్ చేసుకోవటానికి చాలా మంది ఇష్టపడుతుంటారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాల మోటారుసైకిల్ తయారీదారులు ఉన్నట్లే, మోటారుసైకిల్ యజమాని కోరికలకు అనుగుణంగా వాటిని మోడిఫై చేసే కంపెనీలు కూడా ఉన్నాయి.

వామ్మో సీట్ క్రింద సైలెన్సర్లా..? కస్టమైజ్డ్ బిఎమ్‌డబ్ల్యూ జి310ఆర్ బైక్

అలాంటి ఓ సంస్థ కె-స్పీడ్. భారీ ఆకారాల్లో ఉండే మోటార్‌సైకిళ్లను చిన్నవిగా కనిపించేలా కస్టమైజ్ చేయటం ఈ కంపెనీ స్పెషాలిటీ. గతంలో ఈ సంస్థ హోండా క్రోమ్ మరియు టాక్టికల్ సిడి 125 వంటి మినీ బైక్‌లను కూడా మోడిఫై చేసి, అందరిచేతా ఔరా అనిపించుకుంది.

వామ్మో సీట్ క్రింద సైలెన్సర్లా..? కస్టమైజ్డ్ బిఎమ్‌డబ్ల్యూ జి310ఆర్ బైక్

తాజాగా కె-స్పీడ్ జర్మన్ లగ్జరీ టూవీలర్ బ్రాండ్ బిఎమ్‌డబ్ల్యూ మోట్రాడ్ అందిస్తున్న జి310ఆర్ మోటార్‌సైకిల్‌ను కస్టమైజ్ చేసింది. ఇది బిఎమ్‌డబ్ల్యూ మోట్రాడ్ నుండి లభిస్తున్న ఎంట్రీ లెవల్ స్పోర్ట్స్ బైక్. గడచిన అక్టోబర్ నెలలో కంపెనీ ఈ బైక్స్‌ను భారత మార్కెట్లో కూడా విడుదల చేసింది.

వామ్మో సీట్ క్రింద సైలెన్సర్లా..? కస్టమైజ్డ్ బిఎమ్‌డబ్ల్యూ జి310ఆర్ బైక్

కె-స్పీడ్ కస్టమైజ్ చేసిన బిఎమ్‌డబ్ల్యూ జి310ఆర్ స్పోర్ట్స్ బైక్ అతి తక్కువ బాడీ ప్యానెల్స్‌తో చాలా విశిష్టమైన కెఫే రేసర్ లాంటి డిజైన్‌ను కలిగి ఉంది. మంచి రగ్గడ్ లుక్‌తో కూడిన ఆఫ్-రోడర్ మోటార్‌సైకిల్‌లా ఇది కనిపిస్తుంది. ఈ మోడిఫైడ్ మోటార్‌సైకిల్‌కు 'రోడ్ రంబ్లర్' అనే పేరును కూడా పెట్టారు.

వామ్మో సీట్ క్రింద సైలెన్సర్లా..? కస్టమైజ్డ్ బిఎమ్‌డబ్ల్యూ జి310ఆర్ బైక్

స్టాక్ వెర్షన్ బిఎమ్‌డబ్ల్యూ జి310ఆర్ బైక్‌కి మరియు ఈ మోడిఫైడ్ రోడ్ రంబ్లర్ బైక్‌కి డిజైన్ పరంగా చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. స్టాక్ వెర్షన్ చూడటానికి క్లాసీగా, అందంగా కనిపిస్తుంది. కాగా, ఈ మోడిఫైడ్ రోడ్ రంబ్లర్ మజిక్యులర్ డిజైన్‌ని కలిగి ఉంది. ఈ మోడిఫైడ్ బైక్‌లో అనేక భాగాలను మార్చినప్పటికీ, దాని ఒరిజినల్ ఎమ్-స్పోర్ట్ థీమ్ బాడీ పెయింట్‌ను మాత్రం మార్చలేదు.

వామ్మో సీట్ క్రింద సైలెన్సర్లా..? కస్టమైజ్డ్ బిఎమ్‌డబ్ల్యూ జి310ఆర్ బైక్

ఎరుపు, తెలుపు మరియు నీలం రంగుల కలయికతో ఇది చూడటానికి చాలా అందంగా కనిపిస్తుంది. బిఎమ్‌డబ్ల్యూ జి310ఆర్ బైక్‌లో కంపెనీ అందించిన ఫ్యాక్టరీ ఫిట్టెడ్ హెడ్‌ల్యాంప్‌ను తొలగించి, దాని స్థానంలో ఫ్రంట్ మడ్‌గార్డ్‌పై రెట్రో-స్టైల్ ఎల్‌ఈడి హెడ్‌లైట్‌ను అమర్చారు. ఈ మార్పు వలన దీని ఫ్రంట్ డిజైన్ కాస్తంత ఎబ్బెట్టుగా అనిపిస్తుంది.

