భారత్‌లో వేగంగా దూసుకెళ్తున్న Boom Corbett eBike బుకింగ్స్: పూర్తి వివరాలు

దేశీయ మార్కెట్లో ఇటీవల కాలంలో తమిళనాడుకు చెందిన బూమ్ మోటార్స్ (Boom Motors) కంపెనీ కార్బెట్ ఈవి (Corbett EV) అనే ఎలక్ట్రిక్ స్కూటర్ ని రూ. రూ. 89,999 (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్స్ 2021 నవంబర్ 12 నుంచి అధికారికంగా ప్రారంభమయ్యాయి.

ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ దేశీయ మార్కెట్లో విడుదలైనప్పటి నుంచి ఇప్పటికి ఏకంగా 36,000 బుకింగ్లకు స్వీకరించింది. అయితే డెలివరీలు 2022 జనవరి నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది.

భారత్‌లో వేగంగా దూసుకెళ్తున్న Boom Corbett eBike బుకింగ్స్: పూర్తి వివరాలు

బూమ్ కార్బెట్ ఈబైక్ (Boom Corbett eBike) దేశంలో 60 డీలర్‌షిప్‌లను కలిగి ఉంది. అయితే వచ్చే ఏడాది దీనిని 250 డీలర్‌షిప్‌లకు పెంచాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. అంతే కాకుండా కేవలం 2022 లో ఒక లక్ష యూనిట్లను విక్రయించాలని కూడా కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల చేసినప్పటినుంచి నుండి కస్టమర్ల నుండి గొప్ప స్పందన వస్తోంది.

భారత్‌లో వేగంగా దూసుకెళ్తున్న Boom Corbett eBike బుకింగ్స్: పూర్తి వివరాలు

బూమ్ కార్బెట్ ఈబైక్ (Boom Corbett eBike) తమిళనాడులోని కోయంబత్తూర్‌లో తయారు చేయబడింది, ఇక్కడున్న కంపెనీ ఫ్యాక్టరీ ఏటా 1,00,000 బైక్‌లను ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. కంపెనీ ఇప్పటికి ఈ బైక్ యొక్క విక్రయాలు దాదాపు రూ. 400 కోట్లు దాటాయి. అతి తక్కువ కాలంలో కంపెనీ సాధించిన అతి పెద్ద విజయం అనే చెప్పాలి.

భారత్‌లో వేగంగా దూసుకెళ్తున్న Boom Corbett eBike బుకింగ్స్: పూర్తి వివరాలు

ఇండియన్ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త కార్బెట్ ఈవి (Corbett EV) ఎలక్ట్రిక్ స్కూటర్ చూడటానికి చాలా సింపుల్ గా మరియు చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. బూమ్ మోటార్స్ విడుదల చేసిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రెండు వేరియంట్లలో పరిచయం చేయబడింది. అవి సింగిల్ బ్యాటరీతో కూడిన కార్బెట్ 14 మరియు డబుల్ బ్యాటరీతో కూడిన కార్బెట్ 14-EX స్కూటర్స్.

భారత్‌లో వేగంగా దూసుకెళ్తున్న Boom Corbett eBike బుకింగ్స్: పూర్తి వివరాలు

పూర్తిగా ఛార్జ్ చేసిన తరువాత, కార్బెట్ 14 స్కూటర్ 100 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. అదే సమయంలో కార్బెట్ 14-EX స్కూటర్స్ దాదాపు 200 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. మొత్తానికి ఈ స్కూటర్ వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. కావున ఇది నగర పరిస్థితుల్లో చాలా మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తుంది.

భారత్‌లో వేగంగా దూసుకెళ్తున్న Boom Corbett eBike బుకింగ్స్: పూర్తి వివరాలు

ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లలో, కార్బెట్ 14 గరిష్టంగా 3 కిలోవాట్ మరియు కార్బెట్ 14-EX 4 కిలోవాట్ శక్తిని ఉత్పత్తి చేయగలదు. రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు హై స్పీడ్ సెగ్మెంట్‌లో విడుదల చేయబడ్డాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ల గరిష్ట వేగం వరుసగా 65 కిమీ/గం మరియు 75 కిమీ/గం వరకు ఉంటుంది.

