అతి తక్కువ ధరకే బౌన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్.. పూర్తి వివరాలు

ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు రోజు రోజుకి డిమాండ్ బాగా పెరిగిపోతున్న కారణంగా, భారత మార్కెట్లోని చాలా కంపెనీలు ఇప్పటికే తమ ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేశాయి, అంతే కాకుండా మరికొన్ని కంపెనీలు ఎలక్ట్రిక్ వాహన తయారీలో నిమగ్నమై ఉన్నాయి. ఈ తరుణంలో బెంగళూరుకు చెందిన ద్విచక్ర వాహన మొబిలిటీ సంస్థ బౌన్స్ దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది.

అతి తక్కువ ధరకే బౌన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్.. పూర్తి వివరాలు

బౌన్స్ కంపెనీ అందించిన సమాచారం ప్రకారం 2022 నాటికి తమ వాహనాలన్నీ ఎలక్ట్రిక్‌గా మారుస్తామని ప్రకటించింది. ఇప్పుడు కంపెనీ విడుదల చేసిన ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను బౌన్స్ యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఈ యాప్ లో ఎలక్ట్రిక్ స్కూటర్ కి సంబంధించిన సబ్స్క్రిప్సన్ ప్లాన్ మరియు లాంగ్ టైమ్ రెంటల్ వంటవి అందుబాటులో ఉంటాయి.

అతి తక్కువ ధరకే బౌన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్.. పూర్తి వివరాలు

బౌన్స్ కంపెనీ ఈ సర్వీస్ ప్రస్తుతం కేవలం బెంగళూరు నగరంలో మాత్రమే అందిస్తోంది. కంపెనీ చాలా రోజులనుంచి ఎలక్ట్రిక్ వాహనాలపై పనిచేస్తోంది. ఏది ఏమైనా ఎట్టకేలకు మనదేశంలో పూర్తిగా తయారైన ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రవేశపెట్టింది. ఈ స్కూటర్ 100 సిసి మోపెడ్ వంటి సామర్ధ్యం కలిగి ఉంటుంది.

MOST READ:సన్నీలియోన్ భర్త కార్ నెంబర్ ఉపయోగిస్తూ పట్టుబడ్డ వ్యక్తి, పోలీసులకు ఏం చెప్పాడంటే?

అతి తక్కువ ధరకే బౌన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్.. పూర్తి వివరాలు

ఈ బౌన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఇద్దరు వ్యక్తులను సులభంగా కూర్చోవచ్చు. ఈ స్కూటర్ యొక్క ముందు మరియు వెనుక భాగంలో డిస్క్ బ్రేక్‌లు అమర్చబడి ఉంటాయి. ఈ స్కూటర్‌లో సౌకర్యవంతమైన సీటింగ్ కూడా ఉంది. ఈ స్కూటర్ ప్రత్యేకంగా నగరంలో నెమ్మదిగా ప్రయాణించడానికి అనుకూలంగా రూపొందించబడింది.

అతి తక్కువ ధరకే బౌన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్.. పూర్తి వివరాలు

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క వేగం గంటకు 25 కిమీ నుంచి 30 కి.మీ. ఈ స్కూటర్ పూర్తి ఛార్జీతో 60 కిలోమీటర్ల పరిధిని అందించగలదు, ఇది పట్టణ ప్రాంతాల్లో నడపడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ స్కూటర్‌లో కంపెనీ రిమూవబుల్ బ్యాటరీని ఉపయోగించింది, ఈ బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ చేసిన తర్వాత స్కూటర్ నుండి తొలగించవచ్చు.

MOST READ:కార్ టైర్ మారుస్తూ కనిపించిన డిప్యూటీ కమిషనర్ రోహిణి సింధూరి [వీడియో]

అతి తక్కువ ధరకే బౌన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్.. పూర్తి వివరాలు

బౌన్స్ కంపెనీ తమ ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం నగరంలో ఛార్జింగ్ స్టేషన్లను నిర్మిస్తోంది. ఈ ఛార్జింగ్ స్టేషన్స్ లో ఛార్జ్ చేసుకోవచ్చు, అంతే కాకుండా ఛార్జింగ్ చేసి డిశ్చార్జ్ చేసిన బ్యాటరీలతో భర్తీ చేయవచ్చు. సాధారణంగా ఎలక్ట్రిక్ వాహనాలకు ఛార్జ్ చేసుకోవడం కంటే బ్యాటరీ మార్పిడి చాలామంచిది భావిస్తారు. బ్యాటరీ మార్పిడి ద్వారా చాలా సమయాన్ని ఆదా చేస్తుంది.