వామ్మో సీట్ క్రింద సైలెన్సర్లా..? కస్టమైజ్డ్ బిఎమ్‌డబ్ల్యూ జి310ఆర్ బైక్

అలాగే, ఇందులో స్టాక్ వెర్షన్ సైడ్ మిర్రర్లను తొలగించారు. వాటికి బదులుగా హ్యాండిల్‌బార్ రెండు చివర్లలో చిన్నపాటి గుండ్రటి సైడ్ మిర్రర్లను ఉపయోగించారు. స్టాక్ మోడల్‌లో కనిపించే గోల్డ్ కలర్ అప్‌సైడ్ డౌన్ ఫ్రంట్ సస్పెన్షన్‌ను ఇందులో బ్లాక్ కలర్‌లోకి మార్చారు. అంతేకాకుండా, ముందు వైపు ఫ్యూయెల్ ట్యాంకి దిగువ భాగం మరియు రేడియేటర్ గ్రిల్‌కి పైభాగంలో రెండు గుండ్రటి ఎల్ఈడి ఫాగ్ లైట్లను కూడా జోడించారు.

వామ్మో సీట్ క్రింద సైలెన్సర్లా..? కస్టమైజ్డ్ బిఎమ్‌డబ్ల్యూ జి310ఆర్ బైక్

రోడ్ రంబ్లర్‌లో చేసిన సీట్ మోడిఫికేషన్ కారణంగా, ఈ బైక్ పొడవు చాలా తగ్గిపోతుంది. ఇందులో సింగిల్ పీస్ సీటును జోడించారు. ఈ సీట్ చాలా పలుచగా ఉంటుంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఇందులోని ఎగ్జాస్ట్ (సైలెన్సర్) పైపులను సరిగ్గా సీటు క్రింది భాగంలో అమర్చారు. రియర్ సస్పెన్షల్‌లో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు.

వామ్మో సీట్ క్రింద సైలెన్సర్లా..? కస్టమైజ్డ్ బిఎమ్‌డబ్ల్యూ జి310ఆర్ బైక్

ఈ మోటార్‌సైకిల్‌లోని టైర్లను కూడా ఇరువైపులా మోడిఫై చేశారు. ఇప్పుడు ఇవి స్టాక్ వెర్షన్ కన్నా మరింత పెద్ద టైర్లను కలిగి ఉంటాయి. ఈ మార్పులతో బిఎమ్‌డబ్ల్యూ జి310ఆర్ ట్రెడిషనల్ స్ట్రీట్ ఫైటర్ లుక్ నుండి నియో-రెట్రో స్క్రాంబ్లర్ లుక్‌లోకి మారిపోతుంది. అయితే, ఇందులో ఇంజన్ పరంగా మాత్రం ఎలాంటి మార్పు లేదు.

వామ్మో సీట్ క్రింద సైలెన్సర్లా..? కస్టమైజ్డ్ బిఎమ్‌డబ్ల్యూ జి310ఆర్ బైక్

భారతదేశంలో, బిఎమ్‌డబ్ల్యూ జి310ఆర్ మోటార్‌సైకిల్ స్టాక్ వెర్షన్ ప్రారంభ ధర రూ.2.50 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంటుంది. మనదేశంలో ఇది బిఎమ్‌డబ్ల్యూ నుండి లభిస్తున్న అత్యంత చౌకైన బైక్. ఈ బైక్‌లో అమర్చిన 313 సిసి, సింగిల్ సిలిండర్, ఫ్యూయల్ ఇంజెక్ట్, లిక్విడ్ కూల్డ్ ఇంజన్‌ ఉంటుంది.

వామ్మో సీట్ క్రింద సైలెన్సర్లా..? కస్టమైజ్డ్ బిఎమ్‌డబ్ల్యూ జి310ఆర్ బైక్

ఈ ఇంజన్ గరిష్టంగా 33.1 బిహెచ్‌పి శక్తిని మరియు 28 న్యూటన్ మీటర్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. వీటిలో పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ముందు వైపు అప్-సైడ్ డౌన్ మరియు వెనుక వైపు మోనో షాక్ సస్పెన్షన్ సెటప్ ఉంటుంది. ఇంకా ఇందులో ఫ్రంట్ అండ్ రియర్ డిస్క్ బ్రేక్స్ ఉంటాయి, ఇవి రెండూ డ్యూయెల్ ఛానెల్ ఏబిఎస్‌ను సపోర్ట్ చేస్తాయి.

చిత్ర సౌజన్యం: కె-స్పీడ్ కస్టమ్

Most Read Articles

English summary
BMW G 310 R Modified Into A Neo-retro Scrambler By K-Speed Customs, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X