భారత్‌లో వేగంగా దూసుకెళ్తున్న Boom Corbett eBike బుకింగ్స్: పూర్తి వివరాలు

కార్బెట్‌ ఎలక్ట్రిక్ స్కూటర్ ను సాధారణ ఛార్జర్‌తో ఛార్జ్ చేయడానికి 4 గంటలు సమయం పడుతుంది. అదే సమయంలో ఫాస్ట్ ఛార్జ్‌తో ఛార్జ్ చేయడానికి కేవలం 2.5 గంటలు మాత్రమే పడుతుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 30-లీటర్ల బూట్ స్పేస్ ఉంది. అంతే కాకుండా ఇందులోని స్టోరేజ్ స్పేస్‌ను పెంచడానికి యాక్ససరీస్ జోడించవచ్చు. ఇది వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

భారత్‌లో వేగంగా దూసుకెళ్తున్న Boom Corbett eBike బుకింగ్స్: పూర్తి వివరాలు

బూమ్ మోటార్స్ దేశీయ మార్కెట్ కోసం ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీ సీఈఓ తెలిపారు. ఇందులో భాగంగానే కంపెనీ కేవలం 18 నెలల్లో కార్బెట్ ఈ-స్కూటర్‌ను అంతర్గతంగా అభివృద్ధి చేసినట్లు కూడా బూమ్ మోటార్స్ అధికారికంగా తెలిపింది.

భారత్‌లో వేగంగా దూసుకెళ్తున్న Boom Corbett eBike బుకింగ్స్: పూర్తి వివరాలు

కంపెనీ ఇప్పుడు తన రెండు ఎలక్ట్రిక్ స్కూటర్‌లపై 7 సంవత్సరాల వారంటీని అందిస్తోంది. అయితే IoT-ప్రారంభించబడిన స్మార్ట్ బ్యాటరీ 5 సంవత్సరాల వారంటీతో వస్తుంది. బ్యాటరీ జీవితకాలం ముగిసిన తర్వాత, బూమ్ మోటార్స్ దానిని కస్టమర్ నుండి తిరిగి కొనుగోలు చేస్తుంది మరియు అది రీసైకిల్ చేయబడుతుంది.

భారత్‌లో వేగంగా దూసుకెళ్తున్న Boom Corbett eBike బుకింగ్స్: పూర్తి వివరాలు

ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ మరింత మన్నికైనదిగా ఉండటానికి, కంపెనీ ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్‌లతో పోలిస్తే 40 శాతం తక్కువ భాగాలను ఉపయోగించింది. ఈ కారణంగా విచ్ఛిన్నమయ్యే అవకాశాలను చాలా వరకు తగ్గిస్తుంది. కంపెనీ టీవీఎస్ గ్రూప్ యాజమాన్యంలోని KI మొబిలిటీతో భాగస్వామ్యాన్ని కూడా కలిగి ఉంది. దీని ద్వారా తన కస్టమర్‌లు దేశవ్యాప్తంగా 24,000 సర్వీస్ టచ్‌పాయింట్‌లను చేరుకోవడానికి అనుమతిస్తుంది. ఇది వాహన వినియోగదారులకు చాలా అనుకూలమగా ఉంటుంది. కావున అద్భుతమైన సర్వీస్ వంటి వాటిని కూడా కొనుగోలుదారులు పొందవచ్చు.

భారత్‌లో వేగంగా దూసుకెళ్తున్న Boom Corbett eBike బుకింగ్స్: పూర్తి వివరాలు

అయితే కంపెనీ యొక్క అమ్మకాల విషయానికి వస్తే, ఈ కొత్త కార్బెట్‌ ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చని బూమ్ మోటార్స్ తెలిపింది. కార్బెట్ 14 స్కూటర్ ని కేవలం రూ. 1,699 మరియు కార్బెట్ 14-ఎక్స్ స్కూటర్ ని రూ. 2,499 నుండి EMI ప్లాన్‌లతో కొనుగోలు చేయవచ్చు.

Most Read Articles

English summary
Boom corbett ebike gets 36000 booking delivery details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X