అతి తక్కువ ధరకే బౌన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్.. పూర్తి వివరాలు

ఛార్జింగ్ స్టేషన్‌తో పాటు బ్యాటరీ మార్పిడి సౌకర్యాన్ని అభివృద్ధి చేయడానికి బెంగళూరులోని పలు కంపెనీలు కూడా కృషి చేస్తున్నాయి. ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క బ్యాటరీని ఒక నిమిషం లోపల మార్చుకోవచ్చని బౌన్స్ పేర్కొంది.

MOST READ:45 లీటర్ల ఇంధన ట్యాంక్‌లో 48 లీటర్ల పెట్రోల్.. దీనితో మొదలైన గొడవ.. చివరికి ఏమైందంటే

అతి తక్కువ ధరకే బౌన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్.. పూర్తి వివరాలు

బౌన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రూ. 46,000 కు కొనుగోలు చేయవచ్చు. ఇక్కడ గమనించవలసిన ఒక విషయం ఏమిటంటే బ్యాటరీ ధర స్కూటర్ ధరలో చేర్చలేదు. స్కూటర్ బ్యాటరీలను లీజుకు తీసుకోవడానికి కూడా వినియోగదారులకు అందుబాటులో ఉంచనున్నారు.

అతి తక్కువ ధరకే బౌన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్.. పూర్తి వివరాలు

ప్రస్తుతం, బౌన్స్ బెంగళూరు మరియు హైదరాబాద్ వంటి నగరాలలో పనిచేస్తోంది. కంపెనీ బెంగళూరులో 22,000 స్కూటర్లు, హైదరాబాద్‌లో 5,000 స్కూటర్లతో రైడ్ బుకింగ్ సర్వీస్ అందిస్తుంది. భవిష్యత్తులో, ఇతర ప్రధాన నగరాలలో తన సర్వీస్ ప్రారంభించడానికి కంపెనీ సన్నాహాలను సిద్ధం చేస్తోంది.

MOST READ:మళ్ళీ పెరిగిన రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 ధరలు ; కొత్త ప్రైజ్ లిస్ట్ ఇదే

అతి తక్కువ ధరకే బౌన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్.. పూర్తి వివరాలు

కొత్త బౌన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ మూడు రకాల రైడ్‌లను అందిస్తుంది. అవి షార్ట్ టైమ్ రెంటల్, లాంగ్ టైమ్ రెంటల్ మరియు రైడ్ షేర్స్ ఆన్ రెంటల్ ప్లాట్‌ఫారమ్‌. షార్ట్ టైమ్ రెంటల్ లో స్కూటర్లను 2 నుంచి 12 గంటల పాటు బుక్ చేసుకోవచ్చు. అదే విధంగా లాంగ్ టైమ్ రెంటల్ లో 15 నుంచి 45 రోజులు బుక్ చేసుకోవచ్చు. రైడ్‌కు ముందు కంపెనీ అన్ని స్కూటర్లను క్రమం తప్పకుండా శుభ్రపరుస్తుంది.

అతి తక్కువ ధరకే బౌన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్.. పూర్తి వివరాలు

ఈ బౌన్స్ ఫిబ్రవరి 2021 లో 4,000 ఎలక్ట్రిక్ స్కూటర్లను ఫ్లీట్ లో చేర్చనుంది. దీని కోసం స్కూటర్లు వేగంగా ఉత్పత్తి అవుతున్నాయి. భారతదేశంలోని క్యాబ్ కంపెనీ ఓలా కూడా ఎలక్ట్రిక్ స్కూటర్ల ల్యాండింగ్ ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే.

Most Read Articles

English summary
Bounce E-Electric Scooter Launched Booking Started Via App. Read in Telugu.
Story first published: Sunday, February 28, 2021, 10:02 